రక్షకుడే రాక్షసుడైన వేల..! పోలీస్ అంటే జనాన్ని రక్షించేవాడు ఆపదలు రానివ్వకుండా చూసుకునేవాడు కానీ నేటితరం పోలీసులు ఆ అర్థాన్నే మార్చేశారు పోలీస్ అంటే రక్షకుడు అనే అర్థాన్ని పోలీస్ అంటే రాక్షసుడు అన్నట్టుగా మార్చేశారు. సామాజిక బాధ్యత, సామాజిక దృక్పధం, క్రమశిక్షణ కలిగిన వాడు పోలీస్. పోలీస్ అంటే చట్టాన్ని కాపాడేవాడు చట్టానికి సేవకుడు, కానీ నేటి పోలీసులు చట్టానికి చుట్టంలా వ్యవహరిస్తున్నారు చట్టాన్ని తమ చేతుల్లో తీసుకొని తమకు నచ్చింది చేస్తున్నారు. సమాజాన్ని సద్దుబాటు చేయాల్సిన పోలీస్ నేడు సమాజాన్ని రక్తపాతం చేస్తున్నాడు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని తమ కస్టడీ లోకి వచ్చిన వాళ్ళతో రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారు. కస్టడీ లోకి వచ్చిన వారిని ఇప్పటికే ఎందరినో పొట్టనబెట్టుకున్నారు. తాజాగా జరిగిన జయరాజ్ ఫెనిక్స్ ల కథ పోలీసుల దౌర్జన్యానికి నిదర్శనం.

 

 ఇక కస్టడీ మరణాల లెక్కలు విప్పుతే కేవలం 2001 నుండి 2018 వరకూ చూసుకుంటే కస్టడీలోకి వచ్చిన వారిలో సాక్షాత్తు 1,727 మంది ప్రాణాలు కోల్పోయినట్టు నమోదయ్యింది. అది కూడా వారు రిమాండ్ లోకి వచ్చి ఇంకా కోర్టుకు కూడా వెళ్లకుండానే చనిపోయారు. అది ఎలా సంభవం..? వారు ఎలా చనిపోయారో పక్కన పెడితే పోలీసులు వారి మరణాలకు వివిద కారణాలు చెప్పి కేసును తప్పుదోవ పట్టిస్తారు. ఒక్కసారి పోలీస్ కస్టడీకి వచ్చిన తరువాత ఆ వ్యక్తి బాధ్యతా పూర్తిగా పోలి స్టేషన్ దే. కానీ వారు పోలీస్ స్టేషన్ కూ రావడమే వారి పాలిట శాపం అవుతుంది.

 

పోలీస్ కస్టడీ లో మృతి చెందారు కాబట్టి ఇప్పటి వరకు 1727 మంది చనిపోగా వారిలో 810 మందికి చెందినవారినుండే కేసులు నమోదయ్యాయి. అంటే మిగితా 917 మంది ప్రాణాలు పోయినా కేసులు లేవు, వారిని పట్టించుకున్న దిక్కు లేదు. ఇక 810 కేసుల్లో 334 కేసులపైనే చార్జ్ షీట్లు ఫైల్ అయ్యాయి అంటే దాదాపుగా 500 మంది కేసు పెట్టి కూడా వృధా...! ఆ 334 చార్జ్ షీట్లు ఫైల్ అయిన కేసుల్లో కూడా కేవలం 26 మంది పోలీసులే దొషులుగా తేలారు. అంటే దాదాపుగా 310 మంది ప్రాణాలకు కోర్టులో విలువ లేదు..! ఇక ఈ విషయం ఇలా ఉంటే కేవలం 2018 లో 70 మంది పోలీస్ కస్టడీ లో ప్రాణాలు పోగొట్టుకున్నారు వారిలో కేవలం 3 మాత్రమే పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయినట్టు రికార్డ్ అయింది ఇక మిగిలిన 67 మంది ఎలా చనిపోయారో ఎవ్వరికీ తెలియదు..?

 

ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, ఒదిశా లో తప్ప దేశ వ్యాప్తంగా ఉన్న అన్నీ రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణలతో  కలుపుకొని ప్రతీ రాష్ట్రంలో నేటికీ కూడా కస్టడీ మరణాలు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇది చట్టానికి, పోలీస్ వ్యవస్థకి, యావత్ భారత దేశానికే సిగ్గుచేటు..! ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే 2001 నుండి 2018 వరకు మాత్రమే లెక్కలు తీసుకుంటే.. మానవ హక్కుల ధిక్కారం చేసారంటూ పోలీసులు నియమాలు ఉల్లంఘించారంటూ పోలీసుల పై నమోదయిన కేసులు 2000 అందులో కేవలం 334 మందికి మాత్రమే న్యాయస్థానం శిక్ష వేసింది. ఇది మన న్యాయ వ్యవస్థ స్థితి..! ఇది మన దుశ్శాసన పరిపాలన..! ఇది మన పోలీస్ వ్యవస్థ చేసిన మారణ ఖాండ..! ఇది మన దౌర్భాగ్య దుస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: