ట్టకేలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్ దిగొచ్చింది. పంచాయతీ కార్యాలయాల రంగులపై హైకోర్టు ఆదేశాలకు వైసీపీ ప్రభుత్వం తలొగ్గింది. వెంటనే కార్యాలయాలకు రంగులు మార్చాలని పంచాయతీలకు జగన్‌ సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది. అన్ని కార్యాలయాలకు తెలుపు రంగు మాత్రమే వేయాలని స్పష్టం చేసింది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బొమ్మ మాత్రం తప్పనిసరిగా ఉండాలని ఆదేశాలిచ్చింది. దీంతో కొత్త వివాదం తెరపైకి వస్తోంది.

 

ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయాలపై శాశ్వతంగా ముఖ్యమంత్రి బొమ్మ ఉండటం అనేది ఎక్కడా జరగలేదు. ఏదైనా కార్యక్రమం ఉంటేనో.. లేక ఇంకేదైనా సందర్భం అయితేనో మాత్రమే ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఫ్లెక్సీలలో సీఎం బొమ్మలు ఉండేవి. అది కూడా ఒకటి రెండు రోజులు మాత్రమే. ఇప్పటివరకు అందరూ దానికి అనుగుణంగా నడుచుకున్న వారే. కానీ, సీఎం జగన్ మాత్రం ఐదేళ్ల పాటు శాశ్వతంగా ప్రభుత్వ భవనాల మీద తన బొమ్మ ఉండాల్సిందేనని కోరుకుంటున్నారు.

 

అయితే ఇది న్యాయ బద్దకం కాదని.. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ మేరకు ఈ చర్య సరైనది కాదని కొందరు సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఈ బొమ్మలు కూడా రంగుల సమయంలోనే ఏర్పాటు చేశారు. కానీ, ప్రభుత్వానికి, కోర్టుకు మధ్య రంగుల విషయం మీదే ఎక్కువగా వాదోపవాదాలు జరిగాయి.  ఒకవేల అప్పుడే ఎవరైనా బొమ్మల మీద కూడా పిటిషన్ వేసి ఉంటే వాటిని కూడా తొలగించమని కోర్టు ఉత్తర్వులు ఇచ్చేదని కొందరు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

ఒకవేల రానున్న రోజుల్లో ప్రతిపక్షం నుండి లేదా మరెవరైనా పిటిషన్ వేస్తే మాత్రం.. అప్పుడు రంగుల అంశంలో జరిగినట్టే కేసులు, కోర్టులు, తీర్పులు, విమర్శలు అంటూ హడావుడి తప్పదు. అలాగే త్వరలోనే దీనిపై పిటిషన్ వేసేందుకు టీడీపీ నేతలు సిద్దామవుతున్నట్టు తెలుస్తుంది. అలాగే జరిగితే మాత్రం.. సీఎం జగన్ సర్కార్ కి మరో మొట్టికాయ తప్పదు అని తెలుస్తుంది. కాబట్టి జగన్ సర్కార్ ముందుగానే మేల్కొని దాన్ని సరిచేసుకుంటే మంచిది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం చెప్పండి.

మరింత సమాచారం తెలుసుకోండి: