రాజకీయాలు ఎప్పుడు ఏ విధంగా మలుపు తిరుగుతాయో చెప్పలేము. ఊహించని మలుపులు తిరగడమే నేటి రాజకీయం. ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఎంతగా సహకరించిందో  తెలిసిందే. బహిరంగంగా వైసీపీ కి మద్దతు ప్రకటించకపోయినా, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రాకుండా చేయడమే, ఏకైక లక్ష్యంగా బిజెపి అడుగులు వేసింది. అనుకున్నట్లుగానే వైసీపీ అధికారంలోకి రావడం, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవడం వంటివి జరిగాయి. ఇక జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కేంద్ర బీజేపీ పెద్దలు ఆయనకు అన్ని విధాలా సహకరిస్తూ, ఆయన తీసుకున్న సంచలన నిర్ణయాలను కూడా సమర్థిస్తూ, ఆయనకు మేలు కలిగే విధంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అదే సమయంలో బిజెపి, వైసిపి ఉమ్మడి శత్రువు చంద్రబాబు మాత్రమే అనే సంకేతాలను కూడా ఆ పార్టీ అగ్రనేతలు ఇచ్చారు. 
 
IHG
 
 
ఇక ఏపీ బీజేపీ నేతలు అప్పుడప్పుడు వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ వస్తున్నా, కేంద్రంలో మాత్రం బీజేపీ పెద్దలు జగన్ కు అన్ని విధాలుగా సహకరిస్తూ వస్తుండడంతో జగన్ బీజేపీతో సఖ్యత గా ఉంటున్నారు . అలాగే కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు, ప్రవేశపెట్టే బిల్లుకు మద్దతు పలుకుతూ, బీజేపీకి చేదోడువాదోడుగా ఉంటూ వస్తున్నారు. ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా బిజెపి వ్యవహారశైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. జగన్ , వైసిపి లక్ష్యంగా బిజెపి అడుగులు ముందుకు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.ఇదే సమయంలో బిజెపి పెద్దలు తెలుగుదేశం కి మేలు కలిగే విధంగా వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
 
IHG
 
 
 ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో గత టీడీపీ ప్రభుత్వం లో ఎన్నో అక్రమాలు జరిగాయని, వైసీపీ తో పాటు బీజేపీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబు పోలవరం ను ఒక ఏటీఎంల వాడుకుంటున్నారు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. తాజాగా టిడిపి ప్రభుత్వం లో పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎటువంటి అక్రమాలు, నిబంధనల ఉల్లంఘన జరగలేదని, ఇప్పుడు కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించడం, ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. చంద్రబాబు సన్నిహితంగా బిజెపి ఎత్తుగడ వేస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది ఇలా ఉంటే కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటనపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. 
 
IHG
 
ఇప్పటి వరకు పోలవరం లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని పదేపదే చెబుతూ బీజేపీ ప్రకటనలు చేస్తూ వచ్చింది. తెలుగుదేశం పార్టీని రాజకీయంగా దెబ్బతీసే విధంగా, వైసీపీ ముందుకు వెళ్తున్న సమయంలో హఠాత్తుగా బిజెపి ప్రభుత్వం చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇవ్వడంపై వైసీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. ఇంత అకస్మాత్తుగా చంద్రబాబుకు బిజెపి క్లీన్ చీట్ ఇవ్వడం ఏంటి అనే విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అసలు ఇప్పటికిప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసి బిజెపి ఎందుకు ముందుకు వెళ్ళాలి అనుకుంటుంది అనే అంశం పైన పెద్ద చర్చ జరుగుతోంది. కేంద్రం ఒక వైపు జగన్ తో సఖ్యత గా ఉంటూనే, ఇప్పుడు టిడిపిని దగ్గర చేసుకోవాలని ఎందుకు చూస్తోంది  అనే అనుమానాలు  అందరిలోనూ కలుగుతున్నాయి. 
 
 
 
ఇప్పటికే వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంలో ఆ పార్టీ పెద్ద తలనొప్పి ఎదుర్కొంటున్న సమయంలో ఇప్పుడు బీజేపీ అకస్మాత్తుగా టీడీపీ కి మద్దతుగా వ్యాఖ్యలు చేస్తుండడంతో, అసలు తెర వెనుక ఏదో రాజకీయం జరుగుతుందనే అనుమానం ఇప్పుడు వైసీపీ నాయకుల్లో కనిపిస్తోంది. ఇప్పటికే కేంద్ర బిజెపి పెద్దలు నిర్మల సీతారామన్, రామ్ మాధవ్ వంటి వారు వైసీపీ ని టార్గెట్ చేసుకుని కొద్దిరోజులుగా విమర్శలు చేస్తుండడంతో కేంద్ర వైఖరిపై వైసిపి వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: