ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఒక సంచలనం.. ఆయన తండ్రి మరణానంతరం జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కి ఎదురు తిరిగి, సొంతగా పార్టీని స్థాపించి.. 9 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా పోరాడి, ఎన్నో కష్టాలు, ఆరోపణలు ఎదుర్కోని, జైలు జీవితం గడిపి ఎట్టకేలకు 2019 లో అధికారంలోకి వచ్చారు. అయితే అధికారం చేపట్టిన నాటి నుంచి ఆయన నిత్యం ప్రజా క్షేత్రంలోనే ఉంటున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ తనదైన పాలనలో దూసుకుపోతున్నారు.

 

ముఖ్యంగా ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాలను నెరవేర్చడమే టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అయితే సీఎం జగన్ ఎన్నికల సమయంలో తాను అధికారంలోకి వస్తే జిల్లాల విభజన చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ జిల్లాల విభజన పై సీఎం జగన్ దృష్టి పెట్టినట్టు సమాచారం. గణతంత్ర దినోత్సవం లోపు జిల్లాల విభజన పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఈ జిల్లాల విభజనతో రాజకీయాంగాను లబ్ధి పొందేందుకు జగన్ చూస్తున్నారు. అందులో ముఖ్యమైనది కృష్ణాజిల్లా విభజన. ఎందుకంటే.. ఎన్నికల సమయంలో కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో అప్పట్లోనే టీడీపీకి షాక్ తగిలింది.

 

ఇప్పుడు జగన్ ఇచ్చిన హామీ మేరకు జిల్లా విభజన చేయనున్నారు. ఈ క్రమంలో  కృష్ణా జిల్లాను రెండుగా విభజించనున్నారు. ఎన్టీఆర్ జన్మించిన నిమ్మకూరు ఏ జిల్లాకు వెళ్తుందో ఆ జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేయనున్నారు సీఎం జగన్. దీని ద్వారా టీడీపీని దెబ్బతీసే ప్రయత్నం చేయబోతున్నారని సమాచారం. అదేవిధంగా ఆ పార్టీకి కీలకమైన కమ్మ సామాజిక వర్గం ఓటు చీల్చే ప్రయత్నం చేయబోతున్నట్టు రాజకీయ వర్గాల్లో వినికిడి. అలాగే దీంతో పాటు కొత్తగా ఏర్పాటు అయ్యే జిల్లాలకు ప్రముఖుల పేర్లు పెట్టనున్నారు. ఒక వేల ఇదే జరిగితే మాత్రం టీడీపీకి గట్టి దెబ్బ తగిలినట్టే అనే భావిస్తున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: