నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గత కొద్ది రోజులుగా సొంత పార్టీకి మేకులా మారిన విషయం తెలిసిందే. దీంతో వైసీపీ ఎంపీలు, పలువురు ముఖ్య నేతలు ప్రత్యేక విమానంలో శుక్రవారం నాడు ఢిల్లీకి వెళ్ళి.. తమ పార్టీకి చెందిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు మీద అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు.

 

అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రఘురామ కృష్ణంరాజు పై విజయసాయి రెడ్డి విరుచుకు పడ్డారు. రఘురామ కృష్ణంరాజు పై కొన్ని కేసులు ఉన్నాయని, వాటి నుంచి కాపాడుకోవటానికి కేంద్ర పార్టీకి దగ్గర అవుతున్నారని అన్నారు విజయసాయి. రఘురామ కృష్ణంరాజు, తమ అధినేత జగన్ నాయకత్వాన్ని బొచ్చులో నాయకత్వం అంటూ, జగన్ ని నిందించారని అన్నారు. అలాగే అనేక విషయాల్లో, పార్టీ గీత దాటి ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారని ఆరోపించారు. ఇవన్నీ చూసిన తరువాత, ఆయన పదవికి అనర్హుడిగా ప్రకటించాలని కోరామని తెలిపారు.

 

ఈ సందర్భంలో  విజయసాయి రెడ్డిని ఒక జర్నలిస్టు ఒక ప్రశ్న అడగగా.. దానికి విజయసాయి సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అదేంటంటే.. రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని చెప్పే మీరు.. ముగ్గురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీని తిడుతూ, మీ పార్టీకి దగ్గరగా ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పటికే అనర్హత పిటీషన్లు కూడా ఇచ్చారు కదా, రఘురామకృష్ణం రాజుకి వర్తించే రూల్స్, వీరికి వర్తించవా ? అని విలేఖరి ప్రశ్నించగా, విజయసాయి రెడ్డి ఇబ్బంది పడ్డాట్టు సమాచారం. ఆ ముగ్గురు ఎవరో తనకు తెలియదు అని, ఇలాంటి విషయంలో ఏమన్నా సందేహాలు ఉంటే ఆ పార్టీని అడగండి అంటూ అసహనం వ్యక్తం చేసారట. మరి ఢిల్లీలో ఈ తరహా సంఘటన చోటుచేసుకుందో లేదో తెలియాలంటే విజయసాయి రెడ్డి నోరు విప్పక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: