నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫుటేజీ లీక్ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి..? అది బయటకి తెప్పిచ్చిన ఆ వ్యక్తి ఎవరు..? దీనికి గల కారణాలు ఏంటి..? ఇప్పుడు ఇలాంటి అనేక ప్రశ్నలే ఆంధ్రుల మదిలో మెదులుతున్నాయి. దీనిపై చాలా రకాల అభిప్రాయాలే వినిపిస్తునాయి.. టీడీపీ వాదన విషయానికొస్తే. అది రాజకీయంగా మరో సంచలనం రేపబోతుందనే తెలుస్తుంది.

 

నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెళ్లి బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అదే విధంగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ని కలవడంపై ఇప్పుడు వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహంగా ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కలిసి వైసీపీ పార్టీపై ఏవో కుట్రలు పన్నుతున్నారంటూ వైసీపీ నేతలు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ విమర్శలు చేయడం రెండు మూడు రోజుల నుంచి ఎక్కువగా చూస్తున్నాం. వాస్తవానికి వాళ్ళ ముగ్గురి భేటీతో ఎవరికి పెద్దగా నష్టంలేదు.. కానీ దీనిపై ఇంత హడావుడి చేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో విజయసాయి రెడ్డి మీద 108 కుంభకోణం విషయంలో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆయన ఇప్పటివరకు నోరు మెదపలేదు.. పైగా అధిష్టానం  వర్గం కూడా ఆయనపై గుర్రుగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి.

 

దీంతో ఆయన అయోమయంలో పడి.. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న సమయంలో.. నెల్లూరు జిల్లాకి చెందిన ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, విజయసాయి రెడ్డికి ఒక సలహా ఇచ్చారట. నిమ్మగడ్డ వ్యవహారం అప్పటికే బయటికి రావడంతో.. దాన్ని బాగా వైరల్ చేయాలని భావించారట. దాని ద్వారా మీడియా దృష్టిని మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. త్వరలోనే ఇలాంటివి ఇంకా ఎన్నో చూడవచ్చు అని చెప్తున్నారు. విజయసాయి రెడ్డి మీద విశాఖలో భూ అక్రమాల ఆరోపణలు కూడా ఉన్నాయని అవి కూడా బయటకు వచ్చే అవకాశం ఉండటంతోనే ఈ విధంగా స్కెచ్ వేసారని అటు టీడీపీ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. మరి ఎవరి వ్యూహాలు పని చేస్తాయో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: