రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో వైసీపీ మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేయడమే కాకుండా, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఆయన పనిచేస్తున్నారనే అనేక ఆధారాలను బయటపెట్టి హడావుడి చేసింది. అయితే కేవలం రాజకీయ కోణంలోనే వైసీపీ ఈ విధంగా వ్యవహరిస్తోందని, అనవసరంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఆడిపోసుకుంటున్నారు అని, రాజ్యాంగ సంస్థలు అంటే వైసీపీ ప్రభుత్వానికి గౌరవం లేదని, ఇలా అనేక విమర్శలు వచ్చాయి. ప్రజల్లోనూ, నిమ్మగడ్డ వ్యవహారంపై వైసీపీ తప్పు చేస్తుందనే భావన కలిగింది. హైకోర్టులో అయితే వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పు పడుతూ న్యాయమూర్తులు వ్యాఖ్యానించిన సంఘటనలు చోటు చేసుకోవడంతో మొత్తం ఈ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం అభాసుపాలైంది అనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమైంది.

IHG

 

 అయినా వైసీపీ ప్రభుత్వం మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు సానుభూతిపరుడు అని చెప్పేందుకు ప్రయత్నిస్తూనే, ఆయనపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆయనపై తమకు నమ్మకం లేదని, ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ కమిషనర్ గా అంగీకరించేది లేదు అన్నట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వైసీపీ మంత్రి కొడాలి నాని సైతం నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వైసిపి ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చి గవర్నర్ ఆమోదంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఆ పదవి నుంచి తప్పించి కనగరాజ్ అనే వ్యక్తిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారం లో వైసీపీ ప్రభుత్వం కాస్త అభాసుపాలు అయింది.

IHG


 సీనియర్ ఐఏఎస్ అధికారి ఈ విధంగా అవమానించడం సరికాదు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన బిజెపి నాయకులు, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ రావు తో హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్లో భేటీ అవ్వడం, ఆ భేటీకి సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ బయటికి రావడం, ఈ వ్యవహారంపై మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తుండడంతో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన ఆరోపణల్లో నిజం ఉందని, నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారశలి అనుమానాస్పదంగా ఉండటంతోనే వైసీపీ ఇంతగా పోరాడింది అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. 


అసలు చంద్రబాబు కు సంబంధించిన వ్యక్తులుగా ముద్రపడ్డ బిజెపి నాయకులతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంత రహస్యంగా భేటీ అవ్వడం వెనుక కారణాలు ఏంటి అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ సమయంలో ఆయన ఈ విధంగా వ్యవహరించడంతో పూర్తిగా అభాసుపాలయ్యారు. ఇప్పుడు వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ స్పందించక పోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

  

మరింత సమాచారం తెలుసుకోండి: