కొన్ని బ‌తుకులు అంతే సోద‌రా.. మంచిని మంచి.. అని ఒప్పుకొనేందుకు మ‌నసు రాదు! ఎంత‌సేపూ.. కు టిల బుద్ధులు... కుళ్లు సంస్కారాలు త‌ప్ప‌.. క‌నీసం.. జ‌నాలు న‌వ్వుతార‌నే చిన్న‌పాటి ఆలోచ‌న‌ కూడా వారి లో మ‌న‌కు క‌నిపించ‌దు. వారి మ‌న‌సుల‌కు అనిపించ‌దు. రాష్ట్రంలో ఈ రోజు.. క‌నీ వినీ ఎరుగ‌ని విధంగా.. ఓ అద్భుత కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఓ చ‌చ్చుబ‌డి పోయిన వ్య‌వ‌స్థ‌కు జ‌వ‌జీవాలు క‌ల్పించే ప్ర‌య‌త్నం.. ఇక‌, అంతా అయిపోయి.. వెంటిలేట‌ర్‌పై ఉన్న వ్య‌వ‌స్థ‌కు ప్రాణం పోసే క్ర‌తువుకు శ్రీకారం కార్డుప‌డింది. ``తిం డిక‌లిగితె కండ‌గ‌ల‌దోయ్‌.. కండ‌గ‌ల‌వాడే మ‌నిషోయ్‌!`` అన్న  గుర‌జాడ వారి స్పూర్తి నిల‌బ‌డాలంటే.. కం డ గ‌లిగిన వాడికి ఏదైనా ఆరోగ్య స‌మ‌స్య వ‌స్తే.. తీర్చే సాధ‌నం అందుబాటులో ఉండాలి. 


కానీ, 2004 వ‌ర‌కు రాష్ట్రంలో ఎంతో విజ‌న్ ఉన్న నాయ‌కులు పాలించినా.. ఎవ‌రూ కూడా ప్ర‌జారోగ్యానికి పె ద్ద పీట వేయ‌లేదు. ఆ త‌ర్వాత ఉమ్మడి రాష్ట్ర ప‌గ్గాలు చేప‌ట్టిన వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆరోగ్య శ్రీ ప‌థ‌కాన్ని అమ‌లు చేశారు. అదేస‌మ‌యంలో ఆయ‌న 108 అంబులెన్స్ వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చారు. ఎక్క‌డ ఏ వ్య‌క్తి అనారోగ్యంతో ఇబ్బంది ప‌డినా.. వెంట‌నే అక్క‌డ‌కు చేరుకునే వ్య‌వ‌స్థ‌గా.. దీనిని తీర్చి దిద్దారు. ఇది అ త్యంత వేగంగా ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో చోటు సంపాయించుకుంది. ముఖ్యంగా గ‌ర్భిణుల‌కు, ప్ర‌మాదాల స‌మ‌యంలో 108 సేవ‌లు అంత‌గా చేరువ అయ్యాయి. ఎవ‌రి నోట విన్నా.. 108 గురించే ప్ర‌స్తావ‌న ఉండేది.. త‌న పేరునైనా మ‌రిపోయిన వ్య‌క్తులు ఉన్నారు కానీ, 108 సేవ‌ల‌ను మాత్రం మ‌రిచిపోయిన మ‌నుషులు మ‌న‌కు ఎక్క‌డా క‌నిపించ‌రు. 


అయితే, రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఈ 108 స‌హా ఆరోగ్య శ్రీ సేవ‌ల విష‌యం ప‌డిన త‌ర్జ‌న భ‌ర్జ‌న అంతా ఇంతా కాదు. ఈ ప‌థ‌కం త‌లుచుకున్నా.. ఈ వాహ ‌నాలను త‌లుచుకున్నా.. కూడా వెంట‌నే ప్ర‌జ‌ల మ‌దిలో వైఎస్ క‌నిపించేవారు. అంత‌లా అల్లుకుపో యిన ఈ ప‌థ‌కం-వైఎస్ పేరును తుడిచి పెట్టాల‌ని భావించిన చంద్ర‌బాబు వ‌ల్ల‌కాలేదు. దీంతో ఆయ‌న ఈ ప‌థ ‌కాన్ని నీరుగార్చే ప్ర‌య‌త్నం చేశారు. కాంట్రాక్టు సంస్థ‌ల‌కు బిల్లులు చెల్లించ‌కుండా.. పెండింగ్ పెట్ట‌డం, సేవ‌ల‌ను విస్తృతం చేయ‌క పోవడం వంటి కార‌ణంగా దాదాపుగా ఆరోగ్య శ్రీ సేవ‌లు 108 వాహ‌నాలు ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌య్యాయి. ఈ ప‌రిణామం.. గ‌త ఏడాది వ‌ర‌కు కూడా కొన‌సాగింది. 

 

మాకు పెండింగ్ బిల్లులు ఇస్తేనే కానీ.. ఆసుప‌త్రుల్లో చేర్చుకోబోమ‌ని ప్రైవేటు ఆస్ప‌త్రులు మొండికేశా యంటే.. చంద్ర‌బాబు అనుభవం ఏర‌కంగా ప‌నికొచ్చిందో అర్ధ‌మ‌వుతుంది. ఇక‌, వైఎస్ త‌న‌యుడు.. వైఎస్ జ‌గ‌న్‌.. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఆరోగ్య శ్రీ ప‌థ‌కానికి జ‌వ‌స‌త్వాలు ఇచ్చేందుకు కృషి చేశారు. దాదా పు 2056 రోగాల‌ను ఆరోగ్య శ్రీ ప‌రిధిలోకి చేర్చారు.  ఎవ‌రూ ఊహించ‌ని విధంగా క‌రోనాను కూడా ఆరోగ్య శ్రీప రిధిలోకి చేర్చారు. త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌లో ఉండే ఏపీకి చెందిన‌ పేద‌ల‌కు, లేదా ఆరోగ్య శ్రీల‌బ్ధి దారుల‌కు సేవ‌ల‌ను విస్తృతం చేశారు. అంతేకాదు, ఏడాదికి 5 ల‌క్ష‌ల ఆదాయం ఉన్న‌ప్ప‌టికీ.. ఆరోగ్య శ్రీని అందిస్తున్నారు.  దీనిని ప్ర‌తి ఒక్క‌రూ హ‌ర్షిస్తున్నారు. అంతేకాదు.. ప‌క్క రాష్ట్రాల వాళ్లు కూడా క‌ళ్లు పెద్ద‌వి చేసుకుని మ‌రీ చూస్తున్నా రు. కానీ, అదేంటో.. మ‌న రాష్ట్రంలో ఫార్టీ ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీకి మాత్రం ఇది క‌నిపించ‌డం లేదు. 

 

ఇక‌, ఇప్పుడు ఏకంగా  ఆంధ్రప్రదేశ్‌ ప్రజారోగ్య వ్య‌వ‌స్థ‌లో సువర్ణాధ్యాయం లిఖించబడింది. రాష్ట్రంలో 95 శాతం కుటుంబాలకుపైగా ఆరోగ్యశ్రీ ద్వారా భరోసా కల్పించిన ముఖ్యమంత్రి జ‌గ‌న్‌.. అత్యవసర వైద్య సేవలందించే 108, 104 సర్వీసుల్లో కూడా తనదైన ముద్ర వేశారు. ఒకేసారి ఏకంగా 1,088 వాహనాలను (108–104 కలిపి) ప్రారంభించారు.  కొత్తగా సిద్ధం చేసిన 412 అంబులెన్స్‌లలో 282 బేసిక్‌ లైఫ్‌ సపోర్టు (బీఎల్‌ఎస్‌)కు సంబంధించినవి కాగా, 104 అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్టు (ఏఎల్‌ఎస్‌)గా తీర్చిదిద్దారు.  మరో 26 అంబులెన్స్‌లను చిన్నారులకు (నియో నేటల్‌) వైద్య సేవలందించేలా తయారు చేశారు. మొత్తానికి ఇదో బృహ‌త్త‌ర ప‌థ‌కంగా ప్ర‌జ‌ల మ‌నో రికార్డు ల‌కు ఎక్కింది. కానీ.. ఎల్లో మీడియాకు, ప్ర‌తిప‌క్షం టీడీపీకి ఎక్క‌డా ప్ర‌జ‌ల మ‌న‌సు క‌నిపించ‌డం లేదు. పైగా ఇందులో ఏదో అవినీతి జ‌రిగిపోయింద‌ని.. బుర‌ద‌జ‌ల్లుడు కార్య‌క్ర‌మానికి తెర‌దీశారు. అందుకే.. కొంచెం.. క‌ళ్ల‌ద్దాల‌ను స‌వ‌రిస్తేనే కానీ.. బోధ‌ప‌డ‌దు.. అంటున్నారు ప్ర‌జ‌లు! మ‌రి బాబుగారు ఏం చేస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: