విజయసాయి రెడ్డి పుట్టిన రోజు నాడు పార్టీకి చెందిన ముగ్గురు కీలక వ్యక్తులకు మూడు కీలక బాధ్యతల్ని అప్పగించారు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. విజయసాయి రెడ్డిని కేవలం మూడు జిల్లాలకు పరిమితం చేస్తూ.. మిగిలిన పది జిల్లాల్లో కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల బాధ్యతల్ని సజ్జల రామకృష్ణారెడ్డికీ, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల బాధ్యతల్ని వైవీ సుబ్బారెడ్డికీ అప్పగించారు వైసీపీ అధినేత. సజ్జల రామకృష్ణారెడ్డికి అదనంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం బాధ్యతల్ని వైఎస్‌ జగన్‌ అప్పగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

 

పార్టీలో సీఎం జగన్ తర్వాత అంతా తానే అని చెప్పుకునే విజయసాయిరెడ్డి సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సంతృప్తిగా లేరని తెలుస్తుంది. తనని ఒక ప్రాంతానికే పరిమితం చేయడం ఆయనకి నచ్చడం లేదనే చర్చ ఇప్పుడు సొంత నేతల్లోనే మొదలైంది. గత కొద్ది రోజుల నుంచి సీఎం జగన్, విజయసాయి రెడ్డిని పక్కన పెడుతున్నాడు అంటూ వస్తున్న వార్తలకు ఇవి మరింత బలానిచ్చినట్టు భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

 

అలాగే సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి రావ‌డంతో 108, 104 సేవ‌ల‌కు మ‌ళ్లీ మెరుగులు దిద్దారు. కొత్త‌గా 1000కి పైగా వాహ‌నాలు కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే. మండ‌లానికి ఒక అంబులెన్స్ చొప్పున ప్ర‌భుత్వం కేటాయించం జ‌రిగింది. అత్యాధునిక స‌దుపాయాలు, టెక్నాల‌జీతో ఈ కొత్త వాహ‌నాలు రోడ్డెక్కాయి. బుధ‌వారం ఈ కొత్త వాహ‌నాల‌ను ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌చ్చ జెండా ఊపి విజ‌య‌వాడ‌లో ప్రారంభించారు. దీన్ని ఓ సువ‌ర్ణ అధ్యాయంగానే భావించాలి. అయితే ఈ కార్యక్రమం కూడా విజ‌య‌సాయి రెడ్డి పుట్టిన రోజు నాడే జరగటంతో.. ఇది తనని నమ్ముకున్న మిత్రుడికి జగన్ ఇస్తున్న అపురూపమైన కానుక అని కొందరు వైసీపీ నేతలు చెప్తున్నారు. ఏది ఏమైనా పుట్టిన రోజు నాడు విజ‌య‌సాయి రెడ్డికి, సీఎం జగన్ ఒక బ్యాడ్, ఒక గుడ్ గిఫ్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: