ఏపీ సీఎం జగన్ న్యాయవ్యవస్థపై పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తులపైనే ఆయన ఆధారాలతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఇప్పుడు ఈ లేఖపై దుమారం రేగుతోంది. అయితే.. నిరంతరం జగన్ ను విమర్శించే తోక పత్రిక  చివరకు జగన్ లేఖను సమర్థించాడని ఓ దేశం మెచ్చిన న్యాయవాదిపైనా బురద జల్లే ప్రయత్నం చేసింది.  ఆయన్ను తక్కువ చేసి చూసేలా రాతలు రాశారు.

ఇంతకీ ఏం రాశారంటే...” ‘భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావలసి ఉన్న జస్టిస్‌ రమణపై జగన్‌ చేసిన ఫిర్యాదును న్యాయవాదుల సంఘాలతో పాటు పలువురు న్యాయ నిపుణులు తీవ్రంగా తప్పుబట్టారు. జగన్మోహన్‌ రెడ్డి చర్యను కేవలం ఇద్దరు మాత్రమే సమర్థించారు. వీరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్‌ ఏకే గంగూలీ ఒకరు. కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు ఇటీవల శిక్ష పడిన ప్రశాంత్‌ భూషణ్‌ రెండో వ్యక్తి. రిటైర్డ్‌ జస్టిస్‌ గంగూలీ తనపై ఒక యువతి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ చేయకూడదని అభ్యంతరం చెప్పడం గమనార్హం’


ఇదీ దేశం మెచ్చిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పై తోక పత్రిక కామెంట్.. ఆయన శిక్ష పడిన న్యాయవాది అట. ఆయనకు శిక్ష వేసేందుకు సుప్రీంకోర్టే ఎంతగా కిందామీదా పడిందో తెలిసిందే. చివరకు ఒక్క రూపాయి జరిమానా వేసి తన పరువు తానే కాపాడుకుందని  లోకమంతా కోడై కూసింది. అలాంటి ప్రశాంత్ భూషణ్‌ను శిక్ష పడిన న్యాయవాది అంటోంది మన తోక పత్రిక . జగన్ ను సపోర్ట్ చేసిన ప్రశాంత్ భూషణ్ సంగతి ఇలా ఉంటే.. మరి జ‌గ‌న్ లేఖ రాయ‌డాన్ని తప్పుబ‌ట్టిన ఢిల్లీ న్యాయ‌వాదుల సంఘం నాయ‌కుడి సంగతి ఏంటి..?

న్యాయవాది  రూ.200 కోట్లకు పైబ‌డి కేసులో ఐటీ సోదాల్లో ప‌ట్టుబ‌డిన వ్యక్తి కదా.. కానీ జగన్‌ ను వ్యతిరేకించాడు కదా.. ఆయన గొప్పవాడన్నమాట. మరి ప్రశాంత్ భూషణ్ చరిత్ర తెలిసే ఇలా రాశారా.. ఒక్కసారి ప్రశాంత్ భూషణ్ గురించి మనననం చేసుకుందాం.. యూపీఏ  పాలనలో నీరా రాడియా టేప్ కేసు, బొగ్గు గనులు, 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణాల లాంటి కేసులను ప్రశాంత్ భూషణ్ బయటకు తెచ్చారు.  2జీ కేసు ఫలితంగా అప్పటి టెలికాం మంత్రి రాజీనామా చేయడంతోపాటు జైలుకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. కానీ తోక పత్రికాధిపతికి ఇవేమీ కనిపించవు. ఎందుకో.. లోకమంతా తెలుసు.

మరింత సమాచారం తెలుసుకోండి: