కింద‌ప‌డ్డా పైచేయి..అనే వారు రాజ‌కీయాల్లో చాలా మందే ఉన్నారు. ప్ర‌జాక్షేత్రంలో ఓట‌మి పాలైనా.. త‌మ హ‌వాను మాత్రం త‌గ్గించుకునేందుకు ఏమాత్రం ఇష్ట‌ప‌డ‌రు. అస‌లు వీరికి ప్ర‌జ‌లంటేనే చుల‌క‌న‌. వారిచ్చే తీర్పున‌కు ఇక ఏపాటి విలువ ఇస్తార‌ని ఆశించాలి! ఇలాంటివారు.. ఏమీ లేని ఆకు.. ఎగిరెగిరి పడిన‌ట్టుగా వ్య‌వహరిస్తారు. రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగి ఏడాది అయింది. ఈ ఏడాది కాలంలో దూకుడు నిర్ణ‌యాల‌తో వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ ముందుకు సాగుతున్నారు. ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నారు. ప్ర‌జ‌లు ఆశించి న విధంగా పాల‌న అందిస్తున్నారు. మ‌రీముఖ్యంగా అవినీతి ర‌హితంగా ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్‌. ప్ర‌తిప‌క్ష నాయ‌కులు క‌ల‌లో కూడా ఊహించ‌ని విధంగా స‌చివాల‌య వ్య‌వ‌స్త‌ను తీసుకువ‌చ్చారు. 


ఇంత చేశారు కాబ‌ట్టే.. దేశ‌వ్యాప్తంగా ముఖ్య‌మంత్రుల పాల‌నా విధానం.. ప్ర‌జ‌ల‌తో వారు మ‌మేక‌మ‌వుతు న్న తీరును అంచ‌నావేసిన `సీ-ఓట‌రు` స‌ర్వేలో యువ సీఎం జ‌గ‌న్ ఉత్త‌మ ముఖ్య‌మంత్రుల్లో నాలుగో స్థా నం ద‌క్కించుకున్నారు. ఇదేమ‌న్నా.. మాట‌ల‌తో అయ్యేప‌నా.. చేత‌ల‌తో అయ్యేప‌నా? అనే విష‌యం రిజ ల్ట్‌ను బ‌ట్టి తెలుస్తూనే ఉంది. స‌మీప రాష్ట్రాల సీఎంలు క‌నీసం ద‌రిదాపుల‌కు కూడా రాలేక పోయారు. ఒడి సాలో వ‌రుస‌గా సీఎంగా చేస్తున్న న‌వీన్ ప‌ట్నాయ‌క్ తొలిస్థానంలో నిలిచారు. నిజంగా.. జ‌గ‌న్ ల‌భించిన ఈ రికార్డ్ ను అభినందించి తీరాలి. సాధార‌ణ ప్ర‌జ‌లు ఈ విష‌యాన్ని గుర్తించారు. కానీ, ఈ విష‌యం ఎక్క‌డ హైలెట్ అవుతుందోన‌ని భావించిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌రికొత్త స్కెచ్ గీశారు. 


గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు టికెట్ కోసం త‌న పార్టీ కండువా క‌ప్పుకొన్న కాంగ్రెస్ మాజీ నాయ‌కుడు, అన‌కాప‌ల్లి మాజీ ఎంపీ స‌బ్బంహ‌రిని లైన్‌లోకి దింపారు. నిజానికి గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున భీమిలి నుంచి పోటీ చేసి ఓడిపోయిన స‌బ్బం హ‌రి.. త‌ర్వాత మాయ‌మ‌య్యారు. పార్టీలోనే క‌నిపించ‌డం లేదు. నిజంగా ఆయ‌న పార్టీలో ఉండి ఉంటే.. చంద్ర‌బాబు ఇచ్చిన పిలుపు మేర‌కు ఏ ఒక్క ఆందోళ‌న‌లో నైనా పాలుపంచుకుని ఉండాలి. కానీ, ఆయ‌న క‌నీసం గ‌డ‌ప కూడా దాట‌లేదు. అయినా కూడా చంద్ర‌బా బుకు ఆయ‌నంటే ప్రేమ‌. అవ‌స‌రానికి వినియోగించుకోవ‌డంలో బాబును మించిన వారు లేరంటారు. ఈ కోణంలోనే స‌బ్బం హ‌రిని వారానికి ఒక‌సారి వాడేసుకుంటున్నారు. 


ఇటీవ‌ల కాలంలో ప్ర‌తి శ‌నివారం ఓ ఎల్లో మీడియాలో చ‌ర్చాగోష్ఠి పెడుతున్నారు. దీనిని ప్ర‌త్యేకంగా స ‌బ్బం హ‌రికే అంకితం చేశారు. హ‌రికే ఇంత‌కా ఎందుకు ప్రాధాన్యం ఇచ్చారు? అని తీగ‌లాగితే.. వెనుక చంద్ర‌బాబు డైరెక్ష‌న్ ఉంద‌ని తెలిసింది. చంద్ర‌బాబు తాను చెప్పాల‌నుకొన్న‌ కొన్ని కొన్నివిష‌యాల‌ను నేరుగా ఆయ‌న చెప్ప‌రు. వేరే వేరే వాళ్ల‌తో చెప్పిస్తారు. అది ఆయ‌న నైజం. ఇప్పుడు జ‌గ‌న్‌కు సీ-ఓట‌రు ఇచ్చిన ర్యాంకును కూడా త‌క్కువ చేసి చూపించేందుకు క‌థ, స్క్రీన్‌ప్లే రెడీ చేసుకుని స‌బ్బం హ‌రితో ఎల్లో మీడియా వేదిక‌గా బాబు డైరెక్ష‌న్‌లో క‌ట్టుక‌థ‌ను బాగానే ర‌క్తి కట్టించార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తంగా విష‌యంలోకి వెళ్తే.. బాబుగారి డైరెక్ష‌ను, హ‌రిగారి యాక్ష‌ను బాగానే కుదిరాయి. 


ఇంత‌కీ బాబు డైరెక్ష‌న్ యాక్ష‌న్ చేసిన స‌బ్బం హ‌రి.. ఏమ‌న్నారో చూద్దాం.. ``వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ప్రభుత్వ విధానాలు, తీసుకున్న నిర్ణయాలు, పాలనా వైఫల్యాల వల్ల గత ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటేసిన వారిలో 10% మంది దూరమయ్యారు`` అని చెప్పుకొచ్చారు. అంత‌టితో ఆగ‌కుండా.. ``ప్రభుత్వ వైఫల్యాలను మూడో నెల నుంచే ఎండగట్టడంతోపాటు ప్రజలను చైతన్యవంతులను చేయడంలో చంద్ర బాబు సఫలీ కృతులయ్యారు.  ప్రభుత్వ నిర్ణయాలతో కొన్నివర్గాల ప్రజల్లో అసహనం పెరిగిపోయింది. సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేయడమే కాకుండా రాష్ట్రాభివృద్ధికి కృషిచేస్తే బాగుంటుందన్న భావన 60% మంది ప్రజల్లో వ్యక్తమవుతోంది. చంద్ర‌బాబు హయాంలోనే పోలవరం 71% పూర్తయింది. రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది`` ఇదీ స‌బ్బం హ‌రిగారి ఉవాచ‌!


దీనికి కొన‌సాగింపుగా వైసీపీ నాయ‌కులు ఏమ‌న్నారంటే.. బాబు డైరెక్ష‌న్‌లో స‌బ్బం హ‌రి యాక్ష‌న్ బాగుంద ని, అయితే, ఆయ‌న.. బాబు అంత‌గా ప్ర‌జా ప‌క్షాన నిలిచి, పోల‌వ‌రాన్ని 71 శాతం పూర్తి చేసేసి ఉంటే.. ఎందుకు అధికారంలోకిరాలేక పోయారు? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇదే నిజ‌మైతే.. సీవోటరు స‌ర్వే మాటేంట‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో.. బాబు దృష్టిలో ప్ర‌జ‌లు అంటే.. ఆయ‌న‌, ఆయ‌న టీడీపీ నేత‌లు, ఆయ‌న కుమారుడు మాత్ర‌మేన‌ని.. వారే ఇప్పుడు రాష్ట్రంలో ఎక్క‌డా ఏమీ జ‌ర‌గ‌డం లేద‌ని ప్ర‌చారం చేస్తున్నార‌ని, అదే మాట‌ల‌ను స‌బ్బం హ‌రిగారు త‌న నోటి నుంచి చెప్పుకొచ్చార‌ని వైసీపీ నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా ఎల్లో మీడియా వేదిక‌గా సాగుతున్న వారం వారం పంచాయ‌తీలో బాబు డైరెక్ష‌న్ తో స‌బ్బం హ‌రి త‌న వాల్యూను సైతం పోగొట్టుకుంటున్నార‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: