క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి.  మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ ఎంఎల్ఏ జేసి ప్రభాకర్ రెడ్డి రెండు రోజుల్లో అరెస్టయ్యారు. అరెస్టయ్యిన దగ్గర నుండి చంద్రబాబునాయుడు, చినబాబుతో సహా యావత్ టిడిపి నేతల దృష్టంతా మొత్తం అచ్చెన్నాయుడు మీద ఉందే కానీ కనీసం ఒక్కళ్ళు కూడా ప్రభాకర్ రెడ్డి వైపు చూడలేదు. అరెస్టు కాగానే అచ్చెన్నను కలవటానికి ముందుగా లోకేష్ వచ్చాడు. తర్వాత చంద్రబాబు ప్రయత్నించాడు. ఆ తర్వాత మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్ఏలు, నేతలు చేస్తున్న ప్రయత్నాలు అందరికీ తెలిసిందే. మాజీ మంత్రిని కలవటానికి ఆసుపత్రి దగ్గర ప్రయత్నించారు. కుదరకపోయేటప్పటికి జైలులో కూడా ప్రయత్నించారు.

 

అచ్చెన్నను కలవటానికి ఇప్పటి వరకు టిడిపి చేసిన అన్నీ ప్రయత్నాలూ ఫెయిల్ అయినట్లే అనుకోవాలి. సరే ఈ విషయాన్ని కొద్దిసేపు పక్కనపెట్టేస్తే మరి జేసి ప్రభాకర్ రెడ్డి మాత్రం ఏమి పాపం చేశాడు. పార్టీ మొత్తం మీద కనీసం ఒక్కళ్ళంటే ఒక్క నేత కూడా మాజీ ఎంఎల్ఏని కలవటానికి ప్రయత్నం చేసినట్లు ఎక్కడా కనబడలేదు. మిగిలిన నేతల సంగతిని వదిలేసినా చివరకు జిల్లాలోనే ఉన్న మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్ఏలు కూడా ప్రభాకర్ రెడ్డిని కలవటానికి ఇష్టపడటం లేదు. చివరకు మాజీ ఎంఎల్ఏకి  మద్దతుగా ఒక్క ప్రకటన కూడా చేయలేదు.

 

ఇద్దరు నేతల విషయంలో పార్టీ నేతలు ఎందుకింత వివక్ష చూపిస్తున్నారు ?  అచ్చెన్నను కలవటానికి చూపిస్తున్న ఇంట్రస్టు జేసి ప్రభాకర్ రెడ్డి విషయంలో ఎందుకు చూపించటం లేదు ? ఎందుకంటే జేసి బ్రదర్స్ ను చంద్రబాబు వదిలించుకున్నట్లే కనబడుతోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నిజానికి జేసి బ్రదర్స్ వల్ల  చంద్రబాబుకు ఇపుడు ఉపయోగం ఏమీలేదు. ఒకపుడంటే జగన్మోహన్ రెడ్డిని నోటికొచ్చినట్లు బూతులు తిట్టటానికి జేసి బ్రదర్స్ ను చంద్రబాబు బాగా వాడుకున్నాడనే ఆరోపణలు వినబడుతున్నాయి.

 

చంద్రబాబు సిఎంగా ఉన్నపుడు ఎక్కడ బహిరంగసభ జరిగినా  మాజీ ఎంపి  జేసి దివాకర్ రెడ్డి ఉండాల్సిందే, జగన్ను నోటికొచ్చినట్లు తిట్టాల్సిందే. జగన్ను మాజీ ఎంపి తిడుతున్నపుడు చంద్రబాబు ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్న విషయం జనాలు అందరు చూసిందే.  ఎన్నికల్లో జేసి వారసులతో పాటు జిల్లాలోని నేతల్లో చాలామంది ఓడిపోయారు. పార్టీ కూడా చరిత్రలో ఎన్నడూ లేనంతటి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నది. కాబట్టి చంద్రబాబుకు ఇక జేసి బ్రదర్స్ అవసరం తీరిపోయిందా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం అక్రమాలపై మాజీ ఎంఎల్ఏని అరెస్టు చేయటంతో ఎవరూ నోరిప్పటం లేదు.

 

ఇక అచ్చెన్న విషయంలో చంద్రబాబు ఎందుకు ఇంత ఇంట్రస్టు చూపిస్తున్నాడంటే బిసి కార్డు ఉండటమే. అచ్చెన్న బిసి నేత అన్న విషయం అందరికీ తెలిసిందే. నిజానికి బిసి సామాజికవర్గం కోసం అచ్చెన్న చేసిందేమీ లేదని బిసి సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశని శంకర్ స్పష్టంగా ప్రకటించారు. అచ్చెన్న అవినీతికి బిసి సామాజికవర్గానికి ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్పేశాడు. సరే బిసి సంఘాల ఎంత స్పష్టంగా చెప్పినా చంద్రబాబు అయితే తన బిసి కార్డును ఉపయోగించకుండా ఉండడు కదా ? అసలే దూరమైన బిసిలను దగ్గరకు తీసుకోవటం ఎలా ? అని తలలు బద్దలు కొట్టుకుంటున్నాడు. ఈ నేపధ్యంలో అచ్చెన్న అరెస్టును చంద్రబాబు తన రాజకీయానికి ఉపయోగించుకుంటున్నాడనే అనుకోవాలి. అందుకనే పదే పదే అచ్చెన్న జపం చేస్తున్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: