12 నెల‌లు, 365 రోజుల‌ క్యాలెండ‌ర్‌లో చాలా రోజులు చ‌రిత్ర‌లో క‌లిసిపోతాయి. కొన్ని రోజులు మాత్ర‌మే మై లు రాళ్లుగా నిలిచిపోతాయి. అలాంటి రోజుల్లో ఒక‌టి.. జూన్ 30. ప్ర‌పంచాన్ని అధునాత‌న సాంకేతిక యు గంలోకి వ‌డివ‌డిగా ప‌రుగులు పెట్టించిన రోజు.  స‌మ‌స్త స‌మాచారాన్ని క్ష‌ణాల్లో పంచుకునేందుకు అవ‌కా శం క‌ల్పించిన రోజు. స్మార్ట్ ప్ర‌పంచాన్ని ప్ర‌జ‌ల‌కు చేరువ చేసి, యావ‌త్‌ ప్ర‌పంచాన్నే ఓ కుగ్రామంగా మా ర్చేసిన రోజు జూన్ 30. మాన‌వ నాగ‌రిక‌త‌ను మ‌రి న్ని మ‌లుపులు తిప్పిన రోజు కూడా ఇదే! నేడు `ప్ర‌పంచ సోష‌ల్ మీడియా దినోత్స‌వం`. ప్ర‌పంచ వ్యాప్తంగా  ఘ‌నంగా నిర్వ‌హించుకునే రోజు. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక క‌థనం.. 


సాంకేతిక స‌మాచార వ్య‌వ‌స్థ ఎప్పుడూ ప్ర‌వ‌హించే న‌ది లాంటిదే అంటారు దివంగ‌త రాష్ట్ర‌ప‌తి క‌లాం. ఎప్ప‌టిక‌ప్పుడు అనేక మార్పులు, అనేక సౌక‌ర్యాలు.. సాంకేతిక‌త‌ను స‌రికొత్త పుంత‌లు తొక్కిస్తూ.. ప్ర‌జ‌ల మ‌ధ్య స‌మాచార పంపిణీ దూరాన్ని త‌గ్గిస్తూ వ‌చ్చాయి. ఆదిలో టెలిఫోన్‌, త‌ర్వాత ఫ్యాక్స్ మిష‌న్‌.. సుదూర ప్రాంతాల నుంచి స‌మాచారాన్ని క్ష‌ణాల్లో చేర‌వేసే సాధ‌నాలుగా ప్ర‌జ‌ల‌ను క‌లిపితే.. ఇప్పుడు సోష‌ల్ మీడియా ఈ స్థానాన్ని వెయ్యి రెట్ల వేగంతో అధిగ‌మించి.. ప్ర‌పంచాన్ని కుగ్రామం చేసేసింది. సాంకేతిక విప్ల‌వ ప‌థంలో ఆవిర్భ‌వించిన సోష‌ల్ మీడియాకు ప్ర‌పంచం నేడు దాసోహ‌మైంది. గ‌తంలో ఎన్న‌డూ లేనంతగా వ్య‌క్తుల మ‌ధ్య స్నేహాన్ని, సంబంధాల‌ను మ‌రింత ఇనుమ‌డింప‌జేసింది సోష‌ల్ మీడియా. 


ఇందుగ‌ల‌దందు లేద‌నే సందేహం లేకుండా.. నేడు సోష‌ల్ మీడియాకు క‌నెక్ట్ కాని ప్ర‌పంచాన్ని, ప్ర‌భు త్వాల‌ను, వ్య‌క్తు ల‌ను ఊహింలేం. అంత‌గా సోష‌ల్ మీడియా ప్ర‌జ‌ల్లో అల్లుకుపోయింది. స్నేహితులు, కుటుంబ స‌భ్యులు, వ్యాపార‌వేత్త‌లు, వినియోగ‌దారులు, ప్ర‌భుత్వాలు, పాల‌కులు.. ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా..ఏ వ్య‌క్తిని తీసుకున్నా.. నేడు సోష‌ల్‌మీడియాలో పాత్రధారులే. ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌రిగిన అధ్య‌య‌నంలో సోష‌ల్ మీడియాను నిత్యం వినియోగిస్తున్న స‌గ‌టు స‌మ‌యం 144 నిముషాలు. యూట్యూబ్ నుంచి ఫేస్‌బుక్ వ‌ర‌కు, వాట్సాప్ నుంచి ఇన్‌స్టాగ్రామ్ దాకా.. ఏదో ఒక మాధ్య‌మంలో ప్ర‌తినిముషం.. ప్ర‌తి వ్య‌క్తీ ఉంటున్న‌ట్టు నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నాయి. 


సోష‌ల్ మీడియా అడుగులు ఇలా..

2002లో `ఫ్రెండ్‌స్ట‌ర్` అనే సోష‌ల్ మీడియాను రూపొందించారు. అప్ప‌ట్లో ఇది మేజ‌ర్ ప్లాట్ ఫామ్‌గా ప్ర‌జ‌ల్లోకి దూసుకుపోయింది. మ‌న దేశంలో ఇది పెద్ద‌గా పాపుల‌ర్ కాక‌పోయినా.. అమెరికా, బ్రిట‌న్ వంటి అగ్ర‌రాజ్యా ల్లో ప్ర‌జ‌లు దీనిని ఎక్కువ‌గానే వినియోగించారు. 


2003లో `మైస్పేస్‌` అనే మ‌రో సొష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్ తెర‌మీదికి వ‌చ్చింది. ఇది కూడా బాగానే పాపుల ‌ర్ అయింది. ఇక‌, ఆ త‌ర్వాత 2004లో రంగ ప్ర‌వేశం చేసిన `ఫేస్‌బుక్‌` ప్ర‌పంచ సోష‌ల్ మీడియా రంగాన్ని శాసించింది...ఇప్ప‌టికీ శాసిస్తూనే ఉంది. ఇప్ప‌టికీ ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్ర‌జ‌లు దీనిని వినియో గిస్తున్నారు. నిజానికి `ఫేస్‌బుక్` త‌ర్వాత ట్విట్ట‌ర్ వంటివి తెర‌మీదికి వ‌చ్చినా.. `ఫేస్‌బుక్` స్థానాన్నిఏదీ ఆక్ర‌మించ‌లేక పోయింది. 


2005లో `యూట్యూబ్` అవ‌త‌రించింది. దీంతో  సిస్ట‌మే.. సినిమా హాల్ గా మారిపోయింది. ఇటీవ‌ల కాలంలో ఇదో పెద్ద ఆదాయ వ‌న‌రుగా కూడా మారిపోవ‌డం గ‌మ‌నార్హం. కేవలం సందేశాలే కాదు.. ఫొటోలు, వీడియాలు, వాయిస్ మెసేజ్‌లు ఇలా అనేక రూపాల్లో ప్ర‌జ‌లు స‌మాచారాన్ని బ‌దిలీ చేసుకునేందుకు సోష‌ల్ మీడియా అద్బుత మార్గంగా అవ‌త‌రించింది. 2010, జూన్ 30న తొలిసారిగా ప్ర‌పంచ సోష‌ల్ మీడియా దినోత్స‌వాన్ని నిర్వ‌హించారు. ప్ర‌పంచంపై సోష‌ల్ మీడియా ప్ర‌భావాన్ని గుర్తించేందుకు నిర్వహించిన ఈ కార్య‌క్ర‌మం అప్ప‌టి నుంచి ఏటా నిర్వ‌హిస్తూనే ఉన్నారు.  అయితే, సోష‌ల్ మీడియాను గుర్రంతో పోలుస్తారు మేధావులు. సోష‌ల్ మీడియా వ‌ల్ల మ‌న‌కు ఎన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయో.. దీనికి క‌ళ్లెం వేసి అదుపులో ఉంచుకోక పోతే.. అన్ని న‌ష్టాలు ఉన్నాయ‌ని చెబుతారు. ఎన్నో ఉప‌యుక్త‌మైన అంశాల‌తోపాటు.. అంతే ప్ర‌మాద‌క‌ర అంశాలు సోష‌ల్ మాధ్య‌మాల్లో హ‌ల్ చేస్తున్నాయి. ఏదేమైనా.. ప్ర‌పంచాన్ని కుగ్రామం చేసేసి, మ‌నుషుల మ‌ధ్య దూరాన్ని త‌గ్గించేసిన సోష‌ల్ మీడియాకు `సెల్యూట్`  చెప్పాల్సిందే!

మరింత సమాచారం తెలుసుకోండి: