జగన్ మార్క్ రాజకీయం ఎలా ఉంటుందో ఇప్పటికే ఆచరణలో పెట్టి మరీ చూపిస్తున్నారు ఏపీ సీఎం జగన్. అసలు జగన్ పాలన అంటేనే జనరంజకం అనే విధంగా ప్రజల్లో చర్చ జరగాలనేది జగన్ అభిప్రాయం. దానికి తగ్గట్టుగానే పరిపాలన చేసుకుంటూ ప్రజల్లో నమ్మకం కలిగిస్తూ మరో 30 ఏళ్ల పాటు జగనే సీఎం అనే అభిప్రాయం ప్రజల నుంచి వచ్చేలా చేయాలనేది జగన్ తాపత్రయం. దానికోసమే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లెక్కచేయకుండా, సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ ప్రజల్లో మరింత బలం పెంచుకునే దిశగా అడుగులు వేస్తూ వస్తున్నారు. 



జగన్ తీసుకున్న నిర్ణయాలు సంక్షేమ పథకాలు గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆయా రాష్ట్రాల్లో వాటిని అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే జగన్ తాపత్రయాన్ని ఆయన కేబినెట్ లో మంత్రులు సరిగా అర్థం చేసుకోలేనట్టుగా వ్యవహరిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యంగా కొంత మంది మంత్రుల పనితీరు వివాదాస్పదం గా  ఉండడం, వారికి పదేపదే పార్టీ నుంచి హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకోనట్టు వ్యవహరిస్తుండడం, అవినీతి వ్యవహారాల్లో మునిగి తేలుతూ ఉండడం, ఇలా ఎన్నో అంశాలు జగన్ కు ఆగ్రహం కలిగిస్తున్నాయి. అయినా వాటన్నిటినీ భరిస్తూనే జగన్ వస్తున్నారు.


 ఈ మధ్య కొంత మంది మంత్రుల పనితీరు మరింత గా వివాదాస్పదం కావడంతో, కొంత మంది మంత్రులను తప్పించాలని జగన్ సీరియస్ గా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రుల వ్యవహారశైలిపై చాలా కాలంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ విమర్శల కారణంగా ప్రభుత్వం అభాసుపాలవుతోంది. ప్రతిపక్షాలకు సైతం ఇదే ఆయుధంగా మారడంతో, ఏం చేయాలనే విషయంపై జగన్ సీరియస్ గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అన్ని విషయాల్లోనూ పారదర్శకతతో ఉంటూ వస్తున్న తమ ప్రభుత్వానికి కేవలం కొంతమంది వ్యక్తులు కారణంగా మచ్చ ఏర్పడడం జగన్ కు ఏ మాత్రం ఇష్టం లేదు. అందుకే ఇంత సీరియస్ గా  యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమవుతున్నారట. ప్రస్తుతం ఈ వ్యవహారంపై వైసిపి లో పెద్ద చర్చే నడుస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా,. సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: