టిడిపి అధినేత చంద్రబాబుకు అప్పుడే వరుసగా ఎన్నో ఎదురు దెబ్బలు తగిలేలా కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీలో వీరవిధేయులంతా దూరం కాగా, మిగిలినవారికి చంద్రబాబు శక్తి సామర్ధ్యాలపైన నమ్మకం తగ్గిపోయింది. ఇటీవల పార్టీలో ఎన్నో కమిటీల నియామకం పూర్తి చేసిన బాబు, ఆ నియామకాలతో పార్టీలో కొత్త ఉత్సాహం వస్తుందని అభిప్రాయపడగా, సొంత పార్టీ నేతలు ఆయనపై గుర్రుగా ఉన్నారట. తమకు కమిటీల్లో సరైన ప్రాధాన్యం కల్పించడం లేదని, తమను చంద్రబాబు పక్కన పెట్టేశారనే అభిప్రాయాలతో కొంత మంది ఉండగా, సొంత సామాజికవర్గ నేతలు సైతం బాబు తమను పట్టించుకోవడం లేదని, గతంలో మాదిరిగా తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు అని అలకబూనారట.గతంతో పోలిస్తే ఇప్పుడు టిడిపి కమ్మ సామాజిక వర్గం నేతలు ఎవరూ పెద్దగా యాక్టివ్ గా ఉన్నట్టు కనిపించడం లేదు.


 ఎవరికి వారు తమకు ఎందుకు వచ్చిందిలే అన్నట్టుగా సైలెంట్ అయిపోతున్నారు. అదీ కాకుండా, చంద్రబాబు తర్వాత, ఆ పార్టీ పగ్గాలు లోకేష్ కు అప్పగిస్తారనే భయం ఆ పార్టీ నేతలను వెంటాడుతోంది. ఇదిలా ఉంటే తాజాగా కమ్మ సామాజిక వర్గంలోని కొంతమంది చంద్రబాబు తర్వాత పార్టీని ఎవరు ముందుకు నడిపిస్తారు అనే విషయంపై కొత్త చర్చను ఏపీలో తీసుకువచ్చారట. ప్రస్తుతం చంద్రబాబు వయసు పైబడటంతో ఖచ్చితంగా బాబు టిడిపి పగ్గాలు లోకేష్ కు చెబుతారని, కానీ ఆయనకు పార్టీని నడిపించే అంతటి శక్తి సామర్ధ్యాలు లేవు కాబట్టి, కమ్మ సామాజిక వర్గం నాయకులంతా టీడీపీలో మరో ప్రత్యామ్నాయ నాయకుడిని తీసుకురాకపోతే, పార్టీ పరిస్థితి, తమ సామజిక వర్గం పరిస్తతి ఘోరంగా రావడంతో పాటు, కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం కోల్పోతుంది అనే ఆందోళనతో వారు ఇప్పటి నుంచే మరో కొత్త నేత కోసం వెతుకులాట ప్రారంభించినట్లు తెలుస్తోంది.


 ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ను టిడిపిలో యాక్టివ్ చేయాలని చూస్తున్నారట. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలో లేరు. దీంతో వివిధ పార్టీల్లో ఉన్న నాయకులను టీడీపీలో యాక్టివ్ చేయాలని చూస్తున్నా, అది కూడా వర్కవుట్ కావడంలేదట. అయినా కమ్మ నేతలు మాత్రం గట్టిగా వెతుకులాట ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. ఇక ఏపీ మంత్రి కొడాలి నాని పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఆయనకు బాబు మీద కోపం తప్ప టీడీపీ, ఎన్టీఆర్ ఫ్యామిలీ అంటే అభిమానం ఉందని, అందుకే ఆయన ను టీడీపీలోకి తేవాలని చూస్తున్నా, ఆయన వచ్చే అవకాశమే లేదని, జగన్ తోనే ఆయన ఉంటారని మరికొందరు వాదిస్తున్నారట. ఏది ఏమైతేనేమి, టీడీపీ తరువాత తెలుగుదేశం పార్టీకి కష్టకాలమే అనే అభిప్రాయం ఇప్పుడు సొంత సామజిక వర్గంలో వచ్చేయడం మాత్రం ఆశ్చర్యమే.

మరింత సమాచారం తెలుసుకోండి: