కోవిడ్ 19 వచ్చి ఇప్పటికే దాదాపుగా ఆరు నెలలు గడిచిపోయాయి. పరుగుల ప్రపంచం నిలిచిపోయింది. అనుక్షణం అయోమయం, అల్లకల్లోలం..! అంతా స్తంభించిపోయింది ఎక్కడికక్కడ అన్నీ ఆగిపోయాయి. దేశాలు దద్దరిల్లాలి దేశాధినేతలు వణికిపోయారు. మంచాన పడ్డారు అనారోగ్యం తో పోరాడారు. పెద ధనిక తేడా లేదు... చిన్న చితకా అనే తేడా లేదు... మంచు చలి వేడి అనే పరిణామాలతో పని లేదు.... పగలు రాత్రి ప్రతి క్షణం ప్రతినిత్యం కలవరపెట్టింది కరోనా మహమ్మారి. 6 నెలల ఈ దారుణ గాద మరో పదేళ్ళు ప్రపంచాన్ని వెనక్కి నెట్టేసింది. అసలు ఎలా మొదలయ్యింది ఎక్కడ మొదలయ్యింది..? ఏ స్థాయిలో మొదలయ్యింది, ఏ స్థాయికి చేరుకుంది అన్నీ ఒక్కసారి తిరగేసుకుందాం...!

 

ఆరు నెలల వెనక్కి వెళితే గత సంవత్సరం 2019 డిసంబర్ లో మొదట చైనా లోని వుహాన్ పట్టణం లో వైరల్ ఫీవర్ గా మొదలయ్యింది. ఎవ్వరూ అంతా పట్టించుకోలేదు చిన్న జ్వరమే గా అని మాత్రలతో సరిపెట్టారు డాక్టరాలు. చిన్న వైరల్ ఫీవర్ గా మొదలయ్యి నిమోనియా ఏమో ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి అనెంతవరకు వెళ్లిపోయింది. వుహాన్ లో వైరల్ ఫీవర్ తీవ్రత పెరుగుతుంది. చాలా మందికి ఈ వైరల్ ఫీవర్ అంటుకుంది. నిమోనియా అని అనుకున్నారు. డిసంబర్ 31 న ఈ వైరల్ ఫీవర్ పై మొట్టమొదటి ఆర్టికల్ వ్రాయబడింది. వుహాన్ లో కేసులు పెరిగి జనవరి 9 నాటికి వుహాన్ ను కూడా ఈ కేసులు దాటేశాయి. జనవరి 11 న ఈ కొత్తరకం నిమోనియాతో వుహాన్ లో ఒకరు చనిపోయారు. ఈ కొత్తరకం నిమోనియా పై ప్రపంచ ఆరోగ్య సంస్థ పరీక్షలు చేసి ఇది నిమోనియా కాదని ఓ రకమైన కరోనా వైరస్ అని జనవరి 14 న వెల్లడించింది. ఈ వ్యాది ఒకరి నుండి ఒకరికి సంక్రమించె ఛాన్స్ లు తక్కువే అని నిర్ధారించింది.

 

జనవరి 20 నాటికి చైనా లో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది చైనా చేసిన పరిశోదనల ప్రకారం మనిషి నుండి మనిషి కి చాలా ఈజీగా ప్రాకుతుందని అంటువ్యాది అని నిర్ధారణ జరిగింది. జనవరి 21 న చైనా లోనే కాకుండా చైనా బయట కూడా ఈ వ్యాది లక్షణాలు 4 లో కనిపించాయని తెలిపింది WHO. జనవరి 23 కల్లా చైనా లోని మరిన్ని పట్టణాల్లో ఈ వరస్ విజృంబన కనపడింది.  దాంతో చైనా ప్రభుత్వం కేసులు ఎక్కువగా ఉన్న వుహాన్ లో చుట్టుపక్కల ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేసింది. జనవరి 27 న ఓ శాస్త్ర వేత్త ఈ వ్యాదికి పాండమిక్ లక్షణాలు ఉన్నాయని తన రీసర్చ్ ద్వారా నిరూపించారు. జనవారీ 30 కల్లా చైనా లో 170 మంది మరణించారు. భారత్ లో మొట్టమొదటి కేసు కేరళ లో నమోదయ్యింది. అదే నాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచాన్ని, అందరినీ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

 

ఫిబ్రవరీ 2 న చైనా బయటి ప్రాంతం ఫిలిపిన్స్ లో కరోనా లక్షణాలతో ఓ మరణం నమోదయ్యింది. ఫిబ్రవరి 10 కల్లా చైనా లో మృతుల సంఖ్య 1000 కి చేరింది, ఫిబ్రవరి 11 న ఈ వ్యాధికి కోవిడ్ 19 అనే నామకరణం జరిగింది. ఫిబ్రవరీ 14 న ఏషియా ను దాటేసింది. ఫ్రాన్స్ లో తొలి మరణం నమోదయ్యింది. ఫిబ్రవరీ 26 న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాది తో అమెరికాకు ఎటువంటి ముప్పు లేదని అది అమెరికా ను ఏమి చేయలేదని అన్నారు. ఫిబ్రవరీ 29 న అమెరికాలో మొదటి మరణం నమోదు. మార్చ్ 14 కల్లా యావత్ యూరోప్ లో ఈ మహమ్మారి సమస్య తారా స్థాయికి చేరుకుంది. ఫ్రాన్స్ లో స్పెయిన్ లో లాక్ డౌన్ అమలు చేశారు. ప్రపంచంలో కలవరం మొదలయ్యింది. ఆశ్చర్యంగా మార్చ్ 18 న చైనా లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా చైనా లో ప్రభావం చూపడం ఆపేసింది.

 

మార్చ్ 23 కల్లా ప్రపంచ నలుమూలలా వ్యాపించేసింది. పాండమిక్ గా రూపాంతరం చెందింది. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరిగిపోతున్నాయి మరణాల సంఖ్య పెరిగిపోతుంది ప్రపంచమంతా ఆందోళనకు గురవుతుంది. ఏప్రిల్ మొదటి వారంలో బ్రిటన్ ప్రధాని కి కరోనా పాజిటివ్ అని తేలింది. వారం చివరికల్లా స్పెయిన్ లో అమెరికా లో 10 వేల మరణాలు నమోదయ్యాయి. రెండవ వారంలో ప్రపంచవ్యాప్తంగా లక్ష కేసులు నమోదయ్యాయి. మే మొదటి వారంలో ఇటలీ లో 30 వేల మరణాలు బ్రెజిల్ లో 10 వేల మరణాలు యుకె లో 40 వేల మరణాలు జూన్ రెండవ వారం మొదటిలోనే ప్రపంచ వ్యాప్తంగా 4 లక్షల మరణాలు నమోదయ్యాయి. జూన్ మూడవ వారం వచ్చేలోగా బ్రెజిల్ లో 50 వేలు దాటిన మరణాలు అమెరికా లో 120000 మరణాలు. భారత్ లో ఐదు లక్షల కేసులు 17 వేల చేరువ లో మరణాలు. జూన్ 1 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 1 కోటి 11 లక్షల పై చిలుకు కేసులు, 5 లక్షల 14 వేల మరణాలు. నిమిషానికి 100 కేసుల స్పీడ్ తో ఈ మహమ్మారి ప్రపంచాన్ని బంతాట ఆడుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: