తమిళనాడు లో మరో దారుణం...! లాక్ డౌన్ లో నియమాలు ఉల్లంఘించారంటూ తండ్రి కొడుకులు జయరాజ్ మరియు ఫెనిక్స్ లను పోలీస్ కస్టడీ అంటూ తీసుకెళ్లి లాఠీలు విరిగేంత వరకు కొట్టారు. బట్టలు ఊడదీసి రాడ్లను క్రిందిభాగంలోకి దింపి మర్మాంగాలు పగిలేలా కొట్టి ఇద్దరి ప్రాణాలు తీశారు. వారి బట్టలు రక్తంతో తడిసిపోతే వారి ఇళ్లకు ఆ బట్టలను పంపి కొత్తవి పంపమని వాటిని వారి మృతదేహాలకు వేశారు.

 

ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది...! ఈ ఘటన జరిగిన తీరును గుర్తు చేసుకుంటే కంట నీరు ఆగదు. ఘటన జరిగిన తీరును తలచుకుంటే నిదుర కూడా పట్టదు అలాంటి నీచానికి ఒడగట్టారు తమిళనాడు పోలీసులు. ఇప్పుడు ఇదే క్రమంలో మరో దుశ్చర్యకు పాల్పడ్డారు తమిళనాడు పోలీసులు. మణికందన్ అనే ఓ 32 ఏళ్ల వ్యక్తిని పోలీసులు తీవ్ర హింసకు గురిచేశారు. లాఠీలు విరిగేలా కొట్టి చేతులు కాళ్ళు విరగొట్టారు. పోలీసులు కొట్టినట్టు చెబితే చంపేస్తామని బెదిరించారు...

 

తమిళనాడుకు చెందిన మణికందన్ (32) అనే వ్యక్తి వ్యవహార రీత్యా కేరళ లోని గురువాయూర్ లో హోటల్ మేనేజర్ గా విదులు నిర్వహిస్తున్నాడు. మణికందన్ ఈ ఏడాది జనవరీ లో ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ లో మణికందన్ డీఎంకే నేత ఎమ్మెల్యే అనితా ఆర్ రాధాకృష్ణన్ కేవలం నాదర్ కమ్యూనిటికే మాత్రమే మద్దత్తుగా ఉంటారని ఇతర సభ్యులతో సరిగ్గా వ్యవహరించరని ఓ పోస్ట్ చేశాడు. అయితే తమిళనాడులో నాదర్ కమ్యూనిటీ చాలా పవర్ ఫుల్ అనే విషయం తెలిసి కూడా మణికందన్ ఆ పోస్ట్ ను షేర్ చేశాడు. ఆ పోస్ట్ కాస్త వైరల్ అవ్వడంతో మొదలు మణికందన్ కు ఆయన కుటుంబ సభ్యులకు నాదర్ కమ్యునిటీ నుండి బెదిరింపులు వచ్చాయి. ఆపై మణికందన్ పై పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ కూడా నమోదు అయ్యింది.

 

అయితే జూన్ 7 న మణికందన్ ఇంటికి పోలీసులు వచ్చారు మణికందన్ గురించి వారిని అడిగి అడ్రెస్ సేకరించారు. జూన్ 8 న కేరళ లోని మణికందన్ నివాసానికి చేరుకున్న పోలీసులు మణికందన్ ను తమతో పాటు తమిళనాడుకు అంటే దాదాపుగా 500 కిలోమీటర్ల అవతల ఉన్న పక్క రాష్ట్రానికి తీసుకెల్లారు. సాధారనంగా ఆరెస్ట్ వారెంట్ ఉంటే కానీ పోలీసులు ముద్దాయిని అలా రాష్ట్రం దాటించి తీసుకెళ్ళేందుకు వీలు పడదు. ఒక వేల పోలీసుల వద్ద వారెంట్ లేని పక్షంలో ఆ రాష్ట్రం పోలీసులకు కాంప్లెయింట్ ఉన్న విషయాన్ని తెలియజేయాలి ఆపై ఆ రాష్ట్రం పోలీసులు నిందితుడిపై చర్యలు తీసుకుంటారు. కానీ మణికందన్ విషయంలో అలా జరుగలేదు పోలీసులు కనీసం వారెంట్ కూడా లేకుండా మణికందన్ ను తమతో పాటు రాష్ట్రం దాటించి తీసుకెళ్లారు. ఆపై తమిళనాడు లోని తిరుచెందూర్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు.

 

అక్కడ మణికందన్ ను ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకూ కొడుతూనే ఉన్నారు.. అలా మూడు లాఠీలు విరిగిపోయాయి..! మణికందన్ కాలు కూడా ఫ్రాక్చర్ అయ్యింది. రెండు గంటల తరువాత సరిగ్గా మళ్ళీ 5 గంటలకు మణికందన్ చేతుని కిటికీ కట్టేసి మరో చేతిని స్తంభానికి కట్టేసి ఇనుప రాడ్ తో చేతులు విరిగేలా కొట్టారు.. ఆ దెబ్బలకు మణికందన్ కుప్పకులాడు. ఆపై మణికందన్ కు చికిత్స అందించి కోర్టుకు తరలించారు. కోర్టులో కానీ జడ్జీ దగ్గర కానీ పోలీసులు కొట్టినట్టు చెబితే చంపేస్తామని హెచ్చరించారు ఆ పోలీసులు. కోర్టులో మణికందన్ కిందపడినట్టుగా అబద్దం ఆడాడు. అయితే ఈ విషయం మణికందన్ స్వయానా బయటపెట్టలేదు.

 

జయరాజ్ ఫెనిక్స్ లను హతమార్చిన అనంతరం తమిళనాడు హైకోర్టు సీజే జైళ్ల పరిస్థితిని తెలుసుకునేందుకు ఇన్స్ ఫెక్షన్  కు వచ్చారు, అప్పుడు మణికందన్ ను జడ్జ్ ఏం జరిగిందని ఆరా తీయగా అసలు విషయాలు బయటకొచ్చాయి. మణికందన్ తరఫున స్వయానా జడ్జే  కేసును నమోదు చేయించారు. ఈ విషయం పై స్పందించిన అక్కడి ఎస్పీ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించాడు మణికందన్ కు న్యాయం జరుగుతుందని తానే స్వయంగా కేసు గురించి తెలుసుకుంటానని ఆయన పేర్కొన్నారు. మణికందన్ కు పోలీస్ ప్రొటెక్షన్ ను ఇచ్చి ఆసుపత్రిలో వైద్యం అందజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: