మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఎందుకు ఓడిపోయాడో మొత్తానికి ఎల్లోమీడియా తేల్చి చెప్పేసింది. ఎల్లోమీడియాలో ప్రతి ఆదివారం వచ్చే కొ(చె)త్తపలుకులో అనేక కారణాలను ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ వివరించటంతో చంద్రబాబుకు ఒక విధంగా షాకిచ్చినట్లే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గురించి చెబుతున్నానని అనుకుంటునే చంద్రబాబు ఓటమికి కారణాలను  పూర్తిగా బయటపెట్టేశాడు. నిజానికి జగన్ గురించి వేమూరి రాసిందంతా పూర్తిగా చంద్రబాబుకే అతికినట్లు సరిపోతుందనటంలో సందేహమే లేదు.

 

ఇంతకి చెత్తపలుకులో రాధాకృష్ణ ఏమి రాశాడంటే ’ రాజకీయ ప్రత్యర్ధులను శతృవులుగా చూసే విధానానికి జగన్  శ్వస్తి చెప్పాలట. అసలు రాజకీయ ప్రత్యర్ధులను శతృవుగా చూసిందెవరు ? 2014-19లో అధికారంలో ఉన్నపుడు వైసిపి నేతలను చంద్రబాబు ఎంతగా వేధించాడో అందరికీ తెలిసిందే.  వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలను, ముగ్గురు ఎంపిలను టిడిపిలోకి ఎందుకు లాక్కున్నాడు ? జగన్ ను దెబ్బ కొట్టడానికే కదా. అసెంబ్లీలో జగన్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనే కదా ?  చంద్రబాబు చేసిన పని రాజకీయ ప్రత్యర్ధి అయిన జగన్ను  వేధించటం కాదా ?

 

అధికారంలో ఉన్నపుడు మందబలం ఉన్న కారణంగా గిట్టనివారిని అదేపనిగా వేధించింది చంద్రబాబు కాదా ?  వైసిపి ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ఎన్నిసార్లు అరెస్టులు చేసింది అందరికీ తెలిసిందే కదా. అలాగే తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఎన్నిసార్లు అరెస్టులు చేయించారో మరచిపోయాడా. వైసిపి నేతలు చెరుకులపాడు నారాయణరెడ్డి, ప్రసాదరెడ్డి లాంటి వాళ్ళని హత్యలు చేయించిందెవరో అందరికీ తెలుసు. జైల్లో ఉన్నందు వల్ల జగన్ కు సానుభూతి వచ్చినట్లే ఇపుడు వైసిపి ప్రభుత్వ వేధింపుల కారణంగా  అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, చినరాజప్పకు సానుభూతి వస్తోందట. ఇంతకన్నా చవకబారు లాజిక్ ఉండదు ఎక్కడా. జగన్ ను అక్రమాస్తుల కేసుల్లో అప్పటి కాంగ్రెస్+టిడిపి కలిసి ఇరికించాయని మెజారిటి జనాలు అభిప్రాయపడ్డారు. అందుకనే 16 మాసాలు జైల్లో ఉన్న జగన్ అంటే జనాలకు సానుభూతుంది.

 

అదే అచ్చెన్నాయుడు  వందల కోట్ల రూపాయల ఇఎస్ఐ కుంభకోణంలో పీకల్లోతు ఇరుక్కుపోయాడు.  అయ్యన్న మహిళా అధికారిని నోటికొచ్చినట్లు అందరిముందు తిట్టినందుకే కేసు నమోదైంది. యనమల, నిమ్మకాయలపై ఎస్సీ మహిళ ఫిర్యాదు ఆధారంగానే కేసు నమోదైంది. ఎల్లోమీడియా మరి జేసి ప్రభాకర్ రెడ్డి అరెస్టును ఎందుకు వదిలేసిందో తెలీటం లేదు. అంటే జేసి కుటుంబం అక్రమాలకు పాల్పడింది ఎల్లోమీడియా నిర్ధారణకు వచ్చినట్లే ఉంది.  రాజకీయ, న్యాయ, మీడియా వ్యవస్ధలు జగన్ , చంద్రబాబుల్లో ఎవరికి విశ్వాసంగా పనిచేస్తున్నాయో ప్రపంచానికంతా తెలుసు. మీడియా జగన్ పై ఎందుకు బురద చల్లుతోందో కూడా అందరికీ తెలిసిందే.

 

కాబట్టి ఎల్లోమీడియాలో ’కొత్తపలుకు’ సందర్భంగా వేమూరి రాసిందంతా పూర్తిగా చంద్రబాబుకే అతికిపోయినట్లు సరిపోతుంది.  ప్రత్యర్ధులను వేధించటం అన్నది జగన్ తోనే మొదలైనట్లు రాధాకృష్ణ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. టిడిపి నేతలపై వైసిపి ప్రభుత్వం పెట్టిన కేసుల్లో ఎక్కడా కక్షసాధింపనో లేకపోతే వేధింపనో మెజారిటి జనాలు అనుకోవటం లేదు. అందుకనే అచ్చెన్న, జేసిలను  అరెస్టు చేసినపుడు జనాల్లో ఎక్కడా సానుభూతి కనబడలేదు. కాబట్టి వేధింపులంటూ కొత్తపలుకులో రాసింది చంద్రబాబుకే సరిపోతుందని జనాలు అనుకుంటే అది వాళ్ళ తప్పు కానేకాదు. మొత్తానికి రాధాకృష్ణ ఏదో రాయబోయి ఇంకేదో రాసినట్లుంది చూస్తుంటే.

మరింత సమాచారం తెలుసుకోండి: