సంస్క‌ర‌ణ‌లు... ఈ దేశంలో 1985 త‌ర్వాత నుంచి వినిపించిన, ఇప్ప‌టికీ వినిపిస్తున్న మాట‌. అప్ప‌ట్లో దేశా న్ని ముందుకు న‌డిపించ‌డం కోసం.. ప్ర‌పంచ దేశాల‌తో పోటీ త‌త్వం పెంచుకునేందుకు, ఆర్థికంగా దేశా న్ని పురోభివృద్ధిలో న‌డిపించుకునేందుకు తెర‌మీద‌కు తీసుకువ‌చ్చిన మంత్ర వ్యూహంలో ప్ర‌ధానన సూ త్రం సంస్క‌ర‌ణ‌. ఇవి ఆర్థిక రంగంలో కావొచ్చు.. సేవా రంగంలో కావొచ్చు.. ప్ర‌జ‌ల‌కు అంతిమంగా ప్ర‌యో జ‌నం చేసేవి అయి ఉండాల‌నేదే సంస్క‌ర‌ణ‌ల అంతఃసూత్రం! అందుకే.. పీవీ న‌ర‌సింహారావు హ‌యాంలో ఈ సంస్క‌ర‌ణ‌ల విష‌యంలో దూకుడు పెంచారు. నిజానికి చెప్పాలంటే.. అంత‌కు ముందు రాజీవ్ గాంధీ హ‌యంలోనే సంస్క‌ర‌ణ‌ల‌కు భార‌త్ ప్ర‌పంచ దేశాల‌తో ఒప్పందాలు చేసుకుంది. 


అయితే, త‌ర్వాత ప్ర‌భుత్వాలు మార‌డంతో సంస్క‌ర‌ణల దిశ‌గా అడుగులు వేస్తే.. ఏం జ‌రుగుతుందోన‌నే భ ‌యం వెంటాడింది. పీవీ అధికారంలోకి వ‌చ్చాక‌.. త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డిన‌ప్పుడు సంస్క‌ర‌ణల ద్వారా పొంచి ఉన్న‌ ప్ర‌మాదాన్ని త‌ప్పించుకుంటూనే వీటిని రెడ్ కార్పెట్‌పై న‌డిపంచారు. అయితే, ఈ సంస్క‌ర ‌ణ‌లు ఇప్పుడు.. అంధుడి చేతిలో లాంత‌రు మాదిరిగా మారిపోయాయ‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం. ప్రజ ‌లు చేయా ల్సిన మేలు ఈ సంస్క‌ర‌ణ‌ల కార‌ణంగా.. ప్ర‌భుత్వాల‌కు వ‌ర్తించేలా.. ప్ర‌జ‌ల‌కు పూచీ ప‌డాల్సిన బాధ్య‌త‌ల నుంచి ప్ర‌భుత్వాలు త‌ప్పుకొనేలా చేస్తున్నాయ‌నేది ప్ర‌ధాన వాద‌న‌. ప్ర‌జ‌ల‌కు అందే సేవ‌ల్లో పూచీ ప‌డాల్సిన ప్ర‌భుత్వాలు.. సంస్క‌ర‌ణ‌ల పేరుతో వాటి నుంచి త‌ప్పించుకుంటున్నాయి. 


ప్ర‌జ‌ల ప్రాణాల‌ను, ఆస్తుల‌ను, హ‌క్కుల‌ను కూడా సంస్క‌ర‌ణ‌ల దిశ‌గా న‌డిపించే ప్ర‌మాద‌క‌ర విన్యాసం ది శ‌గా కేంద్రంలోని న‌రేంద్ర‌ మోడీ ప్ర‌భుత్వం వ‌డివ‌డిగా వేస్తున్న అడుగులు దేశ‌వ్యాప్త ప్ర‌జానీకాన్ని తీవ్ర ఆందోళ‌న‌లోకి నెట్టేస్తోంది. దుర‌దృష్ట‌వ‌శాత్తు.. మోడీ చేస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై జాతీయ మీడి యా కానీ, ప్రాంతీయ మీడియా కానీ.. ప్ర‌చురించే, ప్ర‌సారం చేసే ధైర్యాన్ని కోల్పోయాయ‌నేది మ‌రో కీల‌క `సంస్క‌ర‌ణ‌`!!  లేక‌పోతే.. నిన్న‌టికి నిన్న దేశం మొత్తం స్తంభించింది. కేంద్రం తీసుకువ‌చ్చిన రైల్వే సంస్క‌ర‌ణ‌ల‌పై అనేక రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు ఆందోళ‌న‌లు నిర్వ‌హించారు. కానీ, ఈ విష‌యం చాలా మంది పౌరుల‌కు తెలియ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. 


ఇక‌, మోడీ తీసుకువ‌చ్చిన తాజా సంస్క‌ర‌ణ‌ల ఫ‌లితంగా.. దేశ ప్ర‌జ‌ల ప్రాణాల‌కే ముప్పు పొంచి ఉంద‌నేది ఒక వాద‌న అయితే.. కొన్ని ల‌క్ష‌ల మంది ఉద్యోగుల ఉద్యోగ భ‌ద్ర‌త గాలిలో దీపంగా మార‌నుంద‌నేది మ‌రో కీల‌క వాద‌న‌. దేశంలోని రైల్వే నెట్‌వర్కును మొత్తం 12 క్లస్టర్లుగా విభజించారు. వీటిలోని 109 మార్గాల్లో 218 ప్రైవేటు రైళ్లను నడిపించాలనే సంస్క‌ర‌ణ‌ల‌కు మోడీ స‌ర్కారు ప‌చ్చ‌జెండా ఊపింది.  మొదటి దశలో భాగంగా దేశవ్యాప్తంగా 109 మార్గాల్లో రైళ్ళను నడిపేందుకు ప్రైవేటు సంస్థలను ఆహ్వానిస్తూ భారతీయ రై ల్వే ‘ఆర్‌ఎఫ్‌క్యూ(రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్’ను ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టు కింద ప్రైవేటు రంగం నుం చి రైల్వేలోకి రూ.30 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి. 

అంతేకాదు, ఈ ప్రయత్నంతో రైల్వేలో కొత్త టెక్నాలజీ తీసుకురావడం, మరమ్మతుల ఖర్చు, ప్రయాణ సమయాన్ని తగ్గించడం వంటి సాధ్య‌మ‌వుతాయ‌ని కేంద్రం చాటుకుంటోంది. కానీ, ప్ర‌స్తుతం అత్యంత ప‌క‌డ్బందీగా ఉన్న భార‌తీయ రైల్వే వ్య‌వ‌స్థ‌లోకి ప్రైవేటుకు చోటు క‌ల్పించ‌డం వ‌ల్ల ఉద్యోగ భ‌ద్ర‌త‌, ప్ర‌జ‌ల ప్రాణాల‌కు భ‌ద్ర‌త అనే కీల‌క అంశాల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే అభిప్రాయాలు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల‌తో రైల్వేలోని ఆహార స‌ర‌ఫ‌రా విభాగం నిండిపోయింది. అదేస‌మ‌యంలో రేపో మాపో.. టికెట్లు, రిజ‌ర్వేష‌న్ వంటివి కూడా ప్రైవేటుకు ధారాద‌త్తం చేయ‌నున్నారు. ఇక‌, ఇప్పుడు ఏకంగా రైళ్ల‌నే ప్రైవేటుకు ఇచ్చేస్తున్నారు. దీనివ‌ల్ల సంస్క‌ర‌ణ‌ల ఆశించిన లేదా ప్ర‌తిపాదిత ఫ‌లితం ద‌క్కేనా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. కేవ‌లం ప్ర‌భుత్వం త‌న బాధ్య‌త నుంచి త‌ప్పుకొనేందుకు వేస్తున్న అడుగులే త‌ప్ప‌. దీనిలో మ‌రో కోణం ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. అందుకే సంస్క‌ర‌ణ‌ల గుడిలో మోడీ క్షుద్ర‌పూజ‌లు చేస్తున్నార‌నే వ్యాఖ్య‌లు స‌ర్వ‌త్రా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: