ప్రెస్ అకాడమీ.. దశాబ్దాలుగా జర్నలిస్టుల కోసం పని చేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత దానికి తెలంగాణ సీనియర్ పాత్రికేయుడు అల్లం నారాయణ తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అయ్యారు. ఆ తర్వాత ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి 100 కోట్ల రూపాయల గ్రాంటు ఇస్తామన్న హామీ పొందారు. ఆ మొత్తం రాబట్టంలో పూర్తిగా సఫలం కాకపోయినా దాదాపు 35 కోట్ల రూపాయల వరకూ తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చేతికి చేరాయి.

ఆ నిధులతో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి సాధ్యమైనంత మేర తెలంగాణ జర్నలిస్టులను ఆదుకుంటోంది. ఇటీవల కరోనా కాలంలో కరోనా బారిన పడిన జర్నలిస్టుకు10,000 నుంచి 20,000 వరకూ ఆర్థిక సాయం అందించింది. తెలంగాణ సర్కారు 34.50 కోట్ల రూపాయలు జర్నలిస్టుల సంక్షేమ నిధికి జమ అయ్యాయి. ఈ నిధి మీద వచ్చిన వడ్డీ ద్వారా జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి అమలు చేస్తోంది. లాక్ డౌన్ సమయంలో జీత భత్యాలు లేని దాదాపు పన్నెండు వందల మంది జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు, సానిటైజర్లు, మాస్కులను మీడియా అకాడమి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.

ఇప్పటి వరకు జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి వచ్చిన వడ్డీ ద్వారా 260 మంది చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయల చొప్పున 2 కోట్ల 60 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అలాగే దీర్ఝకాలిక వ్యాధులు,ప్రమాదాల బారిన పడిన 94 మంది జర్నలిస్టులకు 50 వేల రూపాయల చొప్పున 47 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.  ఆర్థిక సహాయం, ట్యూషన్ ఫీజు, పెన్షన్లను కలుపుకుని మొత్తంగా వీరందరికీ 5 కోట్ల 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.

మొత్తంగా జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి వచ్చిన 9 కోట్ల రూపాయల వడ్డీని జర్నలిస్టుల సంక్షేమానికి వినియోగించారు. మీడియా అకాడమి కార్యాలయానికి జర్నలిస్టులు ఆర్థిక సహాయం కోసం 37 మంది మరణించిన జర్నలిస్టుల కుటుంబాలు,  మరో 10 మంది దీర్ఝకాలిక వ్యాధులు, ప్రమాదాల బారిన పడిన జర్నలిస్టులు కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. వచ్చే నెలలో వీరందరికీ ఆర్థిక సహాయం అందజేస్తామని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ప్రకటించింది. ఆపదలో ఉన్న జర్నలిస్ట్ మిత్రులు తమ వివరాలను తెలంగాణ రాష్ట్ర మీడియా చైర్మన్ వాట్సప్ 8096677444 నెంబర్ కి పంపొచ్చు. మరిన్ని వివరాలకు  మీడియా అకాడమీ మేనేజర్ లక్ష్మణ్ కుమార్  సెల్ నెంబర్  9676647807 ని సంప్రదించవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: