క్షేత్రస్ధాయిలో వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. వ్యూహానికి ప్రతివ్యూహం పన్నటం, సక్సెస్ సాధించటమే విజేతలను ఎవరో తేల్చుతుంది. ఇపుడు జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నది ఇదే. ఇంతకీ విషయం ఏమిటంటే రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు చాలా కీలకమైపోయింది. ఇపుడు దీనిచుట్టూనే రాజకీయం మొత్తం నడుస్తోంది. తాజాగా పోలవరం ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం పంపించిన సవరించిన  అంచనాలు రూ. 44,578 కోట్లను ఆమోదించాలంటూ రాష్ట్రప్రభుత్వం విజ్ఞప్తి పంపింది. అయితే గతంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం పంపించిన సవరించిన అంచనాలు రూ. 55470 కోట్లను అప్పట్లో కేంద్రం ఆమోదించింది. అయితే తాజాగా స్పందించిన కేంద్రం మొత్తం ఖర్చు రూ. 20 వేల కోట్లకు మించదంటూ సమాచారం ఇచ్చింది. చేసిన ఖర్చులు, చేయాల్సిన ఖర్చులు అన్నీంటినీ కలుపుకుని రూ.4500 కోట్లు రీ ఎంబర్స్ మెంటు ఇస్తే సరిపోతుందని తేల్చింది. దీనికి అదనంగా మరో రూ.3 వేల కోట్లిస్తే సరిపోతుందని కూడా తేల్చేసింది. ఇక్కడే జగన్ కు కేంద్రంపై మండింది.




దురదృష్టం ఏమిటంటే రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు కూడా రాజకీయా ఆటుపోట్లకు గురవ్వటం. ఇటువంటి దరిద్రపు గొట్టు రాజకీయం మరే రాష్ట్రంలోను చూడమేమో. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్ధితులను అడ్డం పెట్టుకుని నరేంద్రమోడి సర్కార్  ఆటలాడటం మొదలుపెట్టింది. తాజాగా కేంద్రం చెప్పిన నిధుల లెక్కలతో పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తికాదన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. పోయిన ఎన్నికల్లో చంద్రబాబుపై  బాగా అవినీతి ఆరోపణలు రావటానికి పోలవరం ప్రాజెక్టు కూడా ఒకటన్న విషయం మరచిపోకూడదు. విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు బలవంతంగా తన చేతుల్లోకి తీసుకున్నారు. అప్పటి నుండి అంచనాలను తనిష్టం వచ్చినట్లు సవరించుకోవటం, కాంట్రాక్టర్లను తనిష్టం వచ్చినట్లు మార్చుకోవటంతో అవినీతి ఆరోపణలు విపరీతంగా పెరిగిపోయాయి.



ఇటువంటి అనేక కారణాలను గమనించిన తర్వాత తాజాగా ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను జగన్ కేంద్రానికి అప్పగించేయాలని డిసైడ్ చేసినట్లు సమాచారం. దీనివల్ల జగన్ కు చాలా పెద్ద రిలీఫ్ వస్తుందనటంలో సందేహమే లేదు. ఎలాగంటే ప్రాజెక్టు ఖర్చుకి పదివేల కోట్లే ఖర్చుపెడుతుందో లేకపోతే లక్ష కోట్లతో పూర్తి చేస్తుందో పూర్తిగా కేంద్రానిదే బాధ్యత.  రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా ఖర్చుండదన్న విషయం అందరికీ తెలిసిందే. నిర్మాణాన్ని పూర్తి చేసి రాష్ట్రానికి అప్పగించటమే కేంద్రం చేయాల్సింది. దీని వల్ల ప్రాజెక్టులో అవినీతి జరుగుతోందనే ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వం మీదుండదు. లాభమొచ్చినా, నష్టమొచ్చినా మొత్తం కేంద్రానికి బాధ్యత. అలాకాదని ప్రాజెక్టు నిర్మాణాన్ని తీసుకోవటానికి కేంద్రం ఒప్పుకోకుండా రాష్ట్రమే పూర్తి చేయాలని కేంద్రం స్పష్టంగా చెప్పిందే అనుకుందాం. అపుడు రాష్ట్రప్రభుత్వం పంపిన సవరించిన అంచనాల ప్రకారం నిధులు మంజూరు చేస్తేనే బాధ్యతలు తీసుకుంటామన్ను కండీషన్ను  జగన్ పెట్టబోతున్నారు. ఇదే విషయమై తేల్చటానికి రాష్ట్రం తరపున ప్రత్యేకంగా నిపుణుల బృందాన్ని ఢిల్లీకి వెళ్ళమన్నారు.




ఇక్కడ రాజకీయ కోణం కూడా ఉంది. పోలవరం పూర్తయితే తమ వల్లే ప్రాజెక్టు పూర్తవుతుందోని బీజేపీ క్లైం చేసుకుంటోంది. మరి అలా క్లైం చేసుకుంటున్న బీజేపీ అందుకు తగ్గట్లుగా నిధులు మాత్రం ఇవ్వటం లేదు.  ఇదే సమయంలో ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు చేసిన అవినీతి కూడా బయటపడబోతోంది. ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రం చేపడితే జరిగిన ఖర్చులు, దుబారా, అవినీతి మొత్తం బయటపడటం ఖాయం.  కాబట్టి ప్రాజెక్టు పూర్తి చేస్తుందో చేయదో జనాలకు కేంద్రమే సమాధానం చెప్పుకోవాలి. ఇదే సమయంలో చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిని కేంద్రమే బయటపెడుతుంది. అంటే ఒకే దబ్బకు రెండు పిట్టల్లన్నట్లుగా జగన్ వ్యూహం పన్నారు. చూద్దాం జగన్ వేసిన పథకానికి కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: