చంద్రబాబు అంటేనే మీడియా మేనేజ్ మెంట్‌ గురు అని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఆయన తాను చేసిందాన్ని ప్రజలకు చేరవేయడంలో మీడియాను చాలా బాగా ఉపయోగించు కుంటారు. చేసిందాన్నే కాదు.. చేయని దాన్ని కూడా చేసినట్టుగా చూపించేందుకు కూడా అనుకూల మీడియాను చంద్రబాబు బాగా వాడతారని గిట్టనివారు విమర్శిస్తుంటారనుకోండి..అది వేరే విషయం.

 

 

ఇక అసలు విషయానికి వస్తే.. గురువారం జూమ్ యాప్ ద్వారా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఎప్పటిలాగానే సుదీర్ఘంగా ఓ గంటసేపు వాయించేశారు. అది ఎలాగూ రొటీన్ అనుకోండి.. చంద్రబాబు ప్రెస్ మీట్ అంటేనే గంట అన్నది ఓ మినిమం లిమిట్ అన్నమాట. అయితే ఈ ప్రెస్ మీట్లో ఆయన ఎన్ని విషయాలు మాట్లాడినా పెద్దగా ఏమీ అనిపించలేదు కానీ.. ఓ డైలాగ్‌ కొట్టేసరికి.. వినే వాళ్ల మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయ్యింది.

 

 

ఆయన చెప్పింది విని అర్థమయ్యాక.. ఇక దేంతో నవ్వాలో ఓ పట్టాన వినేవాళ్లకు అర్థం కాలేదు. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటో తెలుసా.. ” జగన్ ప్రభుత్వం.. చేసిందేమీ లేకపోగా.. ప్రకటనల రూపంలో ప్రజాధనాన్ని వృధా చేస్తోంది.. కోట్లకు కోట్లు తగలేస్తోంది..” అసలు ఈ విమర్శ చేసే అర్హత చంద్రబాబుకు ఉందా అంటున్నారు ఆంధ్రప్రజ. ఒక్కసారి ఐదేళ్ల పాలనను ఫ్లాష్ బ్యాక్ రూపంలో గుర్తు తెచ్చుకుంటున్నారు.

 

 

ఏ చిన్న పథకం ప్రవేశపెట్టినా.. పత్రికలు, టీవీల్లో యాడ్ల రూపంలో వందల కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబేనా ఈ మాట అంటున్నది అంటూ జనం అవాక్కయ్యారు. ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి. చంద్రబాబు సర్కారుతో పోలిస్తే జగన్ సర్కారు ప్రకటనల రూపంలో ఖర్చు చేస్తున్నది చాలా తక్కువ. పాపం.. చంద్రబాబు ఏదో ప్రతిపక్షం అన్నాక విమర్శించాలి కాబట్టి ఆ మాట అన్నారేమో కానీ.. అలా అనేటప్పుడు వినేవాళ్ల పరిస్థితి ఏంటి అని ఒక్కసారి ఆలోచిస్తే బావుంటుందని విన్నవించుకుంటున్నారు ఆంధ్రప్రజ.

మరింత సమాచారం తెలుసుకోండి: