చైనా లో పుట్టి పసి పిల్లలా ప్రాకుతూ పెద్దదయ్యింది. పసి పిల్లకు చైనా కడుపుబ్బా పెట్టి పెంచి పోషించింది.. అది కాస్తా మహమ్మారిగా మారింది..! పెట్టిన వారిపైనే బుసలు కొడుతూ ఎదురొచ్చినవారిని నిర్దాక్షన్యంగా మింగేసింది. తన ఆకలికి చైనా ఒక్కటే సరిపోక మిగితా దేశాల వైపు కాలు రువ్వుతూ కన్నెర్రజేసింది. వేటాడే డ్రాగన్ లా మారి ఎగురుతూ అన్నీ దేశాల్లోకి ప్రవేశించింది. ఎదురోచ్చే దైర్యం ఎవ్వరికీ లేదు రెక్కలు వీరిచే మందు ఎవ్వరూ కనిపెట్టలేదు. ఇప్పుడు ప్రపంచ నలుమూలలా విస్తరించి ప్రతి నిమిషం 100 మందిని వేటాడుతుంది. కోట్ల మందిని ఆవరించింది. 5 లక్షల మందిని బక్షించింది..! పారా హుషార్... అదే కరోనా మహమ్మారి..!

          

ఇప్పుడు ఈ మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుంది. ప్రపంచంలో ఎవరికీ సరైన కునుకు లేకుండా చేస్తుంది. అగ్రరాజ్యాలను ఆందోళనకు గురి చేస్తుంది. తాజాగా ఈ మహమ్మారి ఓ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కోటికి పైగా పాజిటివ్ కేసులు క్రియేట్ చేసింది. కేసుల సంఖ్య 1,00,00,453 కు చేరిపోయింది. పైగా ప్రపంచవ్యాప్తంగా దీని స్పీడులో కూడా సరికొత్త రికార్డు.. ప్రతి నిమిషం 100 కొత్త కేసులు వెల్లడవుతున్నాయి. దీని దెబ్బకు ఇప్పటికే 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా 54,14,648 మంది చికిత్స తీసుకొని కోలుకున్నారు.

 

ఇప్పటికీ 40,86,853 మంది ఆసుపత్రుల్లో మంచాలకు అతుక్కొని చికిత్స పొందుతున్నారు. అమెరికా లో 25 లక్షల మంది భారత్ లో 545000 మంది ఇక రష్యా లో 628000 మంది ఈ మహమ్మారి బారిన పడినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అమెరికాలో గత పది రోజులుగా రోజుకు లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ వ్యాదికి గనుక సరైన చికిత్స అతి తక్కువ సమయం లో రాకపోతే ఆర్థిక సంక్షోభాలు, వైద్య వనరుల్లో కొరత వైద్య వసతులకు మించి కేసులు పెరిగిపోయే ప్రమాదం పొంచి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: