ఇఎస్ఐ కుంభకోణంలో మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్టయి ఇప్పటికి 15 రోజులైంది. అనారోగ్యం కారణాలతో అచ్చెన్న జ్యుడిషియల్ కస్టడీలో ఉంటు వైద్యుల పర్యవేక్షణలో ఆసుపత్రిలో  ఉన్నాడు. అరెస్టయిన రోజున అచ్చెన్నను కలవటానికి చంద్రబాబునాయుడు, లోకేష్ చాలా హడావుడి చేసిన విషయం అందరికీ తెలిసిందే.  ముందు జైలు దగ్గరకే వెళితే కుదరలేదు. తర్వాత ఆసుపత్రికి వెళ్ళినా సాధ్యం కాలేదు. జ్యుడిషియల్ కస్టడిలో ఉన్న పేషంట్ ను చూడాలంటే ముందు మెజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలని ఆసుపత్రి సూపరెండెంట్, పోలీసులు కూడా స్పష్టం చేయటంతో వెనక్కు వచ్చేశారు.

 

ఇదంతా ఎప్పుడు జరిగిందంటే దాదాపు 15 రోజుల క్రితం జరిగింది. మరి ఈ 15 రోజుల్లో మెజిస్ట్రేట్ అనుమతి తీసుకునేందుకు చంద్రబాబు కానీ లోకేష్ కానీ ప్రయత్నించినట్లు లేదు. ఒకవేళ వాళ్ళు ప్రయత్నించుంటే అనుమతి రావటం పెద్ద కష్టమేమీ కాదు.  అమరావతి నుండి లోకేష్ అనంతపురం జిల్లాలోని తాడిపత్రికి వెళ్ళి జేసి ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.  జేసి ట్రావెల్స్ ముసుగులో బస్సుల పర్మిట్లు, రవాణా, అమ్మకాలు తదితరాల్లో జేసి కుటుంబం చేసిన అక్రమాలన్నీ బయటపడటంతో పోలీసులు అరెస్టు చేశారు.

 

టిడిపిలోని ఇద్దరు సీనియర్లు రెండు రోజుల్లో వరుసగా అరెస్టయితే తాడిపత్రికి వెళ్ళి జేసీ ఫ్యామిలిని చూసొచ్చిన చినబాబు అచ్చెన్న కుటుంబాన్ని పరామర్శించటానికి శ్రీకాకుళానిక తర్వాతెప్పుడో వెళ్ళాడు. అదే సమయంలో జ్యుడిషియల్ కస్టడిలో ఉన్న మాజీమంత్రిని కలవటానికి  ప్రయత్నం చేసినట్లు కూడా కనబడలేదు. ఇక్కడే అందరిలోను అనామానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకని మెజిస్ట్రేట్ పర్మిషన్ కోసం ప్రయత్నం చేయలేదనే విషయాన్ని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

 

లీగల్ వ్యవహారాలు చూడటానికి టిడిపిలో పెద్ద సెటప్పే ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి అచ్చెన్న కలవాలని చంద్రబాబు అనుకుంటే పర్మిషన్ కోసం మెజిస్ట్రేట్ కు దరఖాస్తు చేసుకోవటం కూడా పెద్ద కష్టమేమీ కాదు. మరి అరెస్టయి పది రోజులైనా చంద్రబాబు తరపున మెజిస్ట్రేట్ కు దరఖాస్తు పెట్టుకున్నట్లు కూడా ఎవరు చెప్పటం లేదు. చంద్రబాబు కానీ లేకపోతే చినబాబు కానీ ఇంతవరకూ అచ్చెన్న కలవలేదంటే మెజిస్ట్రేట్ కు ఇంకా దరఖాస్తు పెట్టుకోలేదన్న విషయం తెలిసిపోతోంది. మరి చంద్రబాబు మనసులో ఏముందో తెలియటం లేదు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: