భార‌త్ నుంచి డ్రాగ‌న్ సంస్థ‌ల‌ను త‌రిమి వేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఆంక్ష‌లు విధిస్తున్న నేప‌థ్యంలో చైనా మాత్రం పెట్టుబ‌డుల రూపంలో భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గుప్పిట ప‌ట్టేందుకు య‌త్నాలు పెట్టింది. అక్క‌డి పెట్టుబ‌డుదార‌ల చే ఏకంగా షేర్ల‌ను కొనుగోలు చేయించేందుకు కుయుక్తులు మొద‌లుపెట్టడం గ‌మ‌నార్హం. కరోనా లాక్‌డౌన్‌తో షేర్‌ మార్కెట్లు ఢమాల్‌ అయిన కాలాన్ని తనకు అనుకూలంగా మలచుకుం ది. విడతల వారీగా వందలు, వేల కోట్ల పెట్టుబడులతో బడా కంపెనీల షేర్లు కొనుగోలు చేసి, వాటిని గుప్పిట పెట్టుకునేందుకు ప్రయత్నించింది. కొన్ని కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేసింది. ఈ పన్నాగాన్ని గుర్తించిన భారత సర్కారు వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టి.. డ్రాగన్‌ ఆటను కట్టించింది.


అయితే అప్ప‌టికే  బడా బ్యాంకులు, దిగ్గజ కంపెనీలను టార్గెట్‌గా చేసుకుని పెట్టుబ‌డుల‌ను కుమ్మ‌రించింది. ఎంతలా అంటే.. కొన్ని కంపెనీల్లో వందల కోట్లు పెట్టి 1శాతం వరకు షేర్లను హస్తగతం చేసుకుంది. ఒక ప్ర‌ముఖ బ్యాంకులో ఏకంగా రూ.3,100 కోట్ల పెట్టుబడులు పెట్ట‌డం ఇందుకు నిద‌ర్శ‌నం. అలాగే ఓ సిమెంట్ కంపెనీలో రూ.122 కోట్లతో కొన్ని వేల షేర్ల‌ను కొనుగోలు చేయ‌డం గ‌మ‌నార్హం. అలా క్రమంగా పెట్టుబడులు పెడుతూ.. ఆయా కంపెనీల్లో ప్రధాన షేర్‌ హోల్డర్‌ అవ్వాలన్న‌దే డ్రాగ‌న్ ప్ర‌ధాన ఎత్తుగ‌డ. వాస్త‌వానికి క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ భార‌త్‌లో మొద‌లైన తొలినాళ్ల‌లోనే ఈవిష‌యాన్ని భార‌త ప్ర‌భుత్వం ప‌సిగ‌ట్టింది. అందుకు సంబంధించిన కొన్ని కీల‌క ఆధారాలు కూడా చిక్క‌డంతో వెంట‌నే అల‌ర్టైంది. 


ఆగమేఘాల మీద విదేశీ పెట్టుబడుల విధానాన్ని సవరించింది. భారత్‌తో సరిహద్దు పంచుకుంటున్న దేశాలు ఇక్కడి మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలంటే కేంద్రం అనుమతి కావాలని ప్రకటించి.. డ్రాగన్‌ కుట్రను అడ్డుకుంది.  కొన్ని ముఖ్య‌మైన రంగాల్లో కూడా భార‌త ప్ర‌భుత్వం అనుమ‌తి లేకుండా విదేశీ పెట్టుబ‌డుదారుల‌కు, సంస్థ‌ల‌కు షేర్ల కొనుగోలుకు అనుమ‌తిని నిరాక‌రిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. చైనా అనుకున్న‌ది ఒక‌ట‌యితే వాస్త‌వంలో మ‌రోటి జ‌రగ‌డంతో చైనా షాక్ తింది. ప్ర‌పంచాన్ని త‌న వైపు రానియ్య‌కుండా..ప్ర‌పంచ మీద ప‌డాల‌న్న‌దే డ్రాగ‌న్ సూత్రం. కానీ ఎన్నో రోజులు ఈ దుర్బుద్ది నీతి సాగ‌వు అన్న విష‌యం చైనా తెలుసుకోవాలి. చైనా ఇప్పుడు ప్ర‌తీ దేశం నుంచి ఛీత్కారాల‌ను ఎదుర్కొంటోంది. సాధించిన ప్ర‌గ‌తి ఎన్నాళ్లో ఉండ‌దు.. ఆవిష‌యం చాలా త‌క్కువ స‌మ‌యంలోనే చైనా తెలుసుకుంటుంద‌ని ఆశిద్దాం..!

మరింత సమాచారం తెలుసుకోండి: