టీడీపీ అధినేత చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న మీడియా సంగతి అందరికీ తెలిసిందే. ఆయన మీడియా మేనేజ్ మెంట్ సామాన్యమైనది కాదు. సాక్షి మీడియా వచ్చే వరకూ చంద్రబాబుకు బాకా ఊదే మీడియాదే పై చేయిగా ఉండేది. ఇక ప్రస్తుత విషయానికి వస్తే.. ఏపీ సీఎం జగన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో పాటు హైకోర్టు న్యాయమూర్తులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ లేఖతో చంద్రబాబు న్యాయవ్యవస్థను మేనేజ్ చేస్తున్న తీరు ఒక్కసారిగా ప్రపంచానికి బట్టబయలైంది.  

జగన్ ఇచ్చిన షాకుతో ఒక్కసారిగా ఎలా స్పందించాలో.. అటు చంద్రబాబుకు ఇటు ఆయన అనుకూల మీడియాకు కూడా మొదట్లో పాలుపోలేదు. జగన్ లేఖ రాయడం, అందులో న్యాయ వ్యవస్థను గౌరవిస్తూనే, కొందరు జడ్జిల వ్యవహార శైలిని వివరించడం, వాటిని ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లం ద్వారా చెప్పించడం అన్నీ కూడా పక్కాగా జరిగినట్లు కనిపిస్తుంది. అసలు టీడీపీ మీడియాప్రెస్ మీట్ వార్తనే కవర్ చేయలేదు.

కానీ.. ఆ తర్వాత చంద్రబాబు అనుకూల మీడియా జగన్ తీరుపై కొందరు న్యాయవాదులు, న్యాయమూర్తులు  చేసిన విమర్శలకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తూ ప్రచారం చేస్తోంది. ఒక్కసారిగా పదే పదే అదే తరహా వార్తలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ తీరు గమనించిన పాఠకులకు ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారన్న విషయం ఇట్టే అర్థమైపోతోంది.

అంటే ఒక్క మాటలో చెప్పాలంటే.. చంద్రబాబు న్యాయవ్యవస్థను, అనుకూల మీడియాను అడ్డం పెట్టుకుని ఎలా మేనేజ్ చేస్తారన్న విషయం ఆయన అనుకూల పత్రికలు తాజాగా అనుసరిస్తున్న వ్యూహం చూస్తేనే అర్థమవుతోంది. అంటే చంద్రబాబు కుట్రను ఆ పత్రికలే ప్రపంచానికి చాటుతున్నాయని చెప్పుకోవచ్చు. అందుకే అంటారు.. ఏదైనా అతి చేయకూడదని.. ఇప్పుడు ఇంత వరకూ న్యాయమూర్తులతో చంద్రబాబు సంబంధాల గురించి తెలియని వారికి కూడా ఈ వివాదంతా అంతా అర్థమైపోతుందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: