హైదరాబాద్ మహానగరం ఎన్నో సంస్కృతులు, సాంప్రదాయాలకు నిలయం. ఎన్నో రాష్ట్రాల వారు అంతా కలిసి మెలిసి జీవిస్తున్న ఒక మహా సామ్రాజ్యం. దేశంలోని అన్ని ప్రాంతాల వారు పూర్తిగా తమ సొంత ప్రాంతం అనుకునేలా హైదరాబాద్ నగరం అందరికీ అనుకూలంగా ఉంటూ వచ్చింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ మారుమూల పల్లె వాసులైనా, హైదరాబాద్ మహానగరంలో అడుగుపెడితే, ఏదో ఒక రకంగా బతికేయవచ్చు అనే ధీమా కనిపించేంది. నగరంలో ఎక్కడ చూసినా కిక్కిరిసిన జనం కనిపిస్తూ, హడావుడిగా కనిపించేందు. అసలు ఇంత జనాభా హైదరాబాదు మహా నగరంలో ఎలా ఉంటున్నారా అనే ఆశ్చర్యం కలిగించేలా ఈ అందమైన మహానగరం జనాలతో పెనవేసుకుపోయింది. అన్ని రంగాలు ఇక్కడ అభివృద్ధి బాటలో పయనించాయి. కానీ కరోనా పుణ్యమా అంటూ ఇప్పుడు మహానగరం చిన్నబోయింది.

IHG

జనాలు లేక వెలవెలబోతోంది. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో అధిక భాగం ఈ మహానగరంలోనే నమోదవుతుతుండడంతో నగర జీవుల్లో మరింత భయం పెరిగిపోతోంది. కరోనా పరీక్షలు తక్కువ స్థాయిలో జరుగుతున్నా, పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతుండడంతో, జనాలను మరింత కంగారుపెట్టిస్తోంది. లాక్ డౌన్ నిబంధనలు ఇప్పటికీ కొంతమేర అమలవుతుండడంతో జనాలు రోడ్ల పైకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో, వ్యాపార కార్యకలాపాలన్నీ, దాదాపుగా దెబ్బతిన్నాయి. చాలామంది ఉపాధి కోల్పోయారు. హైదరాబాద్ లో లాక్ డౌన్ విధించబోతున్నారు అనే సమాచారంతో జనాలంతా తమ సొంత ఊళ్లకు వెళితే ఏదో ఒక రకంగా బతుకు బండిని నడిపించు అనే అభిప్రాయంతో తిరుగు ప్రయాణం అవుతున్నారు. రోజువారీ ఖర్చులకు కూడా ఇబ్బంది ఏర్పడడంతో నగరం నుంచి తిరుగుబాట పట్టి తమ సొంత ప్రాంతాలకు వచ్చేస్తున్నారు.

IHG

 

ఇక ఐటి రంగం కూడా ఈ కరోనా వ్యవహారంతో చతికిలబడింది. ఐటీ రంగాన్నీ నమ్ముకుని సుమారు ఆరు లక్షల మంది వరకు ఈ మహానగరంలో ఉపాధి పొందుతున్నారు. కరోనా దెబ్బకు చాలామంది వర్క్ ఫ్రం హోం అంటూ ఇళ్లకే పరిమితం అయ్యారు. మొన్నటి వరకు వర్క్ ఫ్రొం హోమ్ అయినా నగరంలోనే అందుబాటులో ఉండాలంటూ ఐటీ కంపెనీలు షరతు విధించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నగరంలోనే వుండిపోయారు. కానీ హైదరాబాద్ లో ఆంక్షలు పెరిగిపోతుండటం, కరోనా కేసులు అధికంగా ఉండడంతో, ఇప్పుడు ఐటీ కంపెనీలు కూడా ఆ షరతులను సడలించాయి. దీంతో సొంత ఊళ్ళ నుంచే పనిచేసుకునే అవకాశం రావడంతో ఆగమేఘాల మీద తమ సొంత ప్రాంతాలకు జనాలు బయలుదేరుతున్నారు. దీంతో ఏపీ సరిహద్దులోని చెక్ పోస్ట్ ల వద్ద జనాల తాకిడి మరింత ఎక్కువైంది.

IHG

ఇక నగరంలోని చిన్న చితకా పనులు చేసుకుంటూ, బతుకుదామని ఎప్పుడో వలస వచ్చిన వారు కూడా ఇప్పుడు నగర జీవనం అస్పష్టంగా ఉండటం, ఉపాధి అవకాశాలు సన్నగిల్లడంతో వారు కూడా తమ సొంత ప్రాంతాలకు వలస బాట పడుతూ ఉండడంతో హైదరాబాద్ మహానగరం రోజురోజుకు ఖాళీ అవుతోంది. ఎక్కడ చూసినా టు లెట్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఈ పరిస్థితి నుంచి ఈ మహానగరం ఎప్పుడు కోరుకుంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న ఈ హైదరాబాద్ మహానగరం ఇప్పుడు జనాలు లేక వెలవెలబోతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: