కరోనా మహమ్మారి ప్రాంపంచాన్ని కారు చీకటిలోకి నెట్టేస్తుంది ఇప్పటికే కోట్ల కేసులు లక్షల మరణాలు నమోదయ్యాయి..! ఈ మహమ్మారికి హద్దు అదుపు లేకుండా పోయింది. ప్రశాంతంగా ఎవ్వరూ నిదుర పోవడం లేదు. ఉద్యోగాలు లేక కడుపు నింపుకోవడం కష్టంగా మారి ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. ఆర్థిక సంక్షోభం ఏర్పడుతూ ప్రభుత్వాలు ప్రజలను ఆదుకోవడంలో ఇబ్బందులు పడుతున్నాయి. ఈ కరోనా మహమ్మారిని శాస్త్రవేత్తలు త్వరగా అంతం చేయాలని కోట్ల మంది ప్రజలు ఆశపడుతున్నారు, ఆకాక్షిస్తున్నారు, కనులారా ఎదురుచూస్తున్నారు. కానీ వారందరికీ ఒక చేదు వార్త...!

 

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్  రావాలంటే 2021 వరకు వెయిట్ చేయాల్సిందే అని చెబుతున్నారు భారత ప్రముఖ శాస్త్రవేత్తలు. ఇప్పటి వరకు కేవలం జంతువులపైనే ట్రయల్స్ అయ్యాయి ఇక ఆ వ్యాక్సిన్ లు మనుషులపై ట్రయల్స్ జరిపి వాటిలో కూడా విజయం సాధించి మార్కెట్ లోకి అందుబాటులోకి రావాలంటే ఖచ్చితంగా 6 నెలల నుండి 9 నెలలు సమయం పడుతుంది. ఇక అప్పటి వరకు ఇంకెన్ని కేసులు అవుతాయో ఇంకెందరు మరణిస్తారో ఎవ్వరికీ తెలియదు ఎవ్వరూ అంచనా వేయలేరు.

 

మరోపక్క కరోనా ను ఎదుర్కోవడంలో భారత దేశం చాలా ఇబ్బంది పడుతుంది. ఎన్ని చర్యలు చేపడుతున్నా ఎన్ని విదాలుగా కష్టపడుతున్నా భారత్ లో మాత్రం కేసులు తగ్గడం లేదు. పైగా కేసుల సంఖ్య దినదినాభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే 6.9 లక్షల కేసులు నమోదయ్యాయి 20 వేల దగ్గరలో మరణాల సంఖ్య ఉంది. దీంతో భారత్ ప్రపంచ టాప్ కరోనా దేశాల లిస్టులో 3 వ స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు 4 వ స్థానలో ఉన్న భారత్ ఇప్పుడు మూడవ స్థానంలోని 6.8 లక్షల కేసులతో ఉన్న రష్యాను వెనక్కి నెట్టి 6.9 లక్షల కేసులతో ముందుకు దూసుకుపోతుంది.

 

భారత్ కు 5 వ స్థానం వరకు చేరుకోడానికి చాలా రోజులు పట్టినా 5 నుండి 3 వ స్థానం వరకు చేరుకోడానికి చాలా తక్కువ రోజులు పట్టింది. ఇక రెండవ స్థానం లో బ్రెజిల్ 14 లక్షల కేసులతో ఉండగా అగ్రరాజ్యం అమెరికా 28 లక్షల కేసులతో 1 వ స్థానం లో ఉంది. భారత్ లో 135 కోట్లకు పైగా జనాభా ఉంది ఎవ్వరూ సరైన చర్యలు నియమాలు పాటించకుండా ఉంటున్నారు, పైగా వ్యాక్సిన్ రావడానికి కూడా మరో 8, 9 నెలలు పట్టోచ్చు దాంతో ఆ 8 నెలల్లో కరోనా ను భారత్ ఎలా ఎదుర్కుంటుందో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. 8 నెలలు పరిస్థితి ఇలాగే ఉంటే 28 లక్షలు కాదు 50 లక్షల కేసుల వరకు వెళ్ళిపోయినా ఎవ్వరూ ఆశ్చర్యపోనక్కర్లేదు అని చెబుతున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: