న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు వేసిన ఎత్తు పార‌లేదు. ఆయ‌న త‌న వ్యాపారాలు, బ్యాంకుల్లో తీ సుకున్న అప్పులు(ప్ర‌త్య‌ర్థ‌లు స‌హా ఓ వ‌ర్గం మీడియా ఎగ్గొట్టార‌ని అంటారు) మేనేజ్ చేసుకునేందుకు కేం ద్రంలోని బీజేపీతో అంట‌కాగాల‌ని భావించారు. అయితే, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఇదే బీజేపీ టికెట్ ఇచ్చేం దుకు ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డంతో వ‌చ్చి వైసీపీలో చేరి టికెట్ తెచ్చుకున్నారు. ఈ క్ర‌మంలో త‌న మ‌న‌సంతా కూడా బీజేపీపైనా.. మ‌నిషి మాత్రం వైసీపీలోనూ ఉన్నారు. ఇలా తొలి రెండు మూడు మాసాలు గడిచాయి. త‌న ప‌నులు వ్యాపారాలు చక్క‌బెట్టుకునేందుకు ఢిల్లీ చుట్టూ తిరిగారు.

 

వైసీపీలోనే ఉంటూ.. బీజేపీకి వంత‌పాట పాడుతూ వ‌చ్చారు. ప్ర‌ధాని మోడీ స‌హా అమిత్‌షాల‌ను క‌లుస్తూ వ‌చ్చారు. అంటే.. తూర్పుగోదావ‌రి జిల్లా.. రాజోలు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన జ‌న‌సేన నాయ‌కుడు రా పాక వ‌ర‌ప్ర‌సాద్ కూడా జ‌న‌సేన త‌ర‌పున గెలిచి వైసీపీ వంత‌పాట పాడుతున్నారు. దీనికి జ‌న‌సేనాని ప‌వ‌న్ అడ్డు చెప్ప‌లేదు. బాగా ఒత్తిడి చేస్తే.. ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా గోడ దూకుతార‌ని ఆయ‌న భావించి ఉం టారు. ఇలాంటి గేమ్‌నే ర‌ఘు కూడా వైసీపీలో ప్లే చేయాల‌ని అనుకున్నారు. అంటే.. వైసీపీలోనే ఉం డి.. బీజేపీ చంక‌లో దూరాల‌ని భావించారు. కానీ, జ‌గ‌నేమ‌న్నా.. ప‌వ‌న్ లాంటోడా.. ప్ర‌జ‌ల‌తో ఏమ‌న్నా ఛీకొట్టిం చుకున్నాడా?  అంటున్నారు వైసీపీ నాయ‌కులు.

 

అందుకే జ‌గ‌న్‌.. ర‌ఘుపై ఒత్తిడి పెంచారు. బీజేపీతో అంట‌కాగ‌డాన్ని ప్ర‌శ్నించారు. అదేస‌మ‌యంలో  బీజే పీ ట్రాప్‌లో ప‌డి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించడాన్ని కూడా ఊరుకోలేదు. నేరుగా త‌న ఆఫీస్‌కే పిలిచి క్లాస్ పీకారు. అయినా కూడా ర‌ఘు మార‌లేదు. ప‌వ‌న్ లాగా చూసి చూడ‌న‌ట్టు జ‌గ‌న్ ఉంటారులే అనుకు న్నారు. కానీ, పార్టీ పెట్టిన త‌ర్వాత‌.. ఇలాంటి నేత‌ల‌ను జ‌గ‌న్ ఎంత మందిని చూసి ఉంటారు. అందుకే ఆయ‌న ర‌ఘుతోనే వ్య‌వ‌హారం ముదిరేలా వ్య‌వ‌హ‌రించారు. త‌న‌కు తానే గొయ్యి తీసుకునే వ‌ర‌కు ఎదురు చూశారు. పార్టీ నియ‌మాల‌ను, క‌ట్టుబాట్ల‌ను ప‌దేప‌దే ఉల్లంఘిస్తున్న ర‌ఘుపై ఎలాంటి చ‌ర్య తీసుకోవాలో అదే తీసుకునేందుకు రెడీ అయ్యారు.

 

 మొత్తంగా జ‌గ‌న్ పంథా జ‌గ‌న్‌దేన‌ని నిరూపించారు. మ‌రి ర‌ఘు ఇప్ప‌టికైనా త‌న ప‌ద్ధ‌తి మార్చుకుంటారో లేదో చూడాలి. వాస్త‌వానికి ర‌ఘులాంటినాయ‌కుడు ఏ పార్టీలో ఉన్న‌ప్ప‌టికీ.. ఇమ‌డ‌ర‌ని ఆయ‌న‌కు ఆయ‌నే గొయ్యి త‌వ్వుకుంటార‌ని ఆయ‌న అనుచ‌రులే వ్యాఖ్యానిస్తుండ‌డం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: