త‌మ్ముడు మ‌నోడే అయినా.. ధ‌ర్మం చెప్ప‌మ‌న్న‌ట్టు.. మంత్రిగారు త‌న‌ సొంత మ‌నిషే అయినా.. సీఎం జ‌గ ‌న్ క్లాస్ పీకేశార‌ట‌! ఇప్ప‌టికే అర్ధ‌మై పోయి ఉంటుంది!! ఆయ‌నెవ‌రో.. జ‌గ‌న్ ఎందుకు క్లాస్ పీకేశారో..! ప్ర‌భు త్వం అన్నాక‌.. వ్యూహం.. ప్ర‌తిప‌క్షం అన్నాక ప్ర‌తివ్యూహం.. కామ‌నే! ఈ వ్యూహ ప్ర‌తివ్యూహాల్లో పైచేయి కో సం రెండు ప‌క్షాలూ నిత్యం కొట్టేసుకోవ‌డం, కుమ్మేసుకోవ‌డం కూడా మ‌న‌కు తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ జోరు పెంచి.. ఇసుక‌పై సై! అంటూ.. జ‌గ‌న్ స‌ర్కారుకు స‌వాళ్లు విసురుతోంది. మేం ఉన్న‌ప్పుడు.. అలా చేశాం.. ఇలా చేశాం.. ఆఖ‌రుకు ఉచితంగా పంచేశాం. అంటూ లెక్క‌ల చిట్టాలు విప్పి.. విడ‌మ‌రిచి మ‌రి చెప్పేస్తున్నారు త‌మ్ముళ్లు. 


కొన్నాళ్ల‌పాటు.. అంటే.. జ‌గ‌న్ స‌ర్కారు ఏర్ప‌డిన కొత్త‌లో వ‌ర‌ద‌లు వ‌చ్చి ఇసుక ల‌భించ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డి న‌ప్పుడు.. అప్ప‌టికే ఉన్న ఇసుక విధానాన్ని పూర్తిగా మార్చాల‌ని జ‌గ‌న్ అనుకున్న‌ప్పుడు కొంత ఇసుక కొర‌త ఏర్ప‌డి.. ఇబ్బందులు తెర‌మీదికి వ‌చ్చాయి. దీంతో ఈ అవ‌కాశాన్ని భారీగా వాడేసుకున్న చంద్రబా బు ఆయ‌న చంద్ర‌దండు.. రెచ్చిపోయి.. ర‌ణ నినాదాలు.. నాదాలు చేసిన విష‌యం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు కూడా ఇసుక ఒక పెద్ద‌టాపిక్ అయిపోయింది. అయితే, ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం మాట అటుం చితే.. అధికార ప‌క్షంలోనే ఇసుక విమ‌ర్శ‌ల తుఫాను రేపుతోంది. మంత్రి పినిపే విశ్వ‌రూప్ నుంచి ఎంపీల వ‌ర‌కు అంద‌రూ కూడా ఇసుక పై విసుగులేకుండా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. 


``ఆన్‌లైన్‌లో బుక్ చేద్దామ‌ని ప్ర‌య‌త్నిస్తే.. ల‌భించ‌ని ఇసుక‌.. తాపీ మేస్త్రీకి చెబితే.. 24 గంట‌ల్లో వ‌చ్చేస్తోం ది! మ‌రి దీనిలో ఏ మాయుందో..?`` అంటూ.. వైఎస్ న‌మ్మిన బంటు మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి నిప్పుమీద ఉ ప్పు మాదిరిగా రెచ్చిపోయారు. ఇక‌, మంత్రి పినిపే విశ్వ‌రూప్‌.. త‌న ఇంటికే నాశిర‌కం ఇసుక‌ను పంపు తారా అంటూ.. మీడియా ముందే ఫైర‌య్యారు. ఇక‌, ప్ర‌తిప‌క్షాల ప‌రిస్థితి పెద్ద‌గా చెప్పేదేముంటుంది? ఎప్పుడు అవ‌కాశం వ‌స్తుందా? అని వారు ఎదురు  చూస్తూనే ఉన్నారు. దీంతో ఈ ఇసుక వ్య‌వ‌హారం.. జ‌గ‌న్ స‌ర్కారు కు త‌ల‌నొప్పిగా మారింది. ఈ ప‌రిణామాల‌కు చెక్ పెట్టేలా.. త‌నే స్వ‌యంగా ఇటీవ‌ల ఇసుక విధానంపై స‌మీక్షించారు. తాడేప‌ల్లి నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా.. జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌తో సీఎం మాట్లాడారు. 


ఈ క్ర‌మంలోనే ఇసుక వివాదానికి చెక్ పెట్టేలా.. ప‌లు సూచ‌న‌లు చేశారు. దీంతో అంద‌రూ `ఓకే సార్‌` అ న్నారు. ఈ స‌మావేశం ముగిసింది. అయితే, ముగిసిన త‌ర్వాతే.. జ‌రిగిన విష‌య‌మే ఇప్పుడు తాజాగా వైసీపీ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌నీయాంశంగా మారి.. `చెవిలో చిన్న‌మాట‌` అంటూ.. హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. వైసీపీ నేత‌లు చెప్పుకొంటున్న‌ విష‌యం ఏంటంటే.. ఇసుక వ్య‌వ‌హారం అంతా కూడా .. గ‌నుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్ర‌రెడ్డి చూస్తున్నారు. ఇసుక విష‌యంపై జ‌గ‌న్ ప‌క్కాగా  వ్య‌వ‌హ‌రించాల‌ని గ‌తంలోనే ఈయ‌న‌కు చెప్పార‌ట‌. అయితే, త‌మ కుటుంబానికి, మ‌రీ ముఖ్యంగా వైఎస్‌కు పెద్దిరెడ్డి అత్యంత స‌న్నిహితుడు కావ‌డంతో సున్నితంగానే జ‌గ‌న్ సూచ‌న‌లు ఇచ్చార‌ట‌!


కానీ, ఇప్పుడు తాజాగా జ‌రిగిన స‌మీక్ష స‌మావేశం.. అనంత‌రం.. మాత్రం పెద్దిరెడ్డికి జ‌గ‌న్ పెద్ద క్లాసే ఇచ్చా ర‌ని చెవిలో చిన్న‌గా చెప్పుకొంటున్నారు వైసీపీ నాయ‌కులు ఎక్కువ‌మందే! ప్ర‌తిప‌క్షాల నాయ‌కులు చేసి న విమ‌ర్శ‌ల‌పై జ‌గ‌న్ ప్ర‌శ్నించ‌క‌పోయినా.. నేరుగా మంత్రి విశ్వ‌రూప్ చేసిన విమ‌ర్శ‌లు స‌హా.. త‌మ కు టుంబానికి విశ్వ‌స‌నీయుడు.. త‌న తండ్రి హ‌యాంలో ఢిల్లీలో చ‌క్రం తిప్పిన నెంబ‌ర్‌2 ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ఇసుక విష‌యంలో చేసిన విమ‌ర్శ‌ల‌పై జ‌గ‌న్ ఒకింత క‌టువుగానే పెద్దిరెడ్డిని ప్ర‌శ్నించార‌ని అం టున్నారు. ``ఇసుక విష‌యాన్ని మ‌న ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది. అయినా ఎక్క‌డ త‌ప్పు జ‌రుగుతోంది?  మీ ప్ర‌మేయం లేకుండానే ఏదైనా జ‌రుగుతోందా?``-అని పెద్దిరెడ్డిని జ‌గ‌న్ సూటిగా ప్ర‌శ్నించార‌ని చెప్పుకొంటున్నారు వైసీపీ నాయ‌కులు. మ‌రి ఈ ప‌రిణామం.. ఇక్క‌డితో ఆగిపోతుందా?  లేక‌.. శాఖ‌ను ఆయ‌న నుంచి త‌ప్పిస్తారా? అనేది కూడా వీరి చ‌ర్చ‌ల మ‌ధ్య సాగ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: