ఏపీ విప‌క్ష నాయ‌కుడు.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ప్ర‌తిప‌క్ష నేతగా త‌న బాధ్య‌త‌ల‌ను ప్ర‌గాఢ అంకిత భా వంతో పోషిస్తున్నారని ఆయ‌న పార్టీ నేత‌లు వేనోళ్ల కొనియాడుతున్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ముప్పు తిప్పులు  పెట్ట‌డంలో చంద్ర‌బాబు స‌ఫ‌లీకృత‌మ‌య్యారని కూడా చాటుతున్నారు. స‌హ‌జంగానే ఏ పార్టీలో అయి నా నాయ‌కులు చేసే ప‌ని ఇదే! దీనిని త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం పెద్ద‌గా క‌నిపించ‌దు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ది ఎందుకురా? అని ఏ అమాయ‌కుడైనా అడిగితే.. ప్ర‌భుత్వ‌మ‌నే గుడ్డుమీద ఈక‌లు పీకేటందుకురా! అన్నాట్ల ఓ గ‌డుగ్గాయ్‌!- సో.. చంద్ర‌బాబు చేస్తున్న ప‌నిని త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. ఈ విష‌యా న్ని అధికార పార్టీ నేత‌లు, వైసీపీలో క‌ర‌డు గ‌ట్టిన దురంధ‌రులు కూడా ఇదే చెబుతున్నారు. 

 

ఇప్పుడంటే.. క‌మ్యూనిస్టులకు కోర‌లు లేవుకానీ, గ‌తంలో దేశంలో రెండో ద‌శ ఉద్య‌మాలు జ‌రిగిన‌ప్పుడు చా లా యాక్టివ్‌గానే ఉన్న కామ్రెడ్లు.. పార్టీ కార్య‌క‌ర్త‌లకు ఆరు నెల‌ల‌కోసారి `అధ్య‌య‌న` త‌ర‌గుతులు పెట్టేవా రు. ఈ త‌ర‌గ‌తుల్లో ప్ర‌భుత్వాన్ని ఎలా విమ‌ర్శించాలి?  ప‌థ‌కాల‌పై ఎలా ఎండ‌గ‌ట్టాలి?  ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌ల ను ఎలా ఇరుకున పెట్టాలి? అనే విష‌యాల‌పై క్లాసులు చెప్పేవారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వం ఏం చేసినా .. చేయ‌లేద‌ని చెప్పాలి.  విధానాల‌ను త‌ప్పుబ‌ట్టాలి... ప‌స ఉన్నాలేకున్నా.. పోరు చేయాలి! అని నూరి పోసేవారు. బ‌హుశ‌.. క‌మ్యూనిస్టుల‌తో చంద్ర‌బాబు చాన్నాళ్లు స్నేహం చేసిన ఫ‌లిత‌మో.. లేక వారితో చెట్టాప‌ట్టాలేసుకుని న‌డిచిన కార‌ణ‌మో.. ఏమో.. బాబుపై క‌మ్యూనిస్టుల‌ప్ర‌భావం బాగానే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 


ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు ఇటీవ‌ల కాలంలో ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతున్నా.. ప‌స ఉండ‌డం లే ద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. త‌న‌కు న‌ల‌భై ఏళ్ల‌రాజ‌కీయ అనుభ‌వం ఉంద‌ని ఢంకా భ‌జాయించే బా బు.. దానికి త‌గిన విధంగా ప్ర‌భుత్వానికి పార‌ద‌ర్శ‌క కోణంలో చేసిన సూచ‌న‌ల కంటే కూడా.. లేనిపోని విమ ‌ర్శ‌లు చేస్తూ.. పొద్దు పుచ్చుతున్నారు. గ‌తంలో చంద్ర‌బాబు క‌మ్యూనిస్టుల‌ను ఉద్దేశించి ఓ మాట అనేవా రు.. `కాలం చెల్లిన సిద్ధాంతాలు ప‌ట్టుకుని ఏడుస్తున్నారు!` అని!! అచ్చు.. ఈ మాటే ఇప్పుడు బూమ‌రాంగ్ మాదిరిగా ఆయ‌న‌కు కూడా త‌గులుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. బాబు కూడా కాలం చెల్లిన విమ‌ర్శ‌ల‌తో.. ప‌స‌లేని వాద‌న‌లు చేస్తున్నార‌ని చెబుతున్నారు. 


ప్ర‌భుత్వం ఏ ప‌నిచేస్తున్నా.. విమ‌ర్శించేవాళ్ల‌ను ఏమ‌నాలి? అని గ‌తంలో రెండేళ్ల కింద‌ట ఏపీ ముఖ్యమం త్రిగా చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. అంతేకాదు, ప్ర‌తి విష‌యంపైనా కోర్టుల‌కు వెళ్లి అడ్డు త‌గులుతున్నా ర‌ని  కూడా వాపోయారు. చిత్రం ఏంటంటే.. గ‌తంలో ఏదైతే..తాను చెప్పారో.. ఇప్పుడు అదే చేస్తున్నారు. కేర‌ళ‌, ప‌శ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో క‌మ్యూనిస్టులు కూడా ఇంతేన‌ట‌! వారు అధికారంలో ఉన్న‌ప్పుడు ఒక విధంగా.. అధికారం దిగిపోయిన త‌ర్వాత మ‌రో విధంగా విమ‌ర్శ‌లు చేస్తార‌ట‌. ఇప్పుడు బాబు కూడా ఇలాంటి ప‌నులే చేస్తుండ‌డంతో క‌మ్యూనిస్టుల వాస‌న బాబుకు బాగానే ప‌ట్టిన‌ట్టుందే.. వారు చేయాల‌ని డ్యూటీని బాబు చేస్తున్నార‌నే అని చెప్పుకొంటున్నారు ప‌రిశీల‌కులు. నిజ‌మేనా? ! ఒక్క‌సారి ఏడాది కాలంలో చంద్ర‌బాబు డైరీని ప‌రిశీలిస్తే.. తెలిసిపోతుందేమో!! 

మరింత సమాచారం తెలుసుకోండి: