ఎంతగా దూరం పెడదాం అన్నా, తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ ప్రస్తావన రాకుండా రాజకీయాలు నడవడం లేదు. ఎన్టీఆర్ అంటే సీనియర్ ఎన్టీఆర్ కాదు. ఆయన పోలికలు, హాహా భావాలతో ఉంటూ, ఆయన స్థాయిలో జనాల్లో క్రేజ్ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్. ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టేది ఆయనే అని, ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలో మెజార్టీ నాయకుల నమ్మకం. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, ఉనికి కోల్పోయే పరిస్థితి ఎదుర్కొంటోంది. టిడిపి రాజకీయ ప్రత్యర్థి అయిన వైసీపీ బలంగా ఉంది. 151 సీట్లతో అధికారం చెలాయిస్తోంది. భవిష్యత్తులో ఆ పార్టీ ఉనికి లేకుండా, చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీని బలహీనం చేసే పనిలో ఆ పార్టీ అధినేత జగన్ నిమగ్నమయ్యారు. 

 

IHG

ఇప్పటికే పార్టీకి చెందిన నాయకులంతా భయాందోళనలతో ఉండగా, మరికొంతమంది అనేక అవినీతి అక్రమాల కేసులో జైలు పాలయ్యారు. ఈ సమయంలో పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించే విధంగా, టిడిపి అధినేత చంద్రబాబు తన శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో తన వయసు పైబడటంతో రాజకీయంగా యాక్టివ్ గా ఉంటూ, చక్రం తిప్పే అవకాశం లేకపోవడంతో తన వారసుడిగా నారా లోకేష్ ను రంగంలోకి దింపి పార్టీలో ఆయన హవా పెంచే పనిలో చంద్రబాబు ఉన్నారు. లోకేష్ ఎంతగా బలం పెంచుకునేందుకు ప్రయత్నించినా, పార్టీలో ఆయన పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు.

IHG


 ఆయన చేతికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే, తెలుగుదేశం పార్టీ మరింతగా దెబ్బతింటుంది అని, జగన్ వంటి బలమైన నాయకులను ఎదుర్కోవడం లోకేష్ వల్ల కాని పని అని, ఆయనను అనవసరంగా తమపై రుద్ది పార్టీ ఉనికిని దెబ్బతీయవద్దు అని ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ తరుణంలో చంద్రబాబు లోకేష్ కాకుండా, పార్టీకి ప్రత్యామ్నాయం ఎవరు అనే విషయం పై చాలా కాలంగా టిడిపి నాయకులు ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వస్తోంది. ఇప్పటికిప్పుడు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ లో యాక్టివ్ అయ్యేందుకు ఇష్టపడకపోయినా, భవిష్యత్తులో ఆయన ఆయన తన తాత పార్టీని ముందుకు నడిపించేందుకు సిద్ధంగా ఉంటారు అనేది కొంతమంది నాయకుల అభిప్రాయం.

 

IHG


 గతంలో ఎన్టీఆర్ ను ఎన్నికల ప్రచారానికి వాడుకుని, ఆ తర్వాత పూర్తిగా పక్కన పెట్టడంతో, చంద్రబాబు తీరుతో ఆయన అలిగి దూరంగా ఉంటున్నారని, కానీ మళ్లీ ఆయనకు ఛాన్స్ ఎక్కువగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడిన మాటలు కూడా ఎన్టీఆర్ ను ఉద్దేశించి అన్నవే అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ఒక్కడు బలమైనవాడు వస్తే ఎటువంటి సామ్రాజ్యలు అయినా కూలుతాయి అని చరిత్ర నిరూపించింది అంటూ అశోక్ బాబు మాట్లాడిన మాటలు జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించినవే అనే అభిప్రాయాలు ఇప్పుడు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది కాబట్టి, టిడిపిలో ఎటువంటి సంచలనాలు అయినా చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: