ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మళ్ళీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అవసరం వచ్చిందా..? ప్రశాంత్ కిషోర్ కి సీఎం జగన్ కొత్త బాధ్యతలు అప్పగిస్తున్నారా..? వీరిద్దరి కలయికతో రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తు  పూర్తిగా మారబోతున్నాయా..? అంటే అవుననే చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు..

 

2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు, జగన్ ఎత్తుగడలతో ప్రత్యర్ధులను చిత్తు చిత్తుగా ఓడించి.. భారీ విజయాన్ని కైవసం చేసుకుంది వైసీపీ. ఆ తర్వాత జగన్ సీఎం అయ్యాక.. ప్రశాంత్ కిషోర్ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కనిపించలేదు. అసలు ఆయన ఊసే లేదు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అయితే అధికారం చేపట్టిన సంవత్సర కాలం తర్వాత సీఎం జగన్ కి ఇప్పుడు మళ్ళీ ప్రశాంత్ కిషోర్ అవసరమొచ్చినట్టు తెలుస్తుంది.

 

రాష్ట్రంలోని క్రింది స్థాయి ప్రజలు అసలు తమ ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయా..? లేదా..? ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ అదేవిధంగా సచివాలయాల పనితీరు ఎలా ఉంది.? అనే అంశాలపై క్షేత్రస్థాయిలో ఫీడ్ బ్యాక్ కోరగా సీఎం జగన్ కు సరైన సమాచారం రావటంలేదట. చుట్టూ ఉన్న కొంతమంది నేతలు, భజన బృందం..  ప్రభుత్వ పాలన అమోఘం, అద్భుతం అని చెబుతున్న వాటిని సీఎం జగన్ లెక్కలోకి తీసుకోవటం లేదని సమాచారం.

 

ఈ నేపధ్యంలో మరోసారి ప్రశాంత్ కిషోర్ టీం ద్వారా ఏపీ జనాలు ప్రభుత్వం పట్ల కలిగి ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి సర్వేలు చేయించుకోవడానికి జగన్ రెడీ అయినట్లు వార్తలు అందుతున్నాయి. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, ప్రశాంత్‌ కిషోర్‌తో ఇటీవల పలు దఫాలుగా చర్చించారట. తన ఏడాది పాలనపై, అలాగే వాలంటీర్ల, సచివాలయాల వ్యవస్థలపై ప్రశాంత్ కిషోర్ టీం సభ్యుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించడానికి జగన్ రెడీ అయినట్లు సమాచారం. పీకే ఇచ్చే సర్వే రిపోర్టును బేస్ చేసుకుని.. పాలనలో ఉన్న తప్పులను సరిదిద్దుకుంటూ.. ప్రజల అసంతృప్తికి గల కారణాలను తెలుసుకుని వాటిని సరిచేస్తూ.. ప్రజల మన్ననలు పొందాలని సీఎం జగన్ భావిస్తున్నారట. తద్వారా రానున్న ఎన్నికల్లో గెలుపు సులువవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారాట.

మరింత సమాచారం తెలుసుకోండి: