ఆంధ్రప్రదేశ్ నవ యువ ముఖ్యమంత్రి చైతన్యవంతుడు, సమర్థుడు, రాజన్న పుత్రుడు, రైతన్న మిత్రుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తాను మాట ఇచ్చాడంటే దాన్ని ఎలాగైనా నిలబెట్టుకుంటాడు. రాష్ట్ర ప్రజల జీవితాలు ప్రయోజనాలే తన మొట్టమొదటి ప్రియారిటీ..! ప్రజలకోసం ప్రజోపయోగ పథకాలు నిర్మిస్తాడు వాటిని ప్రజల్లోకి క్రమశిక్షణ తోటి క్రమంతప్పకుండా తీసుకెళతాడు.

 

నేను విన్నాను నేను ఉన్నాను అంటూ నిత్యం ప్రజాలతో మమైకం అవుతాడు, ప్రజల శ్రేయస్సు కోసం నిత్యం శ్రమిస్తుంటాడు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటాడు. కరోనా వచ్చి రాష్ట్రాన్ని చిన్నాబిన్నం చేస్తుంటే ప్రాకులాడుతున్న పసిపాప ఏపీని ఎత్తుకొని మహమ్మారికి అడ్డుపడి పసిపాపలా కాపాడుతున్నాడు. ఓ పక్క కరోనా వచ్చి రాష్ట్ర ఆర్థిక స్థితి క్షీణిస్తున్నా వెనకడుగు వేయకుండా లక్షల సంఖ్యలో టెస్టులు చేసి ప్రజా సంరక్షణకే ప్రయారిటీ ఇస్తున్నాడు.

 

 ఇప్పుడు తాజాగా ప్రజలకు మేలిమి చికిత్స అందించేందుకు అత్యాధునిక సదుపాయాలు ఉన్న అంబులెన్సులను ప్రజల్లోకి తీసుకొస్తున్నాడు. ఎమర్జెన్సీ సందర్భాలు ఎదురైనా అంబులెన్స్ లోనే చికిత్స అందించగలిగే టెక్నాలజీ సదుపాయాలతో కూడిన నూతన అంబులెన్సులను ఉపయోగంలోకి తీసుకురానున్నాడు. దాదాపుగా 1088 కొత్త అంబులెన్స్ వాహనాలను ప్రజా సేవ కొరకు అందుబాటులోకి రానున్నాయి. అత్యవసర పరిస్థితి వస్తే నిమిషాల్లో అంబులెన్స్ వచ్చి కండిషన్ ను నార్మల్ స్టేజ్ కు తీసుకువచ్చేందుకు సంకల్పం చేసుకున్నాడు.

 

ఇందులో భాగంగా బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ వాహనాలు 108 సర్వీసులు, హెల్త్ సర్వీసెస్ మొబైల్ మెడికల్ క్లినిక్ 104 సర్వీసులను రాష్ట్రంలో నేడు ప్రారంభించనున్నాడు. ఈ వాహనాల అమలుతో రాష్ట్రంలో వైద్య సర్వీసులు మరింత బలపడతాయి. రాష్ట్ర ప్రజలు మరింత మెరుగైన సేవలు పొందగలరు. ఆంధ్రప్రదేశ్ ను ఆరోగ్యంగా ఉంచడమే నా ఆశయం అని  నాడు రాజశేఖర్ రెడ్డి చెప్పారు నేడు వైఎస్ జగన్ ఆ ఆశయానికి కట్టుబడి ఉన్నాడు. రాష్ట్రంలో బడ్జెట్ లేకపోయినా ప్రజలకు ఆ కష్టాలు తెలియనివ్వకుండా ప్రజలకు అవసర్మైన సేవలకు భంగం కలగకుండా చూసుకుంటున్నాడు.

 

కోవిడ్ 19 వంటి ప్రామాధాకర మహమ్మారి ఆధిపత్యం చెలాయిస్తున్న ఇటువంటి వేళలో జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం బేష్..! కోవిడ్ నివారణకు కూడా ఈ అడుగు ఎంతగానో దోహపడగలదు. ఎవ్వరికి ఎటువంటి సమయంలో ప్రమాదం ఎదురయినా ఒక్క ఫోన్ కాల్ తో 20 నిమిషాలు దాటకుండా చికిత్స అంధిస్తాను అను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హామీ ఇస్తున్నాడు. నేడు సాయంత్రం విజయవాడ లోని బెంజ్ సర్కిల్ లో సీఎం జగన్ చేతుల మిదిగా ఈ 1088  108 వాహనాలు రాష్ట్రం లోకి విడుదల కానున్నాయి,

 

మొత్తం 1088 వాహనాలను జగన్ లాంచ్ చేయబోతున్నాడు వాటిలో 412 (108 వాహనాలు), 104 (అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ వాహనాలు), 282 (బేసిక్ లైఫ్ సపోర్ట్ వాహనాలు), 26 (నియోనేటల్ ఆంబులెన్సులు), 656 (104 ఆంబులెన్స్ వాహనాలను) లతో కలిపి మొత్తం 1088 వాహనాలను నేడు సీఎం జగన్ ప్రారంభించనున్నారు. జగన్ చేస్తున్న ఈ పనికి దేశ వ్యాప్తంగా హర్షాలు వ్యక్తమవుతున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రజలు మంత్రులు ముఖ్యమంత్రులు సైతం జగన్ ను అభినందిస్తున్నారు. కోవిడ్ 19 వంటి సమయం లో జగన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కేవలం ఏపీకే కాదు యావత్ దేశానికి ఓ స్పూర్తి గర్వకారణం.

మరింత సమాచారం తెలుసుకోండి: