గాల్వాన్ ఘర్షణలో మన సైనికులు 20 మంది అమరులయ్యారు. ఏ ఒక్క సైనికుడి ప్రాణాన్ని కూడా వృధా అవ్వనివ్వను అని ప్రధాని మోడీ పిలుపినిచ్చారు. చైనీస్ మార్కెట్ పై భారతీయులు అందరూ దాడులు చేస్తున్నారు. బ్యాన్ చైనా అంటూ చైనా వస్తువులను చైనా యాప్ లను చైనా కంపెనీల్లో ఉద్యోగాలను సైతం వదులుకుంటున్నారు ప్రజలు. ఇక మరో పక్క చైనా చేసేంది నీచమైన చర్య అని చైనా తో సంబంధాలు వ్యర్థం అని అంటారు ప్రధాని మోడీ. ఈ నెల 23 న జరగాల్సిన మూడు దేశాల ( భారత్, చైనా, రష్యా ) సమిట్ కు అయిష్టాన్ని తెలిపారు ఎటువంటి షెడ్యూల్ పెట్టుకోలేదు, కానీ అయిష్టంగానే కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను రష్యా కు పంపుతారు.

 

చైనీయులు మన సరిహద్దులోకి చొచ్చుకొని మన సైనికులను దాడి చేసి మారన హోమం చేస్తే కౌంటర్ చర్యలు చేపట్టకుండా భారత్ ది శాంతి మంత్రం అంటారు. అదే పుల్వామా ఘటన కు కౌంటర్ గా ఇస్లామాబాద్ లో యుద్ధవిమానాలతో దాడి చేసినప్పుడు ఆ శాంతి మంత్రం ఏమయినట్టు..? అప్పుడు ప్రధాని మోడీకి శాంతి మంత్రం గుర్తు రాలేదా..? అంటే ప్రధాని మోడీ రాహుల్ గాంధీ అన్నట్టుగా చైనా కు నిజంగానే భయపడుతున్నారా..? అని అంటున్నారు నిపుణులు. 

 

బ్యాన్ చైనా అంటూ ప్రజలే చిత్త శుద్ధితో పోరాటం చేస్తున్నారు. మరి అదే చిత్త శుద్ధి భారత ప్రభుత్వానికి లేదా..? చైనా మార్కెట్ వద్దంటారు, చైనా వస్తువులు వాడోద్దు అంటారు, చైనా ను బ్యాన్ చేయమంటారు మరి మీరేందుకు చైనాను బ్యాన్ చేయడం లేదు..? చైనా కోవిడ్ నివారణకు ఇస్తున్న డబ్బు ఎందుకు స్వీకరిస్తున్నారు...? మరలా చైనాతో సంబంధాలు పెట్టుకునేందుకా..? ఆగ్రా రాజ్యం అయిన అమెరికా జపాన్ లోని హీరోషిమా నాగసాఖీ ప్రాంతాల్లో బాంబులు వేసినందుకు నేటికీ కూడా జపాన్ లో అమెరికా కు మార్కెట్ లేకుండా పోయింది.

 

తాజాగా చైనా ప్రసిద్ధ కంపెనీ హువాయి పీఎం రిలీఫ్ ఫండ్ కు 7 కోట్ల రూపాయలు డొనేట్ చేసింది. మరి ఆ డబ్బును పీఎం రిలీఫ్ ఫండ్ ఎందుకు ఆహ్వానించింది..? ఆ డబ్బును తిరిగి ఎందుకు ఇవ్వలేకపోయారు..? ప్రజలకు పాఠాలు చెప్పిన కేంద్రమే పాఠాలు పాటించడం లేదా..? ఈనేపద్యంలో ఇప్పటివరకు చైనా కంపెనీలు అయిన షవోమి 10 కోట్లు ఫండ్ ను ఇచ్చింది, వన్ ప్లస్ కోటి రూపాయలు ఇచ్చింది, ఒప్పో మొబైల్స్ ఒక కోటి, ఇక ప్రముఖ యాప్ భారత దేశం లోనే దాదాపుగా 100 కోట్ల మంది వాడుతున్న యాప్ టిక్ టాక్ దాదాపుగా 30 కోట్లు పీఎం రిలీఫ్ ఫండ్ కు డొనేట్ చేసింది.

 

చైనా ను బ్యాన్ చేయమంటున్న కేంద్రం చైనా కంపెనీలను దూరం పెట్టమంటున్న కేంద్రం వారు ఇస్తున్న ఫండ్ ను ఎందుకు స్వీకరిస్తుంది..? ఎందుకు నిరాకరించట్లేదు కేవలం ప్రజలే చైనా ను బ్యాన్ చేయాలా..? కేంద్రానికి బాధ్యత లేదా..? 20 లక్షల కోట్లు ప్యాకేజ్ ప్రకటిస్తారు ప్రజల బాగోగులకు హాని కలగకుండా ఎన్నో చర్యలు చేపడుతున్నారు ఈ 50 కోట్లు ఫండ్ తీసుకోవడం కేంద్రానికి అవసరమా అంటూ అనేకమంది సామాజిక బాధ్యత కలిగిన వాళ్ళు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: