ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకోబోతున్నాయా..? ఒకేసారి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కిక్.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి షాక్ ఇచ్చే పరిణామాలు జరగబోతున్నాయా..? అంటే.. అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 

2019 ఎన్నికల్లో భారీ విజయాన్ని కైవసం చేసుకొని.. 151మంది ఎమ్మెల్యేలతో అధికారం చేపట్టిన సీఎం జగన్ మోహన్ రెడ్డి.. పాలనలో దూసుకుపోతున్నారు. కానీ రాష్ట్ర ప్రగతి కోసం ఆయన ప్రవేశపెట్టే బిల్లులను మాత్రం శాసనమండలిలో నెగ్గించుకోలేకపోతున్నారు. దానికి కారణం శాసనమండలిలో టీడీపీకి ఎక్కువ బలం ఉండటం. దీంతో శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు సీఎం జగన్. దీనికి ప్రతిపక్ష టీడీపీ ఒప్పుకోలేదు.. దీంతో వీరి మధ్య పెద్ద యుద్దమే జరిగింది. కానీ, ఏదోకరకంగా శాసనమండలిని రద్దు చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అయితే ఇది మాత్రం ఇప్పుడప్పుడే రద్దు అయ్యేలా కనపడటం లేదు.

 

ఎందుకంటే మండలి బిల్లు పార్లమెంట్ లో పాస్ కావాలి.. ఆ తర్వాత రాష్ట్రపతి అమోదం తెలిపాలి. కానీ, ప్రస్తుతం కరోనా కారణంగా ఈ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవడం లేదు. అందుకే వైసీపీ కూడా ఇక మండలి రద్దు ఇప్పట్లో జరగదని భావిస్తోంది. ఈ నేపథ్యంలో శాసనమండలిలో బలాన్ని పెంచుకునే దిశగా వైసీపీ అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే టీడీపీకి రాజీనామా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ నే వైసీపీ తరుఫున నిలబెట్టి ఆయన సీటును ఆయనతోనే భర్తీ చేశారు సీఎం జగన్. ఇలా చేయడం ద్వారా టీడీపీ ఎమ్మెల్సీలను ఆకర్షించవచ్చని సీఎం జగన్ భావిస్తున్నారట.

 

ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే సీఎం జగన్ ఇందులో సక్సెస్ అయినట్టే కనిపిస్తున్నారు. సీఎం జగన్ భావించినట్టుగానే టీడీపీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్సీలు ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నట్టు సమాచారం. వైసీపీలో చేరడం ద్వారా.. అధికారంతో పాటు తమ పదవి కూడా తమకే వస్తుందన్న నమ్మకం వారిలో కలిగిందట. ఈ నేపధ్యంలోనే అందరూ మూకుమ్మడిగా త్వరలోనే వైసీపీలో చేరాలని చూస్తున్నారట. ఈ విషయమై ఇప్పటికే వైసీపీ పెద్దలతో కొందరు సంప్రదింపులు కూడా జరిపారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో రెండు వారాల్లో వీరి చేరిక ఉంటుందని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: