రాజకీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌పై పైచేయి సాధించేందుకు పార్టీల‌కు, నాయ‌కులకు ఎప్పుడు అవ‌కాశం వ‌చ్చినా.. వ‌దులుకునేందుకు ఇష్ట‌ప‌డ‌రు. అలానే.. ఇప్పుడు ఏపీలోనూ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, టీడీపీ అధినేత చం ద్రబాబు కూడా త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని వ‌దులుకోబోమ‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి ఏ రాష్ట్రంలో అ యినా.. ప్ర‌తిప‌క్షాల‌కు ఒక అంశం పోతే.. మ‌రో అంశం ల‌భిస్తుంది. దీంతో అంశాల వారీగా.. ప్ర‌భుత్వ పార్టీ ల‌పై దుమ్మెత్తి పోసేందుకు, నిల‌దీసేందుకు ప్ర‌య‌త్నిస్తారు. బ‌హుశ రాజ‌కీయాల్లో `అంశాల వారీగా మ‌ద్ద తిస్తాం`.. `అంశాల వారీగా ప్ర‌భుత్వాన్ని ఎండ‌గ‌డ‌తాం`.. అనే మాట‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. 


కానీ, చిత్రం ఏంటంటే.. రాష్ట్రంలో రాజ‌ధాని విష‌యం మాత్రం ఎప్ప‌టికీ.. చెదిరిపోని, చెరిగిపోని.. విధంగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి అందివ‌చ్చిన అవ‌కాశంగా మారింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఎప్పుడు మూడ్ వ‌స్తే.. అప్పుడు.. రాజ‌ధాని విష‌యాన్ని రాజ‌కీయ రంగుల తెర‌పై 70 ఎంఎం పిక్చ‌ర్‌గా చూపించేస్తు న్నారు. దీంతో ఆకాశానికి ఎగ‌ర‌లేన‌మ్మ ఉట్టిప‌ట్టుకు ఊరేగిన‌ట్టుగా.. చంద్ర‌బాబు దీనిని ప‌ట్టుకుని రాజ‌కీ యాలు చేస్తున్నారు. పోనీ.. రాజ‌ధాని విష‌యాన్ని ఆయ‌న అందిపుచ్చుకున్నా.. గ‌తంలో తాను ఎలా వ్య‌వ హ‌రించారో.. ఇప్పుడు జ‌గ‌న్ దానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించాల‌ని కోరుకోవ‌డ‌మే ఇక్క‌డ చాలా ఆస‌క్తిక‌రంగా మారిన విష‌యం!


రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యాన్ని ఏ ప‌బ్లిక్ డొమైన్‌లో పెట్టారో.. ఎవ‌రి నుంచి స‌ల‌హాలు తీసుకున్నారో.. చెప్ప‌లేని చంద్ర‌న్న‌.. ఇప్పుడు మాత్రం జగ‌న్ ప్ర‌భుత్వం పార‌ద‌ర్శ‌కత కు పాత‌రేసింద‌ని ఊరూ-వాడా చెల‌రేగిపోతున్నారు. నిజానికి త‌న హ‌యాంలో త‌ప్పులు జ‌రిగి ఉండ‌క‌పోతే.. ఇప్పుడు ఇంత‌గా రాజ‌ధాని విష‌యం వివాదాస్పదం అయ్యేది కాద‌నేది ఆయ‌న‌కు కూడా తెలిసిన విష‌య మే.  అంతేకాదు, రాజ‌ధాని నిర్మాణానికి స‌మ‌యం ప‌డుతుంది నిజ‌మే! కానీ, త‌న హ‌యాంలో జ‌రిగిన నిర్మా ణాల‌న్నింటినీ .. `తాత్కాలికం` అనే ముద్ర వేసి.. `ప‌ర్మినెంట్ ` అనే ఓట్ల వేట సాగించినప్పుడు చంద్ర‌బా బు విశ్వ‌స‌నీయ‌తపై సందేహాలు రాకుండా ఉంటాయా? 


రైతుల నుంచి భూములు తీసుకున్నారు స‌రే! వాటితో ప్ర‌భుత్వ‌మే ఒప్పందం చేసుకుంద‌న్నారు వాస్త‌వ మే. అయితే, ఈ భూముల‌ను అయిన‌వారికి అంతలంత‌లుగా పందేరం చేయ‌డానికి ఎవ‌రితో ఒప్పందం చేసుకున్నారు?  ఎవ‌రికి మ‌టుకు వారు అయిన‌వారైతే.. చాలు.. అంటూ.. అమ‌రావ‌తిని పంచేశారు. అమ రావ‌తిని ర‌క్షించాల‌ని కేంద్రానికి ఇప్పుడు సాగిల‌ప‌డుతున్నారు. మ‌రి తాము అధికారంలో ఉన్న స‌మ యంలో ఎందుకు రాజ‌ధాని కోసం కేంద్రంపై ప‌ట్టుబిగించ‌లేక పోయారు. పైగా తాము రాజ‌ధానికి ఇచ్చిన నిధుల‌ను బాబు ప‌క్క‌దారి ప‌ట్టించార‌ని, ఇప్పుడు బాబు కు జేజేలు కొడుతున్న కొంద‌రు బీజేపీ నేత‌లు ఈస‌డించిన‌ప్పుడు బాబు ఎందుకు మౌనం పాటించారు? 

 

అదేస‌మయంలో.. అస‌లు రాష్ట్ర విభ‌జ‌న‌కు కార‌ణ‌మైన కీల‌క అంశం.. అభివృద్ది పోగుప‌డ‌డ‌మే! ఇప్పుడు ఏపీలోనూ అదే క‌దా జ‌రుగుతోంది అమ‌రావ‌తి రూపంలో! రాజ‌ధాని అంటే.. కేవ‌లం కొంద‌రికి, కొన్ని సామా జిక వ‌ర్గాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైతే.. ఇక‌, సామాన్యులు వేర్పాటును కోర‌కుండా ఉంటారా?  ఇదే క‌దా.. విభ‌జ‌న అనంత‌రం రాజ‌ధానిపై ఏర్పాటైన శివ‌రామ‌కృష్ణ‌న్‌ క‌మిటీ నెత్తీనోరూ బాదుకుంది. అయినా ఈ రిపోర్టును ప‌క్క‌కు పెట్టి.. అనుకున్న‌ది చేసిన బాబుగారు.. ఇప్పుడు కూడా త‌న సామాజిక వ‌ర్గానికి పెద్ద దెబ్బ‌తగులుతోంద‌నే నెపంతోనే రాజ‌ధాని అంశాన్ని భుజాన వేసుకున్నారు. 

 

నిజానికి చంద్ర‌బాబు ప్ర‌జాప‌క్ష‌మే అయి ఉంటే.. ప‌శ్చిమ గోదావ‌రిలో తుందుర్రు  ఆక్వాఫ్యాక్ట‌రీని వ‌ద్ద‌ని అక్క‌డి ప్ర‌జ‌లు ఆయ‌న హ‌యాంలోనే గ‌గ్గోలు పెట్టిన‌ప్పుడు.. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్వాసితులు త‌మ‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని నెత్తీనోరూ బాదుకున్న‌ప్పుడు.. బాబు ఏమ‌య్యారు? ప‌్ర‌త్యేక హోదాతో ఏమొస్తుంద‌న్న పెద్ద‌మ‌నిషి.. దీనికోసం గ‌ళం వినిపించిన వారిపై కేసులు పెట్టించిన పెద్ద‌మ‌నిషి.. మ‌ళ్లీ ప‌ద‌వీ వ్యామోహంతో దీనిని భుజాన వేసుకోలేదా?  `మూడ్ వ‌స్తే.. మాది..` అనే టైపులో రాజ‌కీయాలు చేయ‌లేదా? ఇలా ఒక‌టి కాదు..రెండు కాదు.. అనేక విష‌యాల్లో చంద్ర‌బాబుది సామాజిక రాజ‌కీయం కాద‌నే ధైర్యం పార్టీలోనే ఎవ‌రికీ లేదని అంటారు త‌మ్ముళ్లు!  మొత్తానికి త‌న‌కు మూడ్ వ‌చ్చిన‌ప్పుడు అందిన ఏ అవ‌కాశాన్నీ వ‌దులుకోని చంద్ర‌బాబు నుంచి నేర్చుకోవాల్సింది చాలానే ఉంది!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: