2019 ఎన్నికల్లో భారీ విజయాన్ని కైవసం చేసుకొని.. 151మంది ఎమ్మెల్యేలతో అధికారం చేపట్టిన సీఎం జగన్ మోహన్ రెడ్డి.. పాలనలో దూసుకుపోతున్నారు. కానీ రాష్ట్ర ప్రగతి కోసం ఆయన ప్రవేశపెట్టే బిల్లులను మాత్రం శాసనమండలిలో నెగ్గించుకోలేకపోతున్నారు. దానికి కారణం శాసనమండలిలో టీడీపీకి ఎక్కువ బలం ఉండటం. దీంతో శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు సీఎం జగన్.

 

దీనికి ప్రతిపక్ష టీడీపీ ఒప్పుకోలేదు.. దీంతో వీరి మధ్య పెద్ద యుద్దమే జరిగింది. కానీ, ఏదోకరకంగా శాసనమండలిని రద్దు చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అయితే ఇది మాత్రం ఇప్పుడప్పుడే రద్దు అయ్యేలా కనపడటం లేదు. ఎందుకంటే ఇది కేంద్రం చేతుల్లో పని. ఒకవేల ఈ విషయంలో రాష్ట్రం గనుక కేంద్రాన్ని ఆశ్రయిస్తే.. ఆ తర్వాత చాలా విషయాల్లో కేంద్ర చెప్పిన వాటికి రాష్ట్రం తల ఉపాల్సి ఉంటుంది.

 

ఈ విషయం సీఎం జగన్ కి ఆలస్యంగా బోధపడింది. అందుకే మండలిని రద్దు చేయడం ఎందుకు..? బలం పెంచుకుంటే బాగుంటుంది కదా..! అని జగన్ ఆలోచించారు. ఆ దిశగా పావులు కదుపుతున్నారు. మండలిలో ప్రస్తుతం 10 మంది ఉండగా.. మరో 20 మంది ఉంటే జగన్ కి తిరుగులేనట్టే. సభతో పాటూ మండలిలోనూ దుమ్ము లేపేయొచ్చు. అయితే జగన్ అనుకున్నట్టు శాసనమండలిలో వైసీపీకి బలం కావాలంటే మరో ఏడాది ఆగాల్సిందే. మరో ఆరు నెలల్లో 12 మంది ఎమ్మెల్సీలకు గడువు తీరిపోతుంది.

 

అప్పుడు గవర్నర్, ఎమ్మెల్యేల కోటాలో తిరిగి వీటిని పూరించాల్సి ఉంది. ఇవన్నీ వైసీపీకి దక్కనున్నాయి. అక్కడికి మరో ఆరు నెలల్లో మరో 14 సీట్లు ఖాళీ అవుతాయి. అంటే వచ్చే జూన్ నాటికి కూడా ఈ 14 లో వైసీపీకి 10 దక్కనున్నాయి. దీన్ని బట్టి చూసుకుంటే జనవరి, ఫిబ్రవరి నాటికి 12.. జూన్ నాటికి మరో 10 కలుపుకుని వైసీపీకి 22 సభ్యులు రావడం ఖాయం. ఇప్పుడున్న బలం 10, ఆ 22 కలిపితే 32 కి చేరుతుంది. ఇక మండలిలో వైసీపీకి తిరుగుండదు.. మరి సంవత్సరం వరకు సీఎం జగన్ ఆగుతాడా…? ఆగి మండలిలో తన బలాన్ని పెంచుకుని తాను అనుకున్నది సాధిస్తాడా..? లేక మండలి రద్దు అంటాడా…? అనేది తెలియాలంటే చాలా కాలం ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: