కరోనా నుంచి బయట పడేందుకు కేంద్రం ప్రకటించిన అన్‌లాక్ 1.0 ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రిత్వశాఖ అన్‌లాక్ 2 విధివిధానాలను ప్రకటించింది. కంటైన్మెంట్ జోన్ లలో జూలై 31 వరకూ లాక్ డౌన్ కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది.  ఇదివరకటిలాగే సినిమా హాల్స్, జిమ్స్, స్కూల్స్, కాలేజ్ లు జూలై 31 వరకూ మూసివేసి ఉంటాయని ప్రకటిచింది.

 

అన్ లాక్-2లోని ముఖ్యాంశాలు

* కేంద్ర, రాష్ట్ర శిక్షణా సంస్థలకు జులై 15 నుంచి కార్యకలాపాలకు అవకాశం.

* హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకే అంతర్జాతీయ ప్రయాణికులకు అవకాశం.

* మెట్రోరైళ్లు, థియేటర్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌పై కొనసాగుతున్న నిషేధం.

* సామాజిక, రాజకీయ, మత పరమైన కార్యకలాపాలకు నిషేధం కొనసాగింపు.

* ఇదివరకటిలాగే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. 

* నిర్దేశిత నియమాల ప్రకారం అంతర్రాష్ట్ర, అంతర్గత ప్రయాణికుల సర్వీసులు కొనసాగింపు.

 

*కంటైన్మెంట్ జోన్ లలో జూలై 31 వరకూ లాక్ డౌన్ కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది.

* బయట తిరిగే వారు ముఖమంతా మాస్కు కప్పుకుని ఉండాల్సిందేనన్న కేంద్రం.

* ప్రయాణ సమయం మొత్తం ప్రయాణికులు మాస్క్‌ ధరించి ఉండాల్సిందేనన్న కేంద్రం.

* ప్రతి ప్రదేశంలో 6 అడుగుల దూరాన్ని పాటించాలన్న కేంద్రం.

* దుకాణాలన్నీ కేంద్రం మార్గదర్శకాల మేరకు ఏర్పాటు చేయాలన్న కేంద్రం.

* ఎక్కువ సంఖ్యలో గుమిగూడటంపై నిషేధం కొనసాగింపు.

* వివాహం, వివాహ సంబంధిత కార్యక్రమాలకు 50 మందికి మించి అనుమతి లేదు.

 

* అంత్యక్రియల్లో 20 మందికి మాత్రమే అనుమతి.

* బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నిషేధం, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు.

* బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, పాన్‌, గుట్కా నమలడం, పొగాకు ఉత్పత్తులు తీసుకోవడం నిషేధం.

* అవకాశం మేరకు ఇంటి నుంచి పని చేసేందుకే ప్రయాత్నించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: