రాష్ట్రంలోని ప్రతిపక్షాల వైఖరి చాలా  విచిత్రంగా ఉంటోంది.  జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకించటమే పనిగా పెట్టుకున్నాయి.  ఒకటి కాదు రెండు కాదు ప్రతిపక్షాలన్నింటిదీ ఇదే వరసగా కనబడుతోంది. ముందుగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపార్టీ మొదలుపెడుతుంది దాన్ని జనసేన, కాంగ్రెస్, సిపీఐ అందుకుంటాయి. కొన్నిసార్లు సీపీఎం కూడా అందుకుంటోంది లేండి. ఇక బీజేపీ వైఖరి కొన్నిసార్లు ఒకలాగ మరికొన్నిసార్లు ఇంకోలాగుంటోంది. ఏదేమైనా కాస్త ముందు వెనుకగా అధికారపార్టీ నిర్ణయాలను వ్యతిరేకించటమే ప్రధాన అజెండాగా పెట్టుకున్న విషయం అర్ధమైపోతోంది. ఇందుకు తాజాగా జరిగిన ఓ ఉదంతమే ఉదాహరణగా నిలుస్తోంది. రాజధాని అమరావతి కేంద్రంగా రాష్ట్రంలో పెరిగిపోతున్న వివాదాల గురించి అందరికీ తెలిసిందే.




 ఈ వివాదంపై ఇప్పటికే హైకోర్టులో సుమారు 144 కేసులు దాఖలయ్యాయి. ఇందులో అత్యధికం ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైతే కొన్ని మాత్రం అనుకూలంగా దాఖలయ్యాయి. ఏ కేసుకు ఆ కేసును పరిశీలించిన కోర్టు ఇందులో  మొదటగా 44 కేసులను ప్రాధాన్యత ప్రకారం విచారణకు తీసుకుంటున్నట్లు గతంలోనే ప్రకటించింది. పనిలో పనిగా రాజధాని అమరావతిపై తమ వైఖరి చెప్పేట్లయితే అఫిడవిట్లు దాఖలు చేయాలంటూ కోర్టు రాజకీయ పార్టీలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఎప్పుడైతే బంపర్ ఆఫర్ వచ్చిందో వెంటనే కాంగ్రెస్, జనసేనలు అమరావతినే రాజధానిగా కంటిన్యు చేయాలంటూ అఫిడవిట్లు దాఖలు చేసేశాయి. అఫిడవిట్లు దాఖలకు గడువేమీ లేదుకాబట్టి మిగిలిన బీజేపీ, వామపక్షాలు కూడా అఫిడవిట్లు దాఖలు చేస్తాయేమో చూడాలి. ప్రధాన పార్టీలైన జనసేన, కాంగ్రెస్ అమారవతికి అనుకూలంగా అఫిడవిట్లు దాఖలు చేయటంతో చంద్రబాబులో మంచి ఉత్సాహం వచ్చేసింది. అందుకనే రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపిచ్చేశారు.




చంద్రబాబు ఉద్దేశ్యం ఏమిటంటే తాను ఆందోళనలకు పిలుపివ్వగానే వెంటనే జనసేన, కాంగ్రెస్ నేతలు, శ్రేణులు రోడ్లపైకి వచ్చేస్తారని. అందుకనే రాజధాని ఉద్యమం 300 రోజుకు చేరుకున్న సందర్భంగా శని, ఆది, సోమవారాల్లో ఆందోళనలకు పిలుపిచ్చారు. అయితే ఫార్టీ ఇయర్స్ కు ఈ విషయంలో పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే తమ అధినేత పిలుపుకు టీడీపీలోని నేతలే పెద్దగా స్పందిచలేదు. సొంతపార్టీ నేతలే స్పందిచకపోతే ఇక మిగిలిన పార్టీలకు స్పందించాల్సిన అవసరం మాత్రం ఏముంటుంది ?  అందుకనే జనసేన, కాంగ్రెస్ పార్టీల నుండి కనీస స్పందన కూడా కనబడలేదు. కోర్టులో అఫిడవిట్ అంటే వేశాయి కానీ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయాలంటే వాటి బండారం బయటపడిపోదా.  ఎందుకంటే పై రెండు పార్టీలను పట్టించుకునే జనాలే కనబడటం లేదు. చెప్పుకోదగ్గ నేతలే లేరంటే ఇక కార్యకర్తలు ఎక్కడి నుండి వస్తారు. అందుకనే ఆందోళనల్లో ఎక్కడా కనబడలేదు.




టీడీపీకి మద్దతుగా అఫిడవిట్లు దాఖలు చేసిన పార్టీలను నమ్ముకుని ఆందోళనలకు పిలుపిచ్చిన చంద్రబాబుకు గ్రౌండ్ లెవల్లో నిజంగా షాక్ తగిలినట్లే అయ్యింది. జనసేనకు ఇబ్బంది ఏమంటే పార్టనర్ బీజేపీని కాదని సొంతంగా ఆందోళనలకు దిగలేందు. పైగా చంద్రబాబు కలవాలంటే మరీ ఇబ్బంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కు కూడా సేమ్ టు సేమ్ సమస్య. మొన్నటి ఎన్నికల్లో తమతో కలిసుండి తర్వాత మళ్ళ మోడిని ప్రసన్నం చేసుకోవటానికి తహతహ లాడుతున్న చంద్రబాబంటే మండిపోతున్నారు కాంగ్రెస్ నేతలు. కాబట్టి కోర్టుల్లో తప్ప క్షేత్రస్ధాయిలో చంద్రబాబుకు మద్దతుగా నిలబడే పార్టీ ఏ యాంగిల్లో చూసినా  ఒక్క సీపీఐ మాత్రమే కనబడుతోంది. సీపీఐ మద్దతుతో టీడీపీ సాధించేదేముంటుంది ? అందుకనే తన పిలుపును ఎవరు పట్టించుకోకపోయినా ఎల్లోమీడియాలో మాత్రం బ్రహ్మండంగా ఉద్యమం జరిగిందని రాయించుకుని తృప్తి పడిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: