దేశ భక్తి... ఇప్పుడు దేశ రాజకీయాలను శాసిస్తున్న పదం. దేశ భక్తి... దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా సరే వినపడుతున్న పదం. దేశ భక్తి... వందేళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని కోలుకోనీయకుండా చేస్తున్న పదం... దేశ భక్తి... సోషల్ మీడియాలో కొన్ని శక్తులు... కొన్ని వర్గాలను దోషులుగా చేస్తున్న పదం...  

IHG

అవును ఇప్పుడు దేశ భవిష్యత్తు, దేశం తల రాత, దేశానికి సరికొత్త అవసరాలు, దేశ ప్రజలకు కొత్త అనుభావనాలు... ఇలా ఈ దేశ భక్తి నేర్పుతూనే ఉంది. దేశాన్ని 60 ఏళ్ళు పాలించి, వందేళ్ళకు పైగా రాజకీయ చరిత్ర ఉండి... రాజకీయాల్లోనే ఇందిరా, రాజీవ్ లను కోల్పోయిన కాంగ్రెస్ ఏ నాడు కూడా ఎత్తని పదం దేశ భక్తి... జనతా పార్టీ పాలకులు అయినా మరొకరు అయినా సరే దానితో మాకేంటి పని అనుకున్నారు గాని, ఏ రోజు దేశ భక్తిని ఆధారంగా చేసుకుని రాజకీయాలు చేసిన సందర్భం పెద్దగా లేదు అనే చెప్పాలి.  చైనా యుద్దంలో బంకర్ లోకి వెళ్లి బాంబులను ప్రయోగించిన ఇందిరా గాంధీ కూడా ఏనాడు దేశ భక్తి అనే పధం గురించి మాట్లాడిన సందర్భం లేదు అనే చెప్పాలి... వాజపేయి కూడా దేశం గొప్పతనం చెప్పారు, హిందువులు, భారతీయులు  పవిత్రంగా భావించే గంగా జలం గొప్పతనం చెప్పారు గాని దేశభక్తి గురించి ఏ రోజు ఆయన మాట్లాడిన సందర్భం లేదు. 2014 ముందు రాజకీయాలు ఆ తర్వాత నుంచి జరుగుతున్న రాజకీయాలు చాలా వేరు. పరిశీలకులు, నిపుణులు, మరెవ్వరు కూడా అంచనా వేయలేని రాజకీయం దేశభక్తి కేంద్రంగానే జరుగుతుంది. 

IHG

బెంగాల్ ఎన్నికలు జరిగే సమయంలో అనుకుంట... రోహింగ్యాలు మన దేశంలోకి వస్తున్నారు, మయన్మార్ నుంచి బెంగాల్ లోకి అడుగు పెట్టి అక్కడి నుంచి ఓడిశా అక్కడి నుంచి హైదరాబాద్ వస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను ప్రచారం చేసారు. అదే సమయంలో అనుకుంట కేంద్ర విదేశాంగ శాఖా మంత్రిగా ఉన్న సుష్మా స్వరాజ్... రోహింగ్యాల విషయంలో అవసరం అయితే బంగ్లాదేశ్ కి సహకరిస్తాం గాని తాము మాత్రం వారిని అనుమతించేది లేదని స్పష్టంగా చెప్పారు. దేశ భక్తిగా చూపించే ప్రయత్నం చేసారు. రాజకీయంగా అది బిజెపికి కలిసి వస్తుంది అని భావించారు చాలా మంది. 

IHG

కాని పది మంది ఎమ్మెల్యేలను కూడా బెంగాల్ ఎన్నికల్లో బిజెపి గెలవలేదు. దేశానికి వామపక్షాలు దరిద్రం అని ప్రచారం చేసిన బిజెపికి వామపక్షాలు కూడా అప్పుడు షాక్ ఇచ్చాయి. 40 స్థానాల్లో బెంగాల్ లో వామపక్షాలు విజయం సాధించాయి. ఆ తర్వాత జరిగిన బీహార్ ఎన్నికల సమయంలో కూడా అంతే... చైనా దోక్లాం గొడవ క్రమంగా పెరుగుతూ వచ్చింది. అప్పుడు అది బిజెపికి అంతగా లాభించలేదు. కాని ఉత్తరప్రదేశ్  సహా 5 రాష్ట్రాల ఎన్నికల సమయంలో పాకిస్తాన్... సరిహద్దుల్లో వరుసగా దాడులు చేసింది. దీనిని కూడా ఎదుర్కొని దేశ భక్తిగా చూపించారు. 

IHG

పంజాబ్ పఠాన్ కోట్ దాడి కూడా జరిగింది. నాలుగు రాష్ట్రాల్లో అవి ఫలించాయి. సోషల్ మీడియాలో అప్పుడు బిజెపి సహా సంఘ్ పరివార్ వంటి సంస్థలు చేసిన ప్రచారం బాగానే కలిసి వచ్చింది అని చెప్పాలి. ఇక ఏ రాష్ట్రం ఎన్నికలు  జరుగుతున్నా సరే ఇదే విధంగా సరిహద్దు గొడవలు రావడం, పాకిస్తాన్ దాడులు చేయడం, నిఘా వర్గాలు కూడా... మోడీ హత్యకు కుట్ర జరుగుతుందని చెప్పడం, ఢిల్లీ మీద దాడి చేయవచ్చు అని చెప్పడం అదనం... బిజెపి నేతలు మీడియా ముందుకు వచ్చి కాంగ్రెస్  పాకిస్తాన్ మాట వింటుంది, సరిహద్దుల్లో అలజడికి కాంగ్రెస్ కారణం అని ప్రచారం చేసారు. గుజరాత్ ఎన్నికల సమయంలో... మణిశంకర్ అయ్యర్ అనే కాంగ్రెస్ సీనియర్ నేత ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అవి కూడా దేశానికి వ్యతిరేకంగా ఉన్నాయని బిజెపి ప్రచారం చేసింది. కాని గుజరాత్ లో కేవలం 10 సీట్ల తేడాతో అధికారంలోకి వచ్చింది బిజెపి. అదే ఎన్నికల ప్రచారంలో అనుకుంట... మోడీ... గుజరాత్ వెళ్లి... ఎన్నికల ప్రచార సభ తన తల్లి ఇంటి దగ్గరగా ఉండటంతో అక్కడి నుంచి క్యారేజ్ తెప్పించుకుని తిన్నారు. దానిని దేశం కోసం మోడీ చేసిన త్యాగంగా చెప్పాయి సంఘ్ పరివార్ వర్గాలు. 

IHG

ఇక్కడ ఇంకో విషయం ఏంటీ అంటే... సంఘ్ పరివార్ ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి, సంఘ్ పరివార్ లో కీలకమైన ఆర్ఎస్ఎస్ లో నెంబర్ 2 గా ఉన్న సురేష్ భయ్యా జోషీ ని తప్పించాలి అని మోడీ 2018 మార్చ్ చివర్లో విశ్వ ప్రయత్నాలు చేసారు.   తనతో కలిసి గుజరాత్ లో పని చేసిన దత్తాత్రేయ హోసబలేని ఆ పదవిలో కూర్చోబెట్టే ప్రయత్నం చేయగా... విశ్వ హిందూ పరిషత్ నుంచి... అప్పుడు అధ్యక్షుడుగా ఉన్న ప్రవీణ్ తొగాడియా తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక ఆ తర్వాత ఆయన మీద కక్షగట్టి ఆయనను పక్కకు పంపారు. 

IHG

ఆ తర్వాత సురేష్ భయ్యాను తనకు అనుకూలంగా మార్చుకుని... త్రిపుర ఎన్నికల కోసం వాడుకున్నారు సంఘ్ ని. అక్కడ సంఘ్ ఏ సేవా  కార్యక్రమాలు చేసినా సరే దేశ సేవ... సంఘ్ పరివార్ కి చెందిన వ్యక్తులు ఏ సమాజ సేవ చేసినా సరే అది కచ్చితంగా దేశభక్తే... అది బిజెపికి కలిసి వచ్చింది. అప్పటి వరకు మాతృ సంస్థను బిజెపి అంత బాగా వాడుకున్న సందర్భం ఎప్పుడు లేదు అనే చెప్పాలి. 2019 ఎన్నికలకు ముందు... పుల్వామా ఘటన జరిగితే దేశం మొత్తం కేంద్రానికి అప్పుడు అండగా నిలిచింది.  కాని అప్పుడు కొందరు వేసిన ప్రశ్నలకు బిజెపి నుంచి ఒక్క సమాధానం కూడా రాలేదు. పుల్వామా ఘటనలో అమరులు అయిన సైనికులు ఎందుకు రోడ్డు మార్గంలో వెళ్ళారు, అది ప్రమాదకర రోడ్డు కదా అని అడిగితే దేశ ద్రోహులుగా ముద్ర వేసింది బిజెపి. ఆ తర్వాత పాకిస్తాన్ పై సర్జికల్ దాడులు చేస్తూ వచ్చిన కేంద్ర సర్కార్... ఒక్క ఆధారం కూడా బయటపెట్టలేదు. అవి అన్నీ కూడా కేంద్రానికి బాగా కలిసి వచ్చి మోడీని... ఉత్తరాది రాష్ట్రాల్లో ఒక దేవుడ్ని చేసాయి. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు రావడానికి ఆ బాలాకోట్ పై తాము చేసామని చెప్పిన సర్జికల్ దాడులే. 

IHG

బెంగాల్ లో బిజెపి 17 ఎంపీ సీట్లు గెలిచింది. మమతా బెనర్జీ ని పదవి నుంచి దించాలి అని మోడీ చాలా ప్రయత్నాలు చేసారు. ఇక ఆమె మీద దేశ ద్రోహి అనే ముద్ర కూడా బిజెపి వేసింది. మమతా బేగం అంటూ బిజెపి కార్యకర్తలు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు పదే పదే చేస్తూ వచ్చారు. బెంగాల్ గ్రామాల్లో సైనికులను మొహరించారు, అప్పటి వరకు లేని సైనికుల పహారా ఎన్నికల ముందు ఎక్కువైంది. ఆరు జిల్లాల్లో బిజెపి పట్టు సాధించింది అప్పుడు. అలా మమతను 17 స్థానాలు గెలిచి షాక్ కి గురి చేసింది బిజెపి. అక్కడ దేశ భక్తి మంత్రం పని చేసింది. విపక్షాలు అన్నీ కలిస్తే... మోడీ మీద కుట్ర, బీసీ కులాల మీద కుట్ర అంటూ చిత్రీకరించారు. మహారాష్ట్ర హర్యానా ఎన్నికలకు ముందు ఆర్టికల్ 370 రద్దు చేసారు. అప్పుడు కూడా పాకిస్తాన్ పై సర్జికల్ దాడులు చేసారు. కాని రెండు రాష్ట్రాల్లో కూడా బిజెపి అధికారంలోకి సొంతగా రాలేదు. మహారాష్ట్రలో శివసేన దూరం అయింది. ఝార్ఖండ్ ఎన్నికల్లో... జమ్మూ కాశ్మీర్ ప్రజల కోసం మీరు త్యాగాలు చేసారని అక్కడి ప్రజలను మోడీ కీర్తించినా సరే జనాలు పెద్దగా ఆయన మాటలు వినలేదు. ఇప్పుడు బీహార్ ఎన్నికలు వస్తున్నాయి.  

IHG

నేపాల్ పార్లమెంట్ లో కొత్త మ్యాప్ ఆమోదం, హిమాచల్ ప్రదేశ్ లో చైనా హెలికాప్టర్ లు, సరిహద్దుల్లో చైనా బలగాల దాడి, నేపాల్ సైనికులు బీహార్ ప్రజల మీద దాడులు, ఇలా ఎన్నో జరుగుతున్నాయి. పాకిస్తాన్ విషయంలో మోడీ చూపించిన దూకుడు, చైనా మీద చూపించడం లేదు. పాకిస్తాన్ సైనికులను సర్జికల్ దాడులు చేసి చంపినంత ఈజీగా చైనా సైనికులపై వెళ్ళడం లేదు. అసలు చైనా బలగాలు భారత్ లోకి వచ్చాయా అని రాహుల్ గాంధీ అడుగుతుంటే... 43 వేల చదరపు కిలోమీటర్లు మీరు చైనాకు ఇచ్చేసారు అంటూ బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా విమర్శలు. 

IHG

ఇప్పుడు చైనా యాప్స్ ని నిషేధించారు. కాని చైనా మన దేశంలోకి వచ్చిందా అని విపక్షాలు అడిగే ప్రశ్నలకు ఏ సమాధానం కూడా బిజెపి నుంచి రావడం లేదు. ఇంత జరుగుతున్నా సరే మోడీ ఒక్క మీడియా సమావేశం కూడా పెట్టడం లేదు.  ఇక్కడ ఇంకో విషయం ఏంటీ అంటే మోడీ ప్రధాని అయిన తర్వాత ఒక్క విలేఖరికి కూడా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన దేశ ఆర్ధిక పరిస్థితిని గాని దేశ  ప్రస్తుత పరిస్థితిని గాని వివరించలేదు. మోడీ మాట్లాడే ఏ ప్రసంగంలో కూడా ప్రజలను ఉత్తేజ పరిచే  విషయాలే గాని సబ్జెక్ట్ చాలా తక్కువ అనే ఆరోపణలు ఉన్నాయి. 

IHG

గుజరాత్ లో మోడీ సిఎం గా ఉన్నప్పుడు కూడా మీడియాతో మాట్లాడిన సందర్భం లేదు. ఇక కాంగ్రెస్ మర్చిపోయిన స్వాతంత్ర్య సమరయోధులను బిజెపి వాడుకోవడం మొదలు పెట్టింది. పటేల్ నుంచి ప్రతీ ఒక్కరిని కూడా బిజెపి వాడుకుంటూ వస్తుంది. కాంగ్రెస్ చేసిన త్యాగాలు అయినా ఉన్నాయి గాని బిజెపి నుంచి ఏ ఒక్క నాయకుడు కూడా త్యాగం చేయలేదు. దేశానికి దార్శినికుడు అని చెప్పే మోడీ ఏ త్యాగం చేయలేదు. త్యాగాలు చేసిన కాంగ్రెస్ చెప్పుకునే స్థితిలో లేదు. మీడియా వాస్తవాలు చెప్పలేదు, దేశ ప్రజలు దేశ భక్తి నుంచి బయటకు రాలేరు. 

IHG

దేశానికి పదేళ్ళు ప్రధానిగా ఉన్న మన్మోహన్ దేశం  కోసం ఎంతో కష్టపడినా, ఆర్ధిక వ్యవస్థను పీవీ నరసింహారావు తో కలిసి నిర్మించినా, ప్రపంచంలోనే ఏ దేశాధినేత చరిత్రలో గాని భవిష్యత్తులో గాని చదవలేని చదువు చదివినా ఏ రోజు కూడా దేశ ప్రజలు ఆయన సామర్ధ్యం చూడలేదు. మోడీ ప్రసంగాలకు... ఒక్క మాటలో చెప్పాలి అంటే మోడీ నోటి నుంచి వచ్చే వినోదభరిత మాటలకు అలవాటు పడిన దేశం... ఇప్పుడు మన్మోహన్ మాట్లాడితే సోది అంటుంది. ఎందుకంటే మన్మోహన్ సింగ్ ఏ రోజు దేశ భక్తుడు అనిపించుకోలేదు కాబట్టి...

మరింత సమాచారం తెలుసుకోండి: