వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై కుట్ర జరుగుతుందా..? ఆయనకి సొంత నేతలే వెన్నుపోటు పొడుస్తున్నారా..? తాజాగా, కంత్రీ..ఓ మంత్రి..మ‌ధ్య‌లో ఇంతి కథలో బయటపడ్డ సంచలన నిజాలు చూస్తే అవుననే అనిపిస్తుంది. అసలు ఈ కథ ఏంటి.. ఇందులో బయటపడ్డ ఆ సంచలన నిజాలు ఏంటి.. అనేవి ఇప్పుడు చూద్దాం.

 

ఈ మధ్య కాలంలో టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు అనుచరుడు నలంద కిషోర్.. సోషల్ మీడియాలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ లకు వ్యతిరేకంగా అవమానకరమైన పోస్టు పెట్టాడు.. దీంతో ఏపీ రాజకీయ వర్గాలలో ఒక్కసారిగా కలకలంరేగింది. ఇందుకుగాను నలంద కిషోర్ ని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఈ వ్యవహారంపై గంటా స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టును ఫార్వర్డ్ చేసినందుకు తన అనుచరుడిని అరెస్ట్ చేయడం దారుణమని.. అసలు ఆ పోస్టును ఎవరు సృష్టించారో వారిని అరెస్ట్ చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు గంటా. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.. ఈ క్రమంలోనే వారికి దిమ్మతిరిగిపోయే విషయాలు తెలిసాయట.

 

ఇదంతా వైసీపీలో కీలక పదవిలో ఉన్న ఒక కీలక నేత ఆధ్వర్యంలోనే జరిగిందట. పరిపాలన రాజధానిగా విశాఖను చేయాలని భావించిన సీఎం జగన్ ఆ అభివృద్ధి పర్యవేక్షణ బాధ్యతను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి అప్పగించారు. ప్రస్తుతం విజయసాయి రెడ్డి ప్రభుత్వ అధికారులు, మంత్రులతో కలిసి ఒక బృందంగా పనిచేస్తున్నారు. ఈ బృందంలోనే ఉన్న ఒక ఆడిటరే ఆ కీలక నేతకి సాయం చేశాడని పోలీసుల దర్యాప్తులో తెలిసిందట. విశాఖలో భూకబ్జా కార్యకలాపాలు చేసే ప్రయత్నం చేసిన ఆ ఆడిటర్ ని విజయసాయి రెడ్డి ఒకసారి మందలించారట. దీంతో ఆయనపై కక్ష పెంచుకున్న సదరు ఆడిటర్ ఆ కీలక నేతతో చేతులు కలిపి.. విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా ఒక  పోస్టును టీడీపీ నేతలకు, సోషల్ మీడియాకు లీక్ చేశాడని పోలీసులు తేల్చినట్టు సమాచారం.

 

విశాఖ రాజకీయాలపై ఎప్పటినుంచో పట్టు సాధించాలని చూస్తున్న ఆ కీలక నేతకు.. విశాఖ రాజకీయం మొత్తం విజయసాయి రెడ్డి కనుసన్నల్లో జరగడం దిగమింగడంలేదట.. అదును కోసం చూస్తున్న ఆ కీలక నేతకు ఆడిటర్ రూపంలో అవకాశం రావటంతో.. అతనితో చేతులు కలిపినట్టు పోలీసులు భావిస్తున్నారట. పైగా విజయసాయి రెడ్డి, అవంతి శ్రీనివాస్ ఇద్దరూ విశాఖ బృందంలో ఉండడంతో వీరిద్దరినీ సోషల్ మీడియా ద్వారా టార్గెట్ చేస్తూ ఈ పోస్టులు సర్య్కూలేట్ చేసినట్టు సమాచారం. అలాగే 108 అంబులెన్సుల వ్యవహారంలో కుంభకోణం జరిగిందంటూ.. టీడీపీ నేతలు విజయసాయి రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేయడం వెనుక కూడా ఈ కీలక నేత హస్తం ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: