ఇది అసలే జనాలకు కష్టకాలం.. అంతకుమించి కరోనా కాలం. ఈ సమయంలో ప్రజల ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లాక్ డౌన్ కారణంగా జనాలంతా కుదేలు అయిపోయారు. ఇప్పటికీ వ్యాపారాలు అరకొరగానే సాగుతున్నాయి. చేసేందుకు పని లేక, తినేందుకు తిండి లేక జనాలు అల్లాడుతున్నారు. ఇక ఈ కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వారు ఎందరో, మరెందరో జీతాలు కోతలకు గురయ్యి ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. విద్య, ఉపాధి అన్ని కరువై రోడ్డున పడ్డారు. ప్రపంచమంతా ఇదే పరిస్థితి ఉన్నా, చాలా దేశాలు తమ ప్రజలను ఆదుకునేందుకు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు జమ చేస్తున్నాయి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఉన్నా , అలా ఎక్కువ కాలం జనాలను పోషించే అంత ఆర్ధిక శక్తీ దేశానికీ లేదు. 

IHG


ఇక కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు కేంద్రం 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. అది అసలు ఎక్కడ అమలవుతుందో, ఆ ప్యాకేజీ అంటూ ఉందనే విషయాన్ని సైతం అందరూ మరిచిపోయారు. ఇటువంటి సమయంలో సామాన్యుల బతుకును నిలబెట్టాల్సిన కేంద్రం జనాల నెత్తిన మరింత భారం మోపి ఆర్థిక లోటు పూడ్చుకోవాలని చూస్తుండటంతో బీజేపీ ప్రభుత్వంపై జనాల్లో అసహనం , ఆగ్రహం పెరిగిపోతున్నాయి. కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ, కేవలం కాగితాలకే పరిమితం అయిపోయిందని, ప్రజా ఉద్యోగాలు, జీతలు, పథకాలు ఏది కేంద్రం  చెప్పినంత స్థాయిలో అమలు కాలేదు అనే విషయాన్ని చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వయంగా మోదీకే ఫిర్యాదు చేశారు. అయినా మోదీ మనసు కరగలేదు.

IHG


 ప్రజలకు ఏ ప్యాకేజీ అందలేదు అన్నట్టుగానే పరిస్థితి ఉంది. పోనీ ఆయన ఇబ్బందులు ఆయనకు ఉంటాయని ఊరుకున్నా, ఈ కష్ట సమయంలో ధరలు పెంచితే సామాన్యుల పరిస్థితి ఏమిటి అనేది ఆలోచించకుండానే... ఇప్పుడు ధరలు పెంచుకుని ఖజానా నింపుకునే విషయంపై మోదీ దృష్టి పెట్టడం తో పెద్ద ఎత్తున బిజెపి ప్రభుత్వం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ఆ ప్రభావం అన్ని రంగాలపైనా ఉంటుందనేది మోదీకి తెలియంది కాదు. వరుసగా 18వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోతోంది.

 

IHG

 

 అంతర్జాతీయంగా ముడి చమురు ధర 20 డాలర్లకు పడిపోయినా,  ఆ తగ్గింపు ప్రజలకు అందకుండా, మెట్రోనగరాల్లో పెట్రోల్ ధర 18 రోజులుగా పెంచుతూనే వస్తున్నారు. ఈ 18 రోజుల్లో మోడీ ప్రభుత్వం లీటర్ కు 8.50 వరకు పెంచింది. డీజిల్ పై 10.50 రూపాయలు పెంచింది. ఒకపక్క కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వ్యాపారాలు పుంజుకోలేదు, ప్రజల చేతిలో సొమ్ములు కూడా కనిపించడం లేదు. మరికొద్ది రోజుల్లోనే అంతా ఒక గాడిలో పడుతుంది అనుకుంటున్న సమయంలో, ఇలా ఒక్కో రంగంపై ధరలు పెంచుకుంటూ, ఖజానా నింపుకునే ఆలోచనలో కేంద్రం ఉండడంతో, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలు కేంద్రం తీరుపై మండిపడుతున్నారు. ఏదో చేస్తారు అనుకుంటే, ఇంకేదో చేస్తున్నారే అంటూ మండిపడుతున్నారు. మోదీ సాబ్ సామాన్యుని ఇలా బతకనివ్వండి అంటూ వేడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: