మావద్ద అన్నీ వసతులు వనరులు పుష్కలంగా ఉన్నాయి...! తెలంగాణా ఇచ్చే రాష్ట్రమే కానీ అడిగే రాష్ట్రం కాదు...! ఇరుగుపొరుగు రాష్ట్రాలకు కావాల్సివస్తే వెంటిలేటర్లు పంపిణీ చేస్తాం మా వద్ద అవసరానికి మించి ఉన్నాయి...! వేల కోట్లు ఖర్చు పెట్టి కరోనాను తరిమికొడతాం..! మస్కూలు కట్టుకోకుండా పని చేస్తాం...! మరో 10 వేల బెడ్లు తెప్పిస్తున్నాం..! 1700 బెడ్ల ఆసుపత్రి గచ్చిబౌలిలో ప్రారంభిస్తున్నాం...! ఇవన్నీ మేము అన్న మాటలు కావు సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మాటలు.

 

కానీ రాష్ట్రంలో ఇవాళ చూస్తుంటే ఆసుపత్రుల్లో వసతులు లేవు...! గాంధీలో నేలపై కరోనా పేషంట్లు...! వైద్యుల నిర్లక్ష్యం మూలానా గర్భవతు మృతి...! గాంధీ ఆసుపత్రి ఎదుట ఎదురుచూస్తూ కరోనా రోగి మృతి...! గాంధీ లో బెడ్ల కొరత...! గచ్చిబౌలి ఆసుపత్రి నిర్మానుష్యం...! అతి తక్కువ టెస్టులు చేసిన రాష్ట్రంగా ప్రత్యేఖ గుర్తింపు...! కేంద్రం నుండి ఫిర్యాదు...! ప్రగతీ భవన్ లో సిబ్బంధికి కరోనా...! కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ ఎదుట సెక్యూరిటీ సిబ్బంధికి కరోనా...! ఫామ్ హౌజ్ కు పారిపోయిన ముఖ్యమంత్రి అంటూ ఘనత..! కేసీఆర్ సీఎం గా ఫెయిల్ అయ్యాడు అంటూ కీర్తి..! ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలో విద్యుల హత్యలు... ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో ఇవి కూడా మేము అంటున్నవి కావు అనేక వార్తా పత్రికలు, తెలంగాణ ప్రజలు అంటున్న మాటలు.

 

అసలు కేసీఆర్ ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు..? పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతీ రోజు అనేక టెస్టులు నిర్వహిస్తున్నాడు ప్రతీ లక్ష మంది ప్రజల్లో 14 వేల మంది ఇప్పటికే టెస్ట్ చేయబడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు ఓ లక్ష పది వేల టెస్టులు మాత్రమే చేశారు. తెలంగాణ జనాభా చూసుకుంటే ఎంత లేదన్నా దాదాపుగా మూడున్నర కోట్లకు పైమాటే మరి అంతమందికి కేవలం లక్ష టెస్టులు అంటే ప్రతీ లక్ష మందిలో కేవలం35 మందికి మాత్రమే టెస్టులు చేసినట్టు..!

 

లక్ష మందిలో 35 మందికి మాత్రమే టెస్టులు చేస్తే వ్యాధిని కనీసం అంచనా కూడా వేయలేరు కానీ ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ మాత్రం తెలంగాణలో కేసులు లేవు కేవలం జీహెచ్‌ఎం‌సీ పరిధిలోనే ఉన్నాయని చాలా సులభంగా చెప్పేస్తున్నారు. ఆంధ్రాలో ప్రతీ లక్ష మందిలో 14 వేల మందికి టెస్టులు చేసినా వారు కరోనా మహమ్మారికి ఇంకా భయపడుతూనే ఉన్నారు కానీ తెలంగాణ రాష్ట్రంలో లక్ష కు 35 మందికి టెస్టులు చేసి తెలంగాణలో వ్యాధి లేదు టెస్టులు చేస్తున్నాము అంతా కంట్రోల్ లోనే ఉంది వనరులు కావాలంటే పక్క రాష్ట్రాలకు ఇస్తామని అంటున్నారు ఇది ఎంతవరకు సమంజసం..?

ఇక ఆసుపత్రుల తీరు గురించి కొత్తగా చెప్పడానికి విశ్లేషించి అంచనా వేయడానికి ఏమి లేదు. గాంధిలో బెడ్లు లేక నెల పై పేషంట్లు పది ఉన్న వీడియోలు చూసాము. ఆసుపత్రిలో బెడ్లు లేక ఆసుపత్రి ఎదుట ఎదురుచూస్తూ ప్రాణాలు కోల్పోయిన మనుషులను చూసాము. అంబులెన్స్ నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి నన్ను కాపాడండి అంటూ కాళ్ళు పట్టుకుని మరీ చనిపోయిన పరిస్థితి చూసాము. ఇక ఛాతీ ఆసుపత్రిలో 24 గంటల్లో ఇద్దరు వ్యక్తులు సెల్ఫీ వీడియోలు తీసుకొని తమ కుటుంబాలకు చివరి సందేశం పంపిస్తూ బాయ్ డాడి బాయ్ డాడీ అనడం చూసాము.

 

గచ్చిబౌలి లో 1500 కు పైగా బెడ్లు ఉన్న ఆసుపత్రిలో పట్టించుకునే పురుగు లేదు చికిత్స పొందుతున్న రోగి లేడు కేసీఆర్ మాటలు తప్ప..! ఇంకా ఇలాంటి పరిస్థితి గురించి ఇంకా కొత్తగా చెప్పడానికి ఏం ఉంటుంది. ఇక తాజాగా ప్రభుత్వ ఉద్యోగి కరోనా లక్షణాలతో గాంధీకి వెళితే బెడ్లు లేవని పంపించారు.. ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే ప్రతీ రోజు 1.5 లక్షలు చార్జ్ చేస్తున్నారట తనకి తన కుమార్తెకి కూడా కరోనా వచ్చిందట. తన దగ్గర డబ్బు లేదు అంటూ రోదిస్తూ ప్రభుత్వాన్ని వేడుకుంటుంది తనకి సహాయం చేయమని. అసలు గాంధీలో బెడ్లు ఎందుకు లేవు..?

 

గాంధిలో లేకపోతే వేరే ఆసుపత్రిలో పెట్టి రోగులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా..? ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకోలేదా..? ఇదేనా ఈటెల గాంధీ గురించి చెప్పిన ఘనత..? ఇందుకేనా ఒట్లేసి మిమ్మల్ని ఎన్నుకుంది..? రాష్ట్రంలో ప్రజలు కన్నకష్టాలు పడుతుంటే కేసీఆర్ ఫామ్ హౌజ్ లో ఉండటం ఎంతవరకు న్యాయం..? రాష్ట్రం లో లాక్ డౌన్ పెట్టకుండా రవాణా గురించి చూసుకుంటున్నారు మీకు ప్రజలు ముఖ్యం కాదా..? మీరేమో భయపడి ఫామ్ హౌజ్ లకి వెలిపోతున్నారు మరి ప్రజలను కరోనా పుట్టలో ఎందుకు పారేస్తున్నారు..? మీకు కరోనా శోకాకుండా ఫామ్ హౌజ్ లకు వెళతారు కానీ ప్రజలకి మీలాగా ఫామ్ హౌజులు లేవు వారిని లాక్ డౌన్ లో పెట్టి పరిస్థితి సద్దుమనిగాకే బయటకు వదలండి. మీరు సురక్షితంగా ఉందని ప్రజలను సురక్షితంగా ఉంచండి.

మరింత సమాచారం తెలుసుకోండి: