ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కారోనా మహమ్మారి ని అరికట్టేందుకు ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తుంది. ప్రతీరోజు వేలాది మందిని ఆవహిస్తుంది వందలాది మండది ప్రాణాలు తీస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ మహమ్మారిని అరికట్టేందుకు కఠిన చర్యలు చేపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రానికి తోడుగా ఉండమని కోరుతుంది.

 

కేంద్రానికి సలహాలు సూచనలు ఇవ్వమని అభ్యర్థిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ మహమ్మారితో పోరాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశం లోనే ఎక్కువ టెస్టులు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను దేశానికి ఆదర్శంగా నిలబెట్టారు. గోవా ముఖ్యమంత్రి దేశం లోనే అతి తక్కువ కేసులున్న రాష్ట్రం గా గోవా ను టాప్ లో పెట్టాడు. ఇక ఇదే బాటలో తనదే ఉత్తమమైన పథకం కావాలని నిశ్చయించుకున్నాడు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.

 

కేంద్రం నిబంధనల మేరకు ఇప్పుడు క్వారంటైన్ సమయం కేవలం పది రోజులు మాత్రమే. కానీ క్వారంటైన్ సెంటర్ అంటే అదేదో జైలు అన్నటుగా  చూస్తున్నారు బాధితులు. క్వారంటైన సెంటర్ నుండి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు వీరిని ఉద్దేశిస్తూ నవీన్ పట్నాయక్ ఓ చక్కటి పథకాన్ని రూపొందించాడు. క్వారంటైన్ సెంటర్ లో పది రోజులు పూర్తిగా ఉండి వైద్యులకు సహకరించిన వారికి 2000 రూపాయల ఇన్సెంటివ్ ను ప్రకటించారు. పూర్తిగా వైద్యం తీసుకొని సాధారణ స్థాయికి వచ్చేందుకు క్వారంటైన్ సెంటర్ నుండి పారిపోకుండా ఉండేందుకే ఈ పథకాన్ని ఆవిష్కరించారు. అంతేకాకుండా రెక్క ఆడనిదే డొక్క ఆడని వారు కూడా ఉంటారు రోజు కూలీనే తమ జీవన ఉపాదిగా మార్చుకున్న వాళ్ళు ఉంటారు. వారికి క్వారంటైన్ అనంతరం జీవనం గడపటం చాలా కష్టం అవుతుంది.

 

మందులు కొనడానికి కూడా డబ్బు ఉండదు దాంతో తిరిగి పనులకు వెళ్ళి ప్రజలు రోగాన్ని తిరిగి తెచ్చుకుంటారు ఇక అలాంటివారికి కూడా ప్రభుత్వం చేయూతను ఇచ్చేందుకు వారికి ఈ ఇన్సెంటివ్ లు ఇస్తుంది. దీంతో వారు మరో నెల పాటు మందులు కొనుక్కుని కూలికి వెళ్లకుండా ఇంట్లో ఉండవచ్చు. ఈ పథకానికి గాను ఇప్పటికే 58,48,38,000 రూపాయలను ఖర్చు చేసింది ప్రభుత్వం. ఇలాంటి పథకాలు రోజు కులీ చేసేవారికి రోజువారీ జీవనం సాగించేవారికి చాలా ఉపయోగపడతాయి.

 

రాష్ట్రానికి రోజు అనేకమంది వలస కూలీలు చేరుకుంటున్నారు ఇప్పటికే 5,81,694 మంది కూలీలు రాష్ట్రానికి చేరుకున్నారు అందులో ప్రతి రోజు 2048 మంది కొత్తగా రాష్ట్రానికి చేరుకుంటున్నారు. వారిని భయపడొద్దని వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆరోగ్యం బాగోలేకపోతే చూయించుకొమ్మని ప్రభుత్వం కోరుతుంది. ఇలాంటి పథకాలే ప్రతీ రాష్ట్రం అమలు చేయాలి. రోజు కూలీలకు ప్రభుత్వం అండగా ఉండాలి, పెదలకోసం ప్రభుత్వం అన్న పేరు తెచ్చుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: