పదవులు ఇవ్వటంలో చంద్రబాబునాయుడు నూరుశాతం జగన్మోహన్ రెడ్డిని కాపీ కొడుతున్న విషయం మరోసారి బయటపడింది. తాజాగా ఏపి, తెలంగాణా రాష్ట్రాలకు అధ్యక్షులను నియమించారు. వీళ్ళతో పాటు జాతీయ కార్యవర్గం, పొలిట్ బ్యూరో సభ్యులను కూడా నియమించారు చంద్రబాబు. రెండు కమిటిలతో పాటు రెండు రాష్ట్రాల అధ్యక్షుల నియామకాన్ని చూస్తే పూర్తిగా జగన్ ఫార్ములాను చంద్రబాబు కాపీ కొట్టిన విషయం బయపడుతుంది. అసలు జగన్ కు భయపడే చంద్రబాబు కమిటిలను ప్రకటించాడా ? అనే అనుమానాలు కూడా పెరిగిపోతోంది. జగన్ ఆదివారం నాడు 56 బీసీ కార్పొరేషన్లకు ఛైర్మన్లను, పాలకవర్గాలను ప్రకటించిన విషయం తెలిసిందే.  జగన్ చేసిన నియామకాలతో బీసీల్లో  బాగా సానుకూలత కనిపిస్తోంది. ఇంత భారీ ఎత్తున బీసీలకు కార్పొరేషన్లను ప్రకటించటం, ఛైర్మన్లతో పాటు పాలకవర్గాలను నియమించటం ఇదే ప్రధమం.





పదవుల భర్తీ విషయంలో జగన్ కు వస్తున్న మైలేజీని గమనించిన తర్వాతే చంద్రబాబు కూడా హడావుడిగా సోమవారం కమిటిలను ప్రకటించారు. దానికితోడు రెండు రాష్ట్రాల అధ్యక్ష పదవుల్లోను బీసీలనే నియమించటం గమనార్హం. ఏపిలో కింజరాపు అచ్చెన్నాయుడు, తెలంగాణాలో ఎల్ రమణను అద్యక్షులుగా నియమించారు. బీసీలంతా జగన్ వైపు సానుకూలంగా ఉన్నారన్న విషయం గ్రహించిన తర్వాతే చంద్రబాబు కూడా అదే ఫార్ములాను ఫాలో అవ్వాలని డిసైడ్ అయినట్లుంది. అలాగే కమిటిల్లో కూడా బీసీలకే మెజారిటి పదవులను కట్టబెట్టారని చెప్పుకోవటానికి మాత్రమే చంద్రబాబు తాజా కమిటి పనికొస్తుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నపుడు మెజారిటి  బీసీలను దూరంగా పెట్టి, అవసరం కోసం వచ్చిన బీసీ సంఘాల నేతలపై నోరుపారేసుకున్న విషయం  అందరికీ తెలిసిందే.





అంటే అధికారంలో ఉన్నపుడు దూరం పెట్టిన బీసీ వర్గాలను ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత దగ్గరకు తీసుకునే ప్రయత్నంలోనే  చంద్రబాబు కమిటిల్లో చోటు కల్పించినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు మరచిపోయిన విషయం ఏమిటంటే అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి జగన్ బీసీలను దగ్గరకు తీసుకుని పదవులు అప్పగిస్తున్నాడు. ఒకేసారి 56 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, పాలకవర్గాలను నియమించటం ఇందులో భాగమే. మరి ఈ విషయంలో జగన్, చంద్రబాబుల మధ్య తేడాను బీసీలు గ్రహించకుండానే ఉంటారా ?  దాదాపు 30 ఏళ్ళుగా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న బీసీలు ఒక్కసారిగా ఎందుకు దూరమయ్యారనే విషయాన్ని ఆలోచించకుండా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న పద్దతిలో జగన్ చూసి చంద్రబాబు కూడా బీసీల జపం చేస్తే ఫలితం ఉంటుందా ?





ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుండి ఏపి, తెలంగాణాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తారని, రెండు రాష్ట్రాలకు కొత్త కార్యవర్గాలను ప్రకటిస్తారని ప్రచారం అందరికీ తెలిసిందే.  ఇదే సమయంలో జాతీయ కమిటిని, పాలిట్ బ్యూరోను కూడా కొత్తగా వేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఏడాదిన్నర తర్వాత హఠాత్తుగా అధ్యక్షులను, కమిటిని, పాలిట్ బ్యూరోను ఎందుకు వేసినట్లంటే జగన్ కు భయపడే అని అర్ధమైపోతోంది. ఎందుకంటే ఇంతోటి కమిటిలను వేయటానికి ఏడాదిన్నర కసరత్తు అవసరమే లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: