విలువలు, విశ్వసనీయత, నమ్మకం వంటివి రాజకీయాల్లో సక్సెస్ అవ్వాలనుకునేవారికి ఇది తప్పనిసరిగా ఉండాలి. ప్రజల్లోనూ, పార్టీ నాయకుల్లోనూ, భరోసా కల్పించే విధంగా పార్టీ అధినేత లేకపోతే, ఆ తర్వాత పూర్తిగా రాజకీయ శున్యం కనిపించడం తప్ప మరో అవకాశం ఉండదు. అదే పరిస్థితి తలెత్తితే అధికారం చేజిక్కించుకోవడం అనేది కలగానే మిగిలిపోతుంది తప్ప, వాస్తవ రూపం దాల్చాదు. ఇక ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వారు సొంతంగా పార్టీ పెట్టిన వారు పూర్తి సమయం కేటాయించాలి తప్ప, అప్పుడప్పుడు రాజకీయాలు అన్నట్టుగా వ్యవహరిస్తే తిప్పలు తప్పవు. ఇటువంటి తప్పులు వరుసగా చేసుకుంటూనే వస్తూ, రాజకీయంగా అనుమానాస్పద వ్యక్తి గా ముద్ర వేసుకుంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

 

IHG

 

ప్రజల్లోనే కాదు, సొంత పార్టీ నేతల్లోనూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై విమర్శలు పెరిగిపోతున్నాయి . దీనికి కారణం ఆయన వ్యవహరిస్తున్న తీరు. పార్టీ స్థాపించి అప్పుడే ఏడు సంవత్సరాలు దాటుతున్నా, క్షేత్రస్థాయిలో జనసేన ను బలోపేతం చేసే విషయంలో పవన్ వెనుకబడి పోయారు. సొంతంగా అధికారంలోకి వస్తామని పవన్ ప్రయత్నించినా, అప్పట్లో అది సాధ్యమయ్యేది కాదు. గత ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓటమి చెందడంతో జనసేనకు ఎదిగేందుకు చాలా సమయం పట్టేలా కనిపిస్తుంది. 2024 ఎన్నికల నాటికి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అదే ఆలోచనతో రాజకీయంగా ముందడుగు వేస్తున్న బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకున్నారు పవన్. పోనీ ఆ పని అయినా, సక్రమంగా పూర్తి చేస్తున్నారా అంటే, జనసేన తో తమకేమీ సంబంధం లేదన్నట్లుగా బిజెపి నాయకులు వ్యవహరిస్తుండగా, బిజెపి నాయకులను క్షేత్రస్థాయిలో కలుపుకుని వెళ్లేందుకు జనసైనికులు ఇష్టపడటం లేదు.

IHG't | OK Telugu

దీనికి కారణం అసలు ఏపీలో బీజేపీకి బలమే లేదని, కానీ జనసేన కు బలమైన కార్యకర్తలు, అభిమానులు, ఉన్నారని బీజేపీ ఆ చరిష్మా తో ఎదిగేందుకు ప్రయత్నిస్తోందని,  జనసైనికులు చెబుతున్న మాట. ఇలా రెండు పార్టీల కార్యకర్తల మధ్యనే కాకుండా, కేంద్ర బిజెపి నాయకులు, ఏపీ బీజేపీ నాయకులు, పవన్ కళ్యాణ్ మధ్య కూడా ఇదే రకమైన అభిప్రాయం ఉంది. కానీ జనసేన సొంతంగా ఏపీలో ఎదిగే అవకాశం లేకపోవడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు. జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్న తర్వాత ఈ రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా ప్రజా ఉద్యమాలు ఒకటి, రెండు మినహా మిగతా ఏ విషయాలలోనూ కలిసికట్టుగా ఉద్యమాలు చేయలేదు. ఎవరు విధానం వారిదే అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఇక పార్టీల తరఫున ఏదైనా విషయంపై స్పందించాల్సి వచ్చినా, జనసేన ఒకరకంగా, బిజెపి మరొక రకంగా స్పందిస్తూ, పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ వస్తున్నాయి.

IHG

పవన్ బలమైన కాపు సామాజిక వర్గ అండదండలు, అభిమానులు అండ ఉండడంతో బీజేపీ ఏపీలో బలపడాలని చూస్తుండగా, జనసేన బిజెపి వ్యూహాలు, ఆర్థిక అండదండలతో ఏపీలో అధికారం చేజిక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు పార్టీల్లో పరిస్థితి ఈ విధంగా ఉండటంతో, ఉమ్మడిగా కార్యక్రమాలు చేపట్టడం, కలిసికట్టుగా ఎన్నికలకు వెళ్లడం, ఏపీలో బలపడడం, ఇవన్నీ కష్టతరమైన కార్యక్రమాలు గానే కనిపిస్తున్నాయి. జనసేన బిజెపి క్షేత్రస్థాయిలో బలపడలేకపోవడం, బలమైన తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలను ఎదుర్కోవడం పెద్ద ఇబ్బంది. అదీ కాకుండా జనసేనను పెద్దగా పట్టించుకోనట్లు వ్యవహరిస్తున్న బీజేపీ పై ఆశలు పెట్టుకుని పవన్ ముందడుగులు వేయడం, ఫైనల్ గా జనసేన తీవ్రంగా నష్టపోయే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: