ఇతను ఓ కరుడుగట్టిన క్రిమినల్ ముఠా అధినేత, 60 కి పైగా కేసులు ఉన్న ఓ రౌడీ షీటర్, పోలీస్ స్టేషన్ లోనే మంత్రిని హత్యచేసిన హంతకుడు, నిరుపేదల భూములు ఆక్రమించిన ఖబ్జాదారు ఇలా చెప్పుకుంటూ పోతే ఇతనిలో చాలా యాంగిల్స్ ఉన్నాయి అతనే గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే...! వికాస్ దూబేకు చిన్ననాటి నుండే రాక్షపు ఆలోచనలు ఉండేవి అప్పటినుండే గ్యాంగులు నడపడం  ఇతని అలవాటు. నచ్చిన పనే చేస్తాడు, ఎవరైనా అడ్డొస్తే వారిని అడ్డు తొలగించడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య...!

 

వికాస్ ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన కాన్పూర్ జిల్లాకు బిక్రూ గ్రామానికి చెందిన వాడు. వికాస్ చిన్న వయసు నుండే గ్యాంగులు నడిపేవాడు ఇతని పై మొట్టమొదటిసారిగా 1990 లో ఇతనిపై మర్డర్ కేసు నమోదయ్యైంది ఇక అప్పటినుండి 2020 జులై వరకు నమోదవుతూనే ఉన్నాయి అలా ఇప్పటివరకు 60 కి పైగా కేసులు నమోదయ్యాయి ఆశ్చర్యం ఏంటంటే అన్నీ కేసులు నమోదయినా ఇప్పటివరకు అతనిపై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ షీట్ నమోదు అవ్వలేదు.

 

1990 లో ఇతనిపై మర్డర్ కేసు నమోదవడంతో జైలు పాలయ్యాడు. ఇక అనంతరం బెయిల్ పై తిరిగి వచ్చిన తరువాతా లోకల్ గుండాగా ఎదిగాడు అప్పుడే హరికిషన్ శ్రీవాస్తవ అనే బీజేపీ లీడర్ కన్ను ఇతని పై పడింది. హరికిషన్ ఇతనిని చేరదీసి తన నేర కలపాలు వికాస్ తో చేయించేవాడు. ఎవరినైనా బెదిరించాలన్నా భయపడేలా చేయాలన్నా వికాస్ ను పురుమాయించేవాడు. అలా వికాస్ తన సొంతంగా దాదాగిరీ చేయడం ప్రారంభించాడు భూ ఖబ్జాలు భూ దండాలు నడిపేవాడు. ఎవరైనా అడ్డొస్తే వారు వికాస్ చేతిలో మరణించాల్సిందే. ఇక ఆదేక్రమంలో ఇతనికి లోకల్ పోలీసులతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి వారితో తన సావాసం అలా కంటిన్యూ అవుతూనే వచ్చింది.

 

ఆపై 2001 లో తన గాడ్ ఫాదర్ బహుజన సమాజ్ వాడి పార్టీకి వెళ్ళాడు వికాస్ కూడా తన అడుగుజాడల్లోనే నడిచాడు. ఇద్దరు పార్టీ మారడంతో బీజేపీ వారితో గొడవలు వచ్చేవి. కానీ వికాస్ స్వభావం ఏంటి... అడ్డొస్తే అడ్డు తొలగించడం..! ఈ క్రమంలో ప్రస్తుత కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ అప్పట్లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి.. ఆయన హయాం లో మంత్రిగా ఉన్న సంతోష్ శుక్లాను నిర్దాక్షన్యంగా పోలీస్ స్టేషన్ లోనే పిస్టల్ తో కాల్సి చంపాడు వికాస్ దానితో ఇతని దశ తిరిగింది. అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళాడు కానీ మన చట్టాల్లో బెయిల్ దొరకడం చాలా సులువు అనే విషయం తెలిసిందే. అలా బెయిల్ పై వచ్చిన వికాస్ చూపు మొత్తం ఉత్తర్ ప్రదేశ్ పైనే పడింది.

 

2000 వేల సంవత్సరంలో ఓ అస్సిస్టెంట్ ఇంజనీర్ ను చంపిన కేసులో వికాస్ ముద్దాయి. ఇందులో ఆశ్చర్యకరం ఏంటంటే వికాస్ అదే సమయంలో రామ్ బాబు యాదవ్ అనే వ్యక్తిని చంపిన కేసులో నిందితుడిగా జైల్ లో ఉన్నాడు. జైల్లో ఉండే వికాస్ మరో మర్డర్ కు ప్లాన్ చేసి జైల్లో ఉండే బయట మర్డర్ చేయించాడు ఇలాంటి ఘటనే మరొకటి ఉంది తన బంధువును దాడి చేసిన కేసులో వికాస్ జైల్లో ఉన్నాడు అదే సమయంలో జైల్లోనే ఉంటూ కాన్పూర్ లో దినేష్ దూబే అనే వ్యైక్తిని హత్య చేయించాడు. ఈయనకు పోలీసులతో ఉన్న సంబంధాలు అలాంటివి అని చెప్పడానికి ఈ కేసులే నిదర్శనం. మొత్తం ఉత్తర్ ప్రదేశ్ పైనే కన్నేసిన వికాస్ అనుక్షణం తన మనసులో క్రైమ్ గురించే ఆలోచించేవాడు ఎదగాలి అనే కఓరిక తప్ప బాగుపడాలి అనే ఆలోచనే ఉండేది కాదు.

 

2006 లో వికాస్ ప్రభుత్వం ప్రభుత్వ వాహనాన్ని వేలం వేస్తుండగా ఒక అంబాసిడర్ కార్ కొన్నాడు ఆ కారు ప్రభుత్వ వాహనం ఆర్ సీ లో ప్రభుత్వం పేరే ఉంటుంది. ఆ కారును వికాస్ అద్భుతంగా ఉపయోగించేవాడు. ప్రభుత్వ వాహనం కాబట్టి ఆ కారును ఎవ్వరూ ఆపేవారు కాదు. దాంతో ఆయన నేరాలు చేసిన పట్టణం లో దర్జాగా తిరిగేవాడు దాదాపుగా ఆయన నేర కలాపాల ప్రతీ దానిలో ఆ కార్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండేది. కధనాల ప్రకారం వికాస్ కు పోలిటికల్ గా కూడా మంచి గ్రిప్ ఉండేది. తాజాగా అతను నగర పంచాయితీ ఎన్నికల్లో నిలబడి గెలిచినట్టు తెలుస్తుంది. అలా పెద్ద క్రిమినల్ గా ఎదుగుతూ వచ్చిన వికాస్ పై 2020 కల్లా నాటికి 60 కేసులు ఉన్నాయి.

 

ఇది గమనించిన్ డీఎస్పీ వికాస్ ను ఎలాగైనా అరెస్ట్ చేయాలి అనే భావనతో ఒక 16 మంది టీమ్ తో వికాస్ ఆచూకీ తెలుసుకొని అతనిపై అటాక్ కు వెళ్ళాడు. కానీ వికాస్ కు పోలీసులతో మంచి సంబంధాలు ఉండటంతో ఆయనకు ముందుగానే ఆ విషయం తెలిసిపోయింది. సరిగ్గా 30 నిమిషాల ముందు ఆయనకి ఈ విషయం తెలిసింది, ఆ ముప్పై నిమిషాల్లో అతని గ్యాంగ్ కు చెందిన 60 మందికి ఫోన్ లు చేయగా అందరూ 25 నిమిషాల్లో వికాస్ వద్దకు చేరిపోయారు. వికాస్ ఇంట్లో అండర్ గ్రౌండ్ బంకర్ ఉంటుంది అందులో ఏకే 47 ఇన్సాస్ వంటి మిషన్ గన్ లు 50 నుండి 60 చిన్న పిస్టల్స్ ఉంటాయి వాటితో పాటు పేలుడు పదార్థాలు ఉంటాయి.

 

పోలీసులను అడ్డగించేందుకు వికాస్ తన సమీపంలో 5 6 జేసీబీ లను సిద్ధం చేయించి రోడ్డు బ్లాక్ చేయించాడు. పోలీసులు అక్కడికి వచ్చి జేసీబీ లను అడ్డు తొలగిస్తున్న సమయాన్నే అనువుగా చేసుకొని వారిపై ఒక్కసారిగా ఫైరింగ్ ప్రారంభించారు. దాదాపుగా 300 బులెట్లు ఫైర్ చేశారు. వికాస్ ముఠా పక్కనే ఉన్న భవన్తి పై నుండి కాల్పులు చేయడంతో ఆ డీఎస్పీ ఎస్సై తో సహా 8 మంది పోలీసులు ప్రాణాలు విడిచారు. అనంతరం డీఎస్పీ కాళ్ళు గొడ్డలితో నరికి కాళి వేళ్ళు కత్తిరించి అరాచకం సృష్టించారు. అనంతరం అక్కడ నుండి పరార్ అయ్యారు. ఇప్పుడు వీరి కోసం 25 యూనిట్ ల పోలీసు విభాగాలు గాలింపు చేస్తున్నాయి. వీరి ఆచూకీ తెలిపిన వారికి 2.5 లక్షలు భౌకరామ్ కూడా చేస్తాం అని ప్రభుత్వం ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: