విలువలు, విశ్వసనీయత అంటూ చెప్పడమే కాదు, చెప్పిన మాటలకు, ఇచ్చిన హామీలకు కట్టుబడి, ఎవరినీ నొప్పించకుండా పరిపాలన చేయాలి అంటే అది ఆషామాషీ వ్యవహారం కాదు. అలా చేయడం అందరి వల్లా కానీ పని. కానీ దివంగత రాజశేఖరరెడ్డి విషయంలో మాత్రం అది అమలు జరిగింది. అసలు సిసలైన జనరంజక పాలన ఎలా ఉంటుందో, ఆయన తన పాలనలో చేసి చూపించారు. కానీ అకస్మాత్తుగా ఆయన హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడం రాష్ట్రానికి తీరని లోటు. ఆయనే ఉంటే బడుగు జీవుల బతుకులు ఇంతకంటే మెరుగ్గా ఉండేవేమో అన్న ప్రశ్నలు కూడా ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. దివంగత రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని జనాలంతా ఆయన పాలనను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.

IHG

 

రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఇబ్బందులు పడకూడదనే తలంపుతో, నిరుపేదలను దృష్టిలో పెట్టుకుని ఎన్నో సంక్షేమ పథకాలను రాజశేఖరరెడ్డి అమలుచేసి చూపించారు. ముఖ్యంగా ఉచిత విద్యుత్ ఇస్తామంటూ రాజశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలో చెప్పినప్పుడు, ఆయన రాజకీయ ప్రత్యర్థులు అపహాస్యం చేశారు. కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి అంటూ ఎద్దేవా చేశారు. కానీ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన ఉచిత విద్యుత్ ను రైతులకు అందించారు. అలాగే పంటల సబ్సిడీలు రుణాలు వంటివి ఎన్నో చేసి చూపించి రైతు బాంధవుడిగా పేరు సంపాదించుకున్నారు. రాజశేఖర రెడ్డి పరిపాలన స్వర్ణయుగంగా అప్పట్లో పిలుచుకునేవారు.

IHG

మొదటిసారి రాజశేఖరరెడ్డి తన పాలనలో స్వర్ణయుగం అంటే  ఎలా ఉంటుందో చూపించడంతో, రెండోసారి ఆయనకు జనాలు పట్టం కట్టారు. ముఖ్యంగా ఆయన హయాంలో తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ, 108 ,ఫీజు రియంబర్స్మెంట్, సాగునీటి ప్రాజెక్టులు , ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్న పోలవరం ప్రాజెక్టు సైతం రాజశేఖరరెడ్డి హయాంలోనే పురుడు పోసుకున్నాయి. ఆ విధంగా రాజశేఖర్ రెడ్డి జనాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. కానీ అకస్మాత్తుగా ఆయన మరణించిన తర్వాత అధికారంలోకి వచ్చిన వారు ఎవరూ ఆయన స్థాయిలో పరిపాలన చేయలేకపోయారు. ఇక ఇప్పుడు ఆయన వారసుడిగా ప్రత్యేకంగా పార్టీని పెట్టి పైకి వచ్చిన జగన్ రాజశేఖర్ రెడ్డి ని మరిపించేలా పరిపాలన చేస్తూ, ఆయనను మరోసారి గుర్తు చేస్తున్నారు.

 

వైసిపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పేద, మధ్యతరగతి ప్రజలే టార్గెట్ గా, వారికి ఎటువంటి కష్టాలు రాకుండా చూసుకుంటూ, ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి చూపిస్తూ, రాజశేఖర్ రెడ్డి కి మించిన వాడిగా పేరుప్రఖ్యాతులు జగన్ సంపాదించుకున్నారు. తండ్రి ఆశయాలను నెరవేరుస్తూ తనయుడుగా జగన్ నూటికి నూరు మార్కులు వేయించుకుంటున్నారు. జనరంజక పాలన అందిస్తూ, జనాల గుండెల్లో చెరగని ముద్ర వేయించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: