ప్ర‌జ‌లు మారారు.. వ్య‌వ‌స్థ మారింది.. దీంతో రాష్ట్రంలో ప్ర‌భుత్వం మారింది. ఇది జ‌రిగి ఏడాది గ‌డిచింది. కానీ, ఈ ఏడాది కాలంలో మార‌నిద‌ల్లా.. ఓ వ‌ర్గం మీడియా. ఇంకా టీడీపీనే అధికారంలో ఉంద‌ని, సీఎంగా చంద్ర‌బాబు మాత్ర‌మే ఉన్నార‌ని క‌ల‌లు కంటూనే ఉంది. అందుకే.. నిత్యం ఏడుపుగొట్టు రాత‌ల‌తో ప్ర‌జ‌ల ‌కు పేప‌ర్లు అమ్ముకుంటోంది. చంద్ర‌బాబు హ‌యాంలో అలా చేశారు.. ఆయ‌న అలా వ్య‌వ‌హ‌రించారు.. అని మ‌ళ్లీ మ‌ళ్లీ.. పాడిందే పాట అన్న‌ట్టుగా రాసుకుంటూ వ‌స్తోంది. అంతేకాదు, బాబు పాల‌న‌లో రాష్ట్రం సుభి క్షంగా ఉంది. 

 

ఆయ‌నే ఉండి ఉంటే.. అంటూ ఇంకా ఊహాజ‌నిత క‌థ‌నాలు ప్ర‌చారం చేస్తూనే ఉంది. కానీ, వాస్త‌వం ఏంటి? చ‌ంద్ర‌బాబు హ‌యాంలో నిజంగానే కొన్ని వ‌ర్గాల‌కు మేలు జ‌రిగింది. ఈ విష‌యాన్ని ఒప్పుకుందాం. అన్ని సామాజిక వ‌ర్గాల‌కు కూడా ఆయ‌న కార్పొరేష‌న్లు ఏర్పాటు చేశారు. కోట్ల‌కు కోట్ల ప్ర‌జా ధ‌నాన్ని కేటాయించారు. వివిధ ప‌థ‌కాలు ప్ర‌వేశ పెట్టారు. అయితే, ఇవి ఎవ‌రి జేబుల్లోకి వెళ్లాయి?  ఎవ‌రికి ల‌బ్ధి చేకూర్చింది? అంటే... ఇక్క‌డే ఉంది.

 

అస‌లు మ‌త‌ల‌బు. ఆయా సామాజిక వ‌ర్గాల్లో టీడీపీకి అనుకూ లంగా ఉన్న‌వారి ల‌బ్ది చేకూర్చాయి. లేక‌పోతే.. ఇంకా కాపుల్లో పేద‌లు ఎందుకు ఉన్నారు? ఇంకా, ఎస్సీ, ఎస్టీ బీసీల్లో ఎందుకు పేద‌లుగానే ఉన్నారు. క‌నీసం గూడు కూడా లేకుండా ఉండిపోయారు ? ఇప్పుడు ఈ విష‌యాన్ని చ‌ర్చించుకుంటే.. బాబు ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాల తీరు ఎలా న‌డిచిందో అర్ధం అవు తుంది. చంద్ర‌బాబు ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాల‌ను ఊరూవాడా ప్ర‌చారం చేసిన బుర్ర‌క‌థ‌కుల‌కు, హ‌రిక‌థ‌కుల ‌కు క‌నీసం వారికి ఇస్తామ‌న్న పారితోషికం కూడా ఇవ్వ‌లేద‌ని నిన్న‌గాక మొన్న‌నే వాళ్లంతా వ‌చ్చి సీఎం జ‌గ ‌న్‌కు మొర‌పెట్టుకున్నారు. 

 

కాళ్లా వేళ్లాపడి ఆనాడు పేరుకుపోయిన పెండింగు బ‌కాయిల‌ను ద‌య‌త‌లిచి ఇవ్వాల‌ని కోరారు. మ‌రి బాబు గారి పాల‌న బాగుంటే ఇలా ఎందుకు జ‌రిగి ఉంటుంది?  అయినా.. బాబు గారి పాల‌న బాగుంటే.. ప్ర‌జ‌లు మాత్రం ఎందుకు ఛీ కొట్టేవారు? ఇప్పుడు జ‌గ‌న్ కూడా ఆయ‌న బాట‌లోనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డంలో ఏమైనా అర్ధం ఉందా? ఇంకా బుద్ధి మార‌క‌పోతే.. ఎలా సారూ!? అంటున్నారు సాధార‌ణ ప్ర‌జ‌లు.

మరింత సమాచారం తెలుసుకోండి: